
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఏపీలకిచ్చిన హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు.
సోమవారం పార్లమెంటులో సోనియాగాంధీని కలుసుకొని తెలంగాణకు అమలు కావాల్సిన విభజన హామీలపై వినతిపత్రాన్ని సమర్పించినట్టు ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు కావస్తున్నా హైకోర్టు విభజన, బయ్యారం స్టీల్‌ప్లాంట్, పలు కేంద్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని ఆమెకు వివరించామన్నారు.