Baroda Player Vishnu Solanki: బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో సెంచరీతో మెరిశాడు. చంఢీఘర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సోలంకి ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇందులో వింతేముంది.. అందరి క్రికెటర్ల లాగే తాను సెంచరీ బాదాడనుకుంటే పొరపాటే అవుతుంది. విష్ణు సోలంకి సెంచరీ వెనుక విషాధగాథ ఉంది. కొన్ని రోజుల క్రితం విష్ణు సోలంకి కూతురు చనిపోయింది. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో ఆ పసికందు కన్నుమూసింది. ఆ సమయంలో విష్ణు రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు.
కూతురు చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సోలంకి.. హుటాహుటిన బయలుదేరి కూతురు అంత్యక్రియలు నిర్వహించాడు. ఆట మీద మక్కువతో బాధను దిగమింగుకొని మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. వస్తూనే సోలంకి చంఢీఘర్‌తో మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు. పుట్టిన బిడ్డను కోల్పోయి కూడా సెంచరీతో మెరిసి ఔరా అనిపించిన విష్ణు సోలంకిని మెచ్చుకోకుండా ఉండలేము. ''అంత బాధను దిగమింగి సూపర్ ఇన్నింగ్స్ ఆడావు.. నీ ఆటకు సలామ్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.
ఇక మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బరోడా ఆల్‌రౌండర్ 161 బంతులెదుర్కొని 12 బౌండరీల సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సోలంకి సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ఆట రెండో రోజు పూర్తైంది. ప్రస్తుతం బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. అంతకముందు చంఢీఘర్ తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగుల ఆధిక్యంలో ఉండడం విశేషం.
చదవండి: Rohit Sharma: టీమిండియా సరికొత్త చరిత్ర.. తొలి కెప్టెన్‌గా రోహిత్!
Ranji Trophy 2022: తమిళనాడు కవల క్రికెటర్ల సరికొత్త చరిత్ర.. ఒకే ఇన్నింగ్స్‌లో..
What a player . Has to be the toughest player i have known. A big salute to vishnu and his family by no means this is easy🙏 wish you many more hundreds and alot of success 🙏🙏 pic.twitter.com/i6u7PXfY4g
— Sheldon Jackson (@ShelJackson27) February 25, 2022
Comments
Please login to add a commentAdd a comment