
"వాళ్లు విడాకులు తీసుకునే స్థితికి వచ్చారు.."
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యవైఖరి అలంభిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యవైఖరి అలంభిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలు వస్తాయని పెళ్లిళ్లు చేసుకున్న వారు విడాకులు తీసుకునే స్థితికి వచ్చారని అన్నారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కార్మిక సంఘాలతో తక్షణం చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె విఫలానికి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో పాటు రకరకాలుగా ప్రలోభ పెడుతోందన్నారు. పాలాభిషేకాలు చేయించుకోడం కాదు..హామీ నేరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నానన్న కేసీఆర్.. ఇప్పటికైనా మేల్కోవాలని సూచించారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బ్యాంకర్లు బంగారు రుణాలు ఇస్తున్నారే తప్ప వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎరువులను మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరలకు మార్క్ ఫెడ్ అమ్ముతోందని విమర్శించారు.