
డ్రగ్స్ కేసు నుంచి పెద్దోళ్లను కాపాడుతున్నారు
డ్రగ్స్ కేసుల నుంచి పెద్దోళ్లను కాపాడే విధంగా విచారణ జరుగుతోందని శాసనమండలిలో కాంగ్రెస్ ఉప నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.
సిట్ అధికారులకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ వాడుతున్న స్కూలు యాజమాన్యాలను విచారణకు ఎందుకు పిలవడంలేదని ప్రశ్నించారు. పబ్‌లపై విచారణ, నియంత్రణ జరగాలన్నారు. విచార ణలో బయటకు వచ్చిన అన్ని పేర్లను వెల్లడించా లన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని, వివరాలను సిట్‌కు అందిస్తామని చెప్పారు.