
కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ గద్వాలలో చేసిన సవాల్‌పై నిలబడతారా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై అనుచితంగా మాట్లాడటం సరికాదని అన్నారు. మున్సిపాలిటీలలో ఊడ్వడానికి చీపుర్లు కూడా లేవన్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లపై ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తున్నారని పొంగులేటి విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్ర ప్రజలకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదని అన్నారు.