ఈ మెడికల్‌ షాపు ప్రత్యేకతేంటో తెలుసా? | Viral News Medical Shop In Punjab Named With Daughters | Sakshi
Sakshi News home page

ఈ షాపు రూటే సపరేటు!

May 23 2020 7:08 PM | Updated on May 23 2020 7:14 PM

Viral News Medical Shop In Punjab Named With Daughters - Sakshi

గుప్తా అండ్‌ డాటర్స్‌ అని ఉన్న నేమ్‌ బోర్డు

కేవలం ట్విటర్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఫేస్‌బుక్‌లో....

చండీగఢ్‌‌ : మామూలుగా ఏవైనా షాపు నేమ్‌ బోర్డులు ‘‘ సుబ్రహ్మాణ్యం అండ్‌ సన్స్‌.. వెంకటేశ్వర్లు‌ అండ్‌ సన్స్‌’’ అంటూ పేరు చివర కుమారులను భాగస్వాములను చేస్తూ వ్యాపారాలు నడపటం పరిపాటి. కానీ పంజాబ్‌కు చెందిన ఓ మెడికల్‌ షాపు ఓనర్‌ మాత్రం ఉన్నతంగా ఆలోచించాడు. ‘‘ గుప్తా అండ్‌ డాటర్స్‌’’  అని షాపుకు పేరుపెట్టి వ్యాపారంలో కుమార్తెలను కూడా భాగస్వాములను చేశాడు. పంజాబ్‌లోని లుధియానాలో దర్శనమిచ్చింది ఈ మెడికల్‌ షాపు. డాక్టర్‌ అమన్‌ కశ్యప్‌ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన ఫొటోను శుక్రవారం తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీంతో మెడికల్‌ షాపు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.(క్షణం ఆలస్యం అయ్యుంటే పరిస్థితి ఏంటి?)

2,500 లైక్స్‌, 500పైగా కామెంట్లతో దూసుకుపోతోంది. కేవలం ట్విటర్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఫేస్‌బుక్‌లో కూడా వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు ‘‘ లవ్‌ ఇట్‌!... కొత్త శకం మొదలవుతోంది... నేను కూడా మా నాన్నకు ఇదే చెప్పాను. ఆయన ఒప్పుకోలేదు. దీన్ని చూసి చాలా సంతోషపడుతున్నా.. మా నాన్న కూడా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (కంట‌త‌డి పెట్టిస్తోన్న చిన్నారుల లేఖ‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement