కాకి లెక్కలు చెప్పడంలో అమిత్‌షా సిద్ధహస్తుడు. గతంలో చాలా చోట్ల ఇలాంటి కాకిలెక్కలు చెప్పారు. ఆయన మాటల వల్ల రాష్ట్రానికి చేకూరిన లబ్ది శూన్యమని కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ద్వంద వైఖరి ఇప్పుడిప్పుడే జనానికి అర్థమవుతోందన్నారు. మోదీతో స్నేహం చేస్తూ.. అమిత్‌షాతో శతృత్వమా? అని ప్రశ్నించారు.