
రాజీవ్‌కు నివాళులర్పిస్తున్న సోనియా గాంధీ. చిత్రంలో రాహుల్, ప్రియాంక, రాబర్డ్ వాద్రా
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 74వ జయంతి కార్యక్రమాలను వీర్‌భూమి వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర సీనియర్ నాయకులు వీర్‌భూమి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ‘రాజీవ్‌గాంధీ సున్నిత మనస్కుడు, స్నేహశీలి, దయార్ద్ర హృదయుడు. ఆయన అకాల మరణం నా జీవితంలో తీరని లోటు. ఆయనతో గడిపిన సమయం, మేమందరం ఆయనతో కలసి ఆనందంగా జరుపుకున్న పుట్టినరోజు వేడుకలు గుర్తుకొస్తున్నాయి. నా మదిలో ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి’’ అని రాహుల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.