
టీపీసీసీ, సీఎల్పీ సమావేశాలు నిర్వహించాలి
పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు, కుంభకోణాలు, వ్యవసాయంపై కార్యాచరణ కోసం టీపీసీసీ, సీఎల్పీ విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతూ బాధ్యులకు లేఖలు రాసినట్టుగా వెల్లడించారు.