కన్న కూతురిని హతమార్చిన తల్లి.. ఆపై | Punjab Family Eliminates Daughter Cremated Body Amid Lockdown | Sakshi
Sakshi News home page

కన్న కూతురిని హతమార్చి.. బూడిద చేసి..

Published Tue, Apr 28 2020 1:27 PM | Last Updated on Tue, Apr 28 2020 1:31 PM

Punjab Family Eliminates Daughter Cremated Body Amid Lockdown - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అర్ధరాత్రి కూతురి చేత బలవంతంగా నిద్రమాత్రలు మింగించి.. తన కజిన్‌ శివరాజ్‌, లాలాను పిలిపించింది. వారిద్దరు నిద్రలో ఉన్న బాధితురాలిని గొంతునులిమి..

చండీగఢ్‌: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ పంజాబ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. తమను ఎదురించి ప్రియుడి ఇంటికి చేరుకున్న కూతురిని దారుణంగా హతమార్చింది ఓ తల్లి. మిస్సింగ్‌ కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టగా.. వాస్తవాలు బయటపడటంతో కటకటాలపాలైంది. వివరాలు.. హోషియాపూర్‌కు చెందిన బల్వీందర్‌ కౌర్‌ కుమార్తె(19) అమన్‌ప్రీత్‌ సింగ్‌ అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఇంట్లో గొడవపడి భల్జాన్‌ గ్రామంలో ఉన్న అమన్‌ వద్దకు చేరుకుంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి బల్వీందర్‌ తమ కుమార్తె కనిపించడం లేదని.. ఇందుకు అమనే కారణమంటూ పోలీసులకు ఏప్రిల్‌ 22న ఫిర్యాదు చేసింది.(ఫేస్‌బుక్‌ వీడియోపై కామెంట్లు చేసిందని..)

ఈ క్రమంలో తన బంధువులు సదేవ్‌, ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు గుర్దీప్‌ సింగ్‌ సహా మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో పంచాయతీ పెట్టించి కూతురిని తిరిగి ఇంటికి తీసుకువచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్‌ 25 అర్ధరాత్రి కూతురి చేత బలవంతంగా నిద్రమాత్రలు మింగించి.. తన కజిన్‌ శివరాజ్‌, లాలాను పిలిపించింది. వారిద్దరు నిద్రలో ఉన్న బాధితురాలిని గొంతునులిమి చంపేశారు. అనంతరం సత్యదేవ్‌, గుర్దీప్‌లతో కలిసి బల్వీందర్‌ కూతురి శవాన్ని రహస్యంగా కాల్చేసి మిన్నకుండిపోయింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బల్వీందర్‌, శివరాజ్‌లను విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారితో పాటు లల్లా, గుర్దీప్‌, సదేవ్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.(‘లూడో’లొ ఓడించిందని భార్యను..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement