
రైతులను ఆదుకోవడంలో విఫలం
రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు.
ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో మే 13, 14 తేదీల్లో నిర్వహించే ‘మెజిస్టిక్ గ్రాండ్ అచీవర్స్–2017’కు తనకు ఆహ్వానం రావడంపై సోనియా అభినందించారని తెలిపారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను పూర్తిగా పెడచెవిన పెట్టిందని విమర్శించారు.