మాట్లాడుతున్న భట్టి విక్రమార్క, పక్కన కో ఆర్డినేటర్లు స్వప్న, రామ్మోహన్‌రెడ్డి తదితరులు
ఖమ్మంసహకారనగర్ : దేశంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాం«ధీ శక్తి యాప్ ప్రాజెక్ట్ చేపట్టారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం అవగాహన కల్పించేందుకు యాప్ ఆలిండియా కో ఆర్డినేటర్ స్వప్న, రాష్ట్ర కో ఆర్డినేటర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఈ యాప్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి ఆలిండియా స్థాయి వరకు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చేయవచ్చన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి పది వేల మంది చొప్పున ఈ యాప్‌లో చేర్చాలని నిర్ణయించారని తెలిపారు.
అనంతరం స్వప్న, రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పార్టీకి అనుబంధంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ సెల్‌తో పాటు డేటా అనాలైటిస్ట్ డిపార్ట్‌మెంట్ అనే కొత్త విభాగం ఉన్నాయని, నాయకులు, కార్యకర్తల పనితీరును గుర్తించి మండల, గ్రామస్థాయి పదవులను త్వరలో భర్తీ చేస్తామని అన్నారు. పదవులు పొందిన మరింత బాధ్యతగా పనులు చేసే అవకాశం ఉందన్నారు.
జూలై 17 వరకు లక్ష మందిని శక్తి యాప్‌లో చేర్చాలని నిర్ణయించామన్నారు. ఆ తర్వాత ఈ సంఖ్యను మూడు లక్షలకు పెంచుతామన్నారు. కేసీఆర్ ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, ఒకేసారి రైతు రుణమాఫీ వంటి హామీలు నెరవేర్చలేదని, ఇలాంటి విషయాలను యాప్ ద్వారా ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రటరీ నాగుబండి రాంబాబు, మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పీసీసీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నాయకులు యడవల్లి కృష్ణ, దిరిశాల భద్రయ్య, నర్సింహారావు, వీరభద్రం, హరిప్రియ, నాగేశ్వరరావు, లక్ష్మి, దుర్గాప్రసాద్, రాధాకిషోర్, జహీర్ అలీ, నరేందర్, శ్రీనివాస్‌యాదవ్, ఫజల్, రాములు నాయక్ పాల్గొన్నారు.
యాప్‌లో రిజిస్ట్రేషన్ ఇలా..
ఫోన్ నెంబర్ 7996179961ని శక్తి ఏఐసీసీగా ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటరు ఐడీ కార్డు నంబర్ శక్తి ఏఐసీసీకి మేసేజ్ చేయాలి. తర్వాత మీ సభ్యత్వాన్ని స్వీకరించాం అని లేదా ప్రాసెస్‌లో ఉందని ఏఐసీసీ నుంచి ఒక మేసేజ్ వస్తుంది. ఏఐసీసీ స్వీకరించినట్లు మేసేజ్ వస్తే శక్తి యాప్‌లో వివరాలు తెలుసుకోవటంతో పాటు సూచనలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment