కాంగ్రెస్‌పై విమర్శలు సరికావు | The Criticism Of The Congress Is Not Correct | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌పై విమర్శలు సరికావు

Published Fri, Jul 13 2018 11:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

The Criticism Of The Congress Is Not Correct - Sakshi

మాట్లాడుతున్న  పొంగులేటి సుధాకర్‌రెడ్డి   

ఖమ్మంసహకారనగర్‌: కాంగ్రెస్‌ పార్టీపై పలువురు ప్రజాప్రతినిధులు విమర్శలు చేయటం సరికాదని సీఎల్పీ ఉప నాయకులు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టం లో పొందుపర్చిన అంశాలపై దృష్టి సారించి ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. జూన్‌లో రుణ ప్రణాళిక పెట్టాల్సి ఉండగా, ఇటీవలే సమావేశం నిర్వహించారన్నారు.

యుద్ధప్రాతిపదికన పంట రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లు, అధికార యంత్రాం గం చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటక సమీపం లోని ఆల్‌మట్టి, నారాయణపూర్‌ తదితర ప్రాం తాల నుంచి నీటిని అక్కడ రాష్ట్రాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, గత ంలో మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలతో అనే క మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సీసీసీ(కార్పొరేట్, కాంట్రాక్టర్, కరప్షన్‌)గా పరిపాలన ఉందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌లోనే అవిశ్వా  సం పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. భవిష్య  త్తులో అది రెట్టింపవుతుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏపీకి 7 మండలాలు పోయి నష్టాల్లో ఉన్నామని, నల్గొండకు రెండు మెడికల్‌ కళాశాలలు కేటాయించారని, ఖమ్మం జిల్లా విషయంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించా రు.

ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటు కోసం ఆం దోళన చేస్తామని హెచ్చరించారు.  సమావేశంలో మైనార్టీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఎండి ఫజల్, నాయకులు వీరారెడ్డి, రంగారావు  పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement