
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి సభ పేరుతో ఖమ్మంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడారని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ‘కేటీఆర్ స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నాడు. అవినీతి సొమ్ముతో వచ్చిన అహంకారంతోనే రెచ్చిపోతున్నాడు. కాంగ్రెస్ నేతలు నకిలీ గాంధీలని మాట్లాడడం సరికాదు. మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ పాటించకుండా భట్టి విక్రమార్కను అవమానించడం రాష్ట్రంలోని దళితుల్ని అవమానించినట్టే’అని విమర్శించారు.