'కాంగ్రెస్‌ను ఉప్పుపాతరేయడం నీవల్ల కాదు' | ponguleti sudhakar reddy slams ktr | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్‌ను ఉప్పుపాతరేయడం నీవల్ల కాదు'

Published Tue, Apr 18 2017 4:20 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ను ఉప్పు పాతరేయడం దేశ చరిత్రలో ఎవరి వల్ల కాలేదని, కేటిఆర్ వల్ల ఏమవుతుందని సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

హైదరాబాద్‌: కాంగ్రెస్ ను ఉప్పు పాతరేయడం దేశ చరిత్రలో ఎవరి వల్ల కాలేదని, కేటిఆర్ వల్ల ఏమవుతుందని సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ ఫలాలను అనుభవిస్తూ.. అధికార అహంకారంతో కేటీఆర్‌ ఆట్లాడుతున్నాడని తెలిపారు. తన తండ్రి కేసీఆర్ కు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారం కోసం పాకులాడదన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం.. అవినీతి నిర్మూలనపై దృష్టి పెట్టమని అడగడం తప్పా అని ప్రశ్నించారు. కేటిఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు .. లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు కీలెరిగి వాత పెడతారు అని విమర్శించారు.
 
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతుంది మీరు కాదా .. చంద్రబాబుపై వంటికాలుపై లేచే మీ వాయిస్ ఎటుబోయిందని ప్రశ్నించారు. పోలవరం ముంపుపై ఎందుకు నోరు మెదపరు .. ఓటుకు నోటు ఎటు కేసు ఎటుబోయిందన్నారు. ఎంసెట్ 2 లీకేజీ లో కంటి తుడుపు చర్యలు సరికావన్నారు. ఈ లీకేజీ అంశాన్ని సీబీఐ విచారణ జరిపించాలన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకోవద్దన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement