rajiv gandhi jayanti
-
సవాళ్లెదురైనా పోరాటం ఆగదు
న్యూఢిల్లీ: ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ విభజన శక్తులకు వ్యతిరేకంగా బలమైన సైద్ధాంతిక పోరు కొనసాగిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని ఆమె అన్నారు. తీవ్రమైన సవాళ్లు ఎదురైనప్పటికీ విభజన వాద శక్తులపై తమ సైద్ధాంతిక పోరాటం కొనసాగుతుందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశంలో 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ రాజ్యాంగ సంస్థలను నాశనం చేయడానికో, ప్రజల్లో భయోత్పాతం సృష్టించేందుకో, బెదిరించటానికో దివంగత రాజీవ్ దానిని ఒక అవకాశంగా తీసుకోలేదని పరోక్షంగా మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ‘1989 ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా మెజారిటీ సీట్లు గెలుచుకోకపోవడంతో, ఏకైక పెద్ద పార్టీ అయినప్పటికీ రాజీవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించలేదు. రాజీవ్ నిజాయితీని, మనస్సాక్షినే నమ్ముతారనేందుకు ఇదే నిదర్శనం’ అని తెలిపారు. రాజీవ్ నమ్మి, ఆచరించిన విలువలను కొనసాగించేందుకు పునరంకితం కావాలని, అదే రాజీవ్‌కు ఘనమైన నివాళి అని కార్యకర్తలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. రాజీవ్ వల్లే భారత సమాఖ్య బలోపేతం మాజీ ప్రధాని రాజీవ్ హయాంలో కుదిరిన పంజాబ్, అస్సాం, మిజోరం ఒప్పందాల వల్లే మన సమాఖ్య మరింత బలోపేతమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన సాధించిన విజయాలను రాహుల్ గుర్తు చేసుకున్నారు. -
రాజీవ్ గాంధీకి ఘననివాళి
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 74వ జయంతి కార్యక్రమాలను వీర్‌భూమి వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర సీనియర్ నాయకులు వీర్‌భూమి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ‘రాజీవ్‌గాంధీ సున్నిత మనస్కుడు, స్నేహశీలి, దయార్ద్ర హృదయుడు. ఆయన అకాల మరణం నా జీవితంలో తీరని లోటు. ఆయనతో గడిపిన సమయం, మేమందరం ఆయనతో కలసి ఆనందంగా జరుపుకున్న పుట్టినరోజు వేడుకలు గుర్తుకొస్తున్నాయి. నా మదిలో ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి’’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఢిల్లీ చేరుకున్న రాజీవ్‌జ్యోతి సద్భావన యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఉగ్రవాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర ఢిల్లీ చేరుకుంది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చెన్నైలోని పెరంబుదూర్ నుంచి ఆగస్టు 9న చేపట్టిన ఈ యాత్రలో పలు రాష్ట్రాల పీసీసీ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వారికి ఆహ్వానం పలికి జ్యోతి అందుకున్నారు. యాత్రలో పాల్గొన్న నేతలు పార్లమెంటు వద్ద ఉన్న రాజీవ్ విగ్రహానికి నివాళులర్పించి పాలాభి షేకం చేశారు. సోమవారం రాజీవ్ జయంతి సందర్భంగా సద్భావన యాత్ర జ్యోతిని వీర్‌భూమి వద్ద ఉంచుతామని చెప్పారు. -
ఢిల్లీ చేరిన సద్భావన యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఉగ్ర వాదం, మతతత్వం, డ్రగ్స్ మాఫియాలకు వ్యతిరేకంగా తమిళనాడులోని శ్రీపెరం బదూర్లో ప్రారంభించిన రాజీవ్‌జ్యోతి సద్భావనయాత్ర 9 రాష్ట్రాల్లో పర్యటించిన అనంతరం శనివారం ఢిల్లీకి చేరుకుంది. ఈ యాత్రలో తెలంగాణ సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కర్ణాటక మంత్రి ఖాదర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఢిల్లీ చేరు కున్న యాత్రకు కాంగ్రెస్ సీనియర్లు, ఢిల్లీ పీసీసీ నేతలు ఘనస్వాగతం పలికారు. పార్లమెంటు వద్ద రాజీవ్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అని కొనియా డారు. బోఫోర్స్ పేరుతో బీజేపీ ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, ఇది గర్హనీయ మన్నారు. ఈ యాత్ర జ్యోతిని ఆదివారం వీర్‌భూమి వద్ద ఉంచి ఉగ్రవాదానికి, మతత త్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రతిజ్ఞ చేయించనున్నట్లు పొంగులేటి తెలిపారు. -
రాజీవ్ గాంధీ ఆశయసాధనకు కృషి
కడపౖవెఎస్సార్ సర్కిల్: రాజీవ్‌గాంధీ ఆశయసాధనకు కృషి చేద్దామంటూ డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. రాజీవ్‌పార్కు, రిమ్స్ వద్దనున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి, డీసీసీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు దేశం శ్రాస్త, సాంకేతిక రంగాలల్లో అభివృద్ధి చెందడానికి కారణం రాజీవ్‌గాంధీ కృషియే కారణమన్నారు. యువతకు 21సంవత్సరాలు కాకుండా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందన్నారు.అనంతరం అల్షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ సత్తార్, పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, జిల్లా సేవాదళ్ చెర్మెన్ చీకటి చార్లెస్, జిల్లా సేవాదళ్ మహిళా చెర్మెన్ గౌసియా, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుజాతరెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ చైర్మన్ విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.