సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మండలి, శాసనసభల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి తీసుకున్న చర్యల గురించి వివరణ ఇవ్వాలని హామీల సభా కమిటీలో ప్రశ్నిస్తే.. 16 హామీలకు గాను ఒక్క హామీ అమలు కోసం మాత్రమే ఎలాంటి చర్యలు తీసుకున్నారో అధికారులు వివరించడం దౌర్భాగ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న హౌసింగ్ అక్రమాలపై వేసిన కమిటీ 18 నెలలవుతున్నా సమావేశం కాలేదని, ఇలాంటి కమిటీల్లో తాము ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. రైతుల గురించి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ముందుగా ఖమ్మంలో బేడీలు వేసి అరెస్టు చేసిన రైతులపై కేసులు ఎత్తివేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment