ఢిల్లీ చేరిన సద్భావన యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఉగ్ర వాదం, మతతత్వం, డ్రగ్స్ మాఫియాలకు వ్యతిరేకంగా తమిళనాడులోని శ్రీపెరం బదూర్‌లో ప్రారంభించిన రాజీవ్‌జ్యోతి సద్భావనయాత్ర 9 రాష్ట్రాల్లో పర్యటించిన అనంతరం శనివారం ఢిల్లీకి చేరుకుంది. ఈ యాత్రలో తెలంగాణ సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కర్ణాటక మంత్రి ఖాదర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఢిల్లీ చేరు కున్న యాత్రకు కాంగ్రెస్ సీనియర్లు, ఢిల్లీ పీసీసీ నేతలు ఘనస్వాగతం పలికారు. పార్లమెంటు వద్ద రాజీవ్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అని కొనియా డారు. బోఫోర్స్ పేరుతో బీజేపీ ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, ఇది గర్హనీయ మన్నారు. ఈ యాత్ర జ్యోతిని ఆదివారం వీర్‌భూమి వద్ద ఉంచి ఉగ్రవాదానికి, మతత త్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రతిజ్ఞ చేయించనున్నట్లు పొంగులేటి తెలిపారు.