born baby dead
-
ఝాన్సీ ఆసుపత్రి విషాదం.. డిప్యూటీ సీఎంకి వీఐపీ వెలకమ్
ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాల ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాపించి పది మంది నవజాత శిశువులు సజీవదహనమవ్వడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. ఈ విషాదం వేళ ఆస్పత్రికి వర్గాలు వ్యవహరించిన తీరుపై విమర్శలకు దారితీసింది. ఝాన్సీ ఆసుపత్రికి ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ వస్తున్నారని తెలిసి... ఆయన రాక ముందే సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేసి, సున్నం చల్లడం వంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. బీజేపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టింది.ఓవైపు అగ్నిప్రమాదంలో చిన్నారులు మృత్యువాత పడి.. వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే.. మరోవైపు ఉప ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికేందుకు రోడ్లు శుభ్రం చేసి, సున్నం చల్లుతున్నారంటూ కాంగ్రెస్ మండిపింది. . అప్పటి వరకు మురికి కూపంలా ఉన్న ఆస్పత్రి ఆవరణను డిప్యూటీ సీఎం రాక వేళ శుభ్రం చేశారని స్థానికులు తెలిపినట్లు పేర్కొంది. మంటల్లో చిన్నారులు చనిపోతే.. ఈ ప్రభుత్వం తన ఇమేజ్ను కాపాడుకోవడానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని, ఇది సిగ్గుచేటని మండిపడింది.BJP सरकार की संवेदनहीनता देखिए।एक ओर बच्चे जलकर मर गए, उनके परिवार रो रहे थे, बिलख रहे थे। दूसरी तरफ, डिप्टी CM के स्वागत के लिए सड़क पर चूने का छिड़काव हो रहा था।परिजनों का यहां तक कहना है कि पूरे कम्पाउंड में गंदगी फ़ैली हुई थी, जो डिप्टी CM के आने से पहले ही साफ की गई।… pic.twitter.com/M1sk8SAa0E— Congress (@INCIndia) November 16, 2024యూపీలోని ప్రభుత్వ ఆస్పత్రులు అవినీతికి, నిర్లక్ష్యానికి నిలయాలుగా మారాయని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. చిన్నారులను రక్షించడానికి ఆస్పత్రిలో ఎలాంటి ఏర్పాట్లూ లేవని ఆరోపించింది. ప్రజలు చనిపోతున్నా ఆ పార్టీకి ఏమీ పట్టదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జుహీ సింగ్ విమర్శించారు. కాగా ఆసుపత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటల వ్యాపించడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రిలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే మెడికల్ కాలేజీ దగ్గరకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితేవిద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. ఈ దుర్ఘటనలో పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అయితే మంటలు చెలరేగిన వార్డులో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు కనిపించడంతో పాటు సేఫ్టీ అలారాలు కూడా మోగలేదు. 2020లో ఎక్స్టింగ్విషర్ల గడువు ముగిసినట్లు గుర్తించారు. -
కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..
-
కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..
Baroda Player Vishnu Solanki: బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి రంజీ ట్రోఫీ 2022 సీజన్లో సెంచరీతో మెరిశాడు. చంఢీఘర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సోలంకి ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇందులో వింతేముంది.. అందరి క్రికెటర్ల లాగే తాను సెంచరీ బాదాడనుకుంటే పొరపాటే అవుతుంది. విష్ణు సోలంకి సెంచరీ వెనుక విషాధగాథ ఉంది. కొన్ని రోజుల క్రితం విష్ణు సోలంకి కూతురు చనిపోయింది. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో ఆ పసికందు కన్నుమూసింది. ఆ సమయంలో విష్ణు రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. కూతురు చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సోలంకి.. హుటాహుటిన బయలుదేరి కూతురు అంత్యక్రియలు నిర్వహించాడు. ఆట మీద మక్కువతో బాధను దిగమింగుకొని మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. వస్తూనే సోలంకి చంఢీఘర్‌తో మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు. పుట్టిన బిడ్డను కోల్పోయి కూడా సెంచరీతో మెరిసి ఔరా అనిపించిన విష్ణు సోలంకిని మెచ్చుకోకుండా ఉండలేము. ''అంత బాధను దిగమింగి సూపర్ ఇన్నింగ్స్ ఆడావు.. నీ ఆటకు సలామ్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బరోడా ఆల్‌రౌండర్ 161 బంతులెదుర్కొని 12 బౌండరీల సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సోలంకి సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ఆట రెండో రోజు పూర్తైంది. ప్రస్తుతం బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. అంతకముందు చంఢీఘర్ తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగుల ఆధిక్యంలో ఉండడం విశేషం. చదవండి: Rohit Sharma: టీమిండియా సరికొత్త చరిత్ర.. తొలి కెప్టెన్‌గా రోహిత్! Ranji Trophy 2022: తమిళనాడు కవల క్రికెటర్ల సరికొత్త చరిత్ర.. ఒకే ఇన్నింగ్స్‌లో.. What a player . Has to be the toughest player i have known. A big salute to vishnu and his family by no means this is easy🙏 wish you many more hundreds and alot of success 🙏🙏 pic.twitter.com/i6u7PXfY4g — Sheldon Jackson (@ShelJackson27) February 25, 2022 -
మూగబోయిన మాతృత్వం.. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో
కేవీబీపురం (చిత్తూరు జిల్లా): నవమాసాలు మోసి, పురిటి నొప్పులకోర్చి ప్రసవించిన తల్లి పొత్తిళ్లలో బిడ్డను చూసుకుని మురిసిపోతుంది. అప్పటివరకు పడిన కష్టాన్నంతా మర్చిపోతుంది. అయితే గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం ఓ తల్లికి శాపమైంది. పురిట్లోనే బిడ్డను కోల్పోయిన ఆ తల్లి రోదనలతో మాతృత్వం మూగబోయింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం కొత్తూరు పంచాయతీ గోపాలకృష్ణపురం గిరిజన కాలనీకి చెందిన సుబ్బమ్మ (28)కు నెలలు నిండాయి. అప్పటివరకు స్థానిక పీహెచ్సీ కోవనూరులో చూపించుకుంటూ వచ్చింది. శుక్రవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆశా కార్యకర్తకు సమాచారం అందించారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులే కాన్పు చేసే ప్రయత్నం చేశారు. సాధ్యంకాక ఉదయం 7 గంటలకు 108కు సమాచారం అందించారు. అప్పటికే పురిటి నొప్పులు అధికం కావడంతో గ్రామానికి 2 కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రధాన రహదారికి చేరుకునేందుకు మట్టి రోడ్డు మీదుగా స్థానికులు చేతులపై ఆమెను మోసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంతలోనే ఆమె నడిరోడ్డుపైనే ప్రసవించింది. కొంతసేపటికే శిశువు మృతి చెందింది. 108 సమయానికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. అదే 108లో తల్లీబిడ్డను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శిశువు మరణించినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. బాలింతకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. -
అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి
మహబూబ్‌నగర్: తల్లి గర్భంలోనే ఆ శిశువుకు నూరేళ్లు నిండాయి. ఆపరేషన్ ద్వారా వైద్యులు శిశువు మృతదేహాన్ని బయటకు తీయగా.. ఆ కుటుంబసభ్యులు మానవత్వం మరిచారు. పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయకుండానే దారిలో చెత్తకుప్పలో ఆ ఆడ శిశువు మృతదేహాన్ని పడేసిన ఘటన గురువారం మహబూబ్‌నగర్‌లో కలకలం రేపింది. జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం బకారం గ్రామానికి చెందిన మహిళ మూడో కాన్పు కోసం మార్చి 29న నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి వెళ్లింది. అప్పటికే గర్భసంచిలో పిండం మృతి చెందడంతో హైరిస్క్ కేసు కింద వారు మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రాత్రి 11.30 వచ్చారు. రాత్రి 1.30 ప్రాంతంలో ఆపరేషన్ చేసి తల్లి గర్భంలో నుంచి మృతి చెందిన ఆడ శిశువును బయటకు తీశారు. తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో శిశువు మృతదేహాన్ని తండ్రికి అప్పగించి స్వగ్రామానికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లకుండా పట్టణంలోని ఓ డ్రైనేజీ సమీపంలో ఉండే చెత్తకుప్పలో పడేశారు. గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. శిశువు చేతిపై ఆస్పత్రి సిబ్బంది ఏర్పాటు చేసిన ట్యాగ్ ద్వారా ఎవరి శిశువు అనే విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను పిలిపించి అడిగితే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. -
అమ్మా ! నాకెందుకు ఈ శిక్ష..
అమ్మా..! నేను చేసిన నేరమేమిటి? నాన్న ఆడ పిల్ల వద్దన్నందుకు నెలలు నిండకముందే నేలపై విసిరేశావా? లేదా ‘తప్పు’ దారిలో నడిచి తల్లి అవుతున్నందుకు భయపడ్డావా? చేతులెట్లా వచ్చెనమ్మా నన్ను చెత్తకుప్ప పాలు చేసేందుకు? మీరు చేసిన పాపానికి నాకెందుకమ్మా శిక్షా? సాక్షి, బేతంచెర్ల(కర్నూలు) : పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం చెత్త కుప్పలో నెలలు నిండని ఆడ మృత శిశువును స్థానికులు కనుగొన్నారు. చెత్త కుప్పలో పడి ఉన్న శిశివును కుక్కలు ఎత్తుకొని వెళ్తుండటం గమనించి కాలనీ వాసులు అడ్డుకున్నారు. వెంటనే పంచాయతీ ఈఓ జితేంద్రకు సమాచారం ఇవ్వడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలనీల్లో ఎవరైనా ప్రసవించారా అని అంగన్వాడీ కార్యకర్తలతో విచారించారు. పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని కాలనీవాసులతో చర్చించారు. కాగా మృత శిశువు బొడ్డు తాడు, ముఖంపై గాయాలు ఉన్నాయి. నెలలు నిండక ముందే ప్రసవించిందో లేక, అడ్డదారిలో తల్లి అవుతున్నందుకు భయపడిందో ఏమో ఇలా చెత్త కుప్ప పాలు చేసేందుకు చేతులెట్లా వచ్చె అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏ తల్లి నిను కన్నదో..
విజయనగరం రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫాంపై రెండు నెలల క్రితం రెండు నెలల వయసున్న ఆడశిశువును వదిలి వెళ్లిపోయారు. రైల్వే పోలీసులు చైల్డ్‌లైన్ 1098 సంస్థకు సమాచారం అందించగా శిశుగృహకు తరలించారు. తాజాగా ఆదివారం విజయనగరం ఎల్ఐసీ భవనం సమీపంలోని పొలంలో అట్టపెట్టెలో మగ శిశువు మృతదేహాన్ని ఉంచి పడేశారు. పోలీసులు మృతదేహాన్ని కేంద్రాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. తరచూ ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఏ పాపం తెలియని పసి కూనలు చెత్త కుప్పల పాలవుతున్నారు. వీరిలో ఆడ శిశువులే అధికంగా ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది – విజయనగరం ఫోర్ట్ సాక్షి, విజయనగరం : అమ్మ ఒడిలో వెచ్చగా నిద్రపోవలసిన పసివాళ్లకు చెత్తకుండీలు పానుపులు అవుతున్నాయి. తల్లి గర్భం నుంచి బయట పడగానే నూరేళ్లు నిండిపోతున్నాయి. కళ్లు తెరవకముందే కడతేరిపోతున్న పసికందుల్ని చూసిన కళ్లు కన్నీరొలుకుతున్నాయి. కొందరు శిశువులను చెత్తకుండీలు, తుప్పల్లో పడేస్తుంటే.. మరి కొందరు ఆలయాలు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో వదిలేస్తున్నారు. ఎవరి కంటయినా పడితే బతికి బట్టగడుతున్నారు.. లేదా కుక్కలు, నక్కలకు ఆహారమవుతున్నారు. అందరూ ఉన్నా ఎవరికేమీ కాని అనాథలవుతున్నారు. బతికి బట్ట కట్టినవారు సమాజం నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. చెత్తకుప్పల్లో పడేసిన తల్లిదండ్రులు తిరిగి రారు. మనసు మార్చుకుని వెనక్కి తీసుకెళ్లరు. అనాథ శిశువుల భవితను అంధకారం చేస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్లే.. వివాహేతర సంబంధాల వల్ల గర్భం దాల్చినవారు శిశువుల సంగతి బయట5పడితే పరువు పోతుందని భయపడి చెత్తకుప్పలు, బావుల్లో పడేస్తున్నట్టు సమాచారం. వివాహం కాకుండా గర్భవతులు అయిన మహిళలు శిశువులను వదిలించుకోవడానికి విక్రయించడం లేదా తుప్పలు, చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. దూర ప్రాంతాల్లో వదిలేస్తున్న తల్లిదండ్రులు కొందరు కసాయి తల్లిదండ్రులు శిశువులను దూర ప్రాంతాలకు తీసుకుని వెళ్లి ఆలయాలు, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ వంటి ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. ఇలా వదిలేసిన పిల్లలు ఇటీవల ఎక్కువవుతున్నారు. మరికొందరు తల్లిదండ్రులు పిల్లలపై చీటికి మాటికి కోపం ప్రదర్శించి.. వారే ఇల్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితులు సృష్టిస్తున్నట్టు సమాచారం. రోడ్డున పడుతున్న శిశువులు తల్లిదండ్రులు చేసిన తప్పిదాలకు శిశువులు బలి అవుతున్నారు. అభం, శుభం తెలియని శిశువులు చెత్తకుప్పల పాలవుతున్నారు. మరికొందమంది మృత్యువాత పడుతున్నారు. అపురూపంగా పిల్లలను పెంచాల్సిన తల్లిదండ్రులు నరరూప రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. శిశుగృహకు అప్పగించండి పిల్లలు అవసరం లేదునుకునే వారు శిశుగృహకు అప్పగించాలి. అప్పగించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. అన్ని రకాల వసతి రక్షణ కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తాం. శిశువులను చెత్తకుప్పల పాల్జేయడం మంచిది కాదు. – ఎం.అరసివిల్లినాయుడు, మేనేజర్, శిశు గృహ 1098కి కాల్ చేయండి పిల్లలు అక్కర్లేకపోతే చైల్డ్‌లైన్ ట్రోల్ ఫ్రీ నంబరు1098కు ఫోన్ చేసి ఫలానా ప్రాంతంలో శిశువు ఉన్నాడని సమాచారం ఇస్తే చాలు.. క్షణాల్లో శిశువుకు రక్షణ కల్పిస్తాం. నేరుగా తెలియజేయినా పర్వాలేదు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఆర్థిక ఇబ్బందులుంటే ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను వినియోగించుకోవాలి తప్ప.. పిల్లలను చంపేయడం దుర్మార్గం.– జి.కె.దుర్గ, చైల్డ్‌లైన్ 1098 కౌన్సిలర్ -
మృతదేహాన్ని ముసిరిన ఈగలు, చీమలు
సాక్షి, తిరుపతి తుడా : చికిత్స పొందుతూ పురిటిబిడ్డ మృతి చెందాడని కాలువ పక్కన పడేసి వెళ్లిన ఘటన తిరుపతి రుయా ఆసుపత్రిలో సోమవారం వెలుగు చూసింది. వివరాలు..గంగవరం మండలం మారేడుపల్లెకు చెందిన మనోహర్, సరిత దంపతులకు ఇటీవల మగబిడ్డ జన్మించాడు. అయితే పుట్టుకతోనే మెనింగో మైలో సీల్ అనే జన్యుపరమైన వ్యాధితో జన్మించాడు. పురిటిబిడ్డకు చికిత్స చేయించేందుకు తిరుపతి రుయాలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో 28న చేర్పించారు. ఆ బిడ్డ 29వ తేదీన అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. బిడ్డ మృతి చెందడంతో తెల్లవారుజామున చిన్న పిల్లల ఆసుపత్రి సమీపంలో కాలువ పక్కన ఖాళీ స్థలంలో ఆ పురిటి బిడ్డ మృతదేహాన్ని పడేసి వెళ్లారు. దీంతో చీమలు, ఈగలు ముసురుకుని ఉన్న ఆ పసికందు మృతదేహాన్ని ఉదయాన చూసిన స్థానికులు చలించిపోయారు. సమాచారమివ్వడంతో రుయా అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పోలీసులకు తెలియజేయడంతో వారు దర్యాప్తు చేశారు. బిడ్డ ఆధారంగా తల్లిదండ్రులను గుర్తించి వారిని పిలిపించారు. విచారణ చేశారు. తమ బిడ్డ మృతి చెందడంతో ఇంటికి తీసుకెళ్లలేక ఇక్కడే పాతిపెట్టాలని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులతో మాట్లాడి వారికి డబ్బులిచ్చి వెళ్లిపోయామని, వారు ఇలా పడేస్తారని అనుకోలేదని పేర్కొన్నారు. అనంతరం బిడ్డ మృతదేహాన్ని వారికి అప్పగించారు. ఆ తర్వాత పసికందు మృతదేహాన్ని తిరుపతిలోనే ఖననం చేసి తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయారు. కుక్కల బారిన పసికందు మృతదేహం పడి ఉంటే పరిస్థితి భయానకంగా ఉండేదని కొందరు వ్యాఖ్యానించారు. ఇదలా ఉంచితే, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీసు అవుట్ పోస్టులను బలోపేతం చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉండదని నివేదికలు చెబుతున్నా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుం డా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి!
పేగు తడి ఆరకముందే తల్లి పొత్తిళ్లకు దూరమైంది ఓ పసికందు. కనురెప్పలు తెరవకముందే కానరాని లోకాలకు వెళ్లింది ఆ చిట్టితల్లి. బిడ్డ భవిష్యత్‌పై బంగారు కలలుకన్న ఆ తల్లి ఆశలు పొత్తిళ్లలోనే అడియాశలయ్యాయి. కన్న ప్రేమను పంచక ముందే.. కనులారా కన్నబిడ్డను చూడకముందే.. ఊసులు చెప్పకుండానే కళ్ల ముందే ఊపిరి వదిలేయడంతో ఆ తల్లి గుండె కన్నీటి చెరువై బరువెక్కింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం ఘటన చోటుచేసుకుంది. –ఉయ్యూరు(పెనమలూరు) సాక్షి, కృష్ణా : ఉంగుటూరు మండల చాగంటిపాడు గ్రామానికి చెందిన నీరజకు గుంటూరు నగరంలోని పట్టాభిపురానికి చెందిన వాసా వాసుతో వివాహమైంది. నీరజకు తల్లిలేకపోవడంతో నెలలు నిండిన ఆమెను ఉయ్యూరులో బంధువులు తమ ఇంటి వద్ద ఉంచుకుని ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. నెలలు నిండి ప్రసవ సమయం సమీపించడంతో నీరజను ఈ నెల 23న ఆస్పత్రిలో చేర్పించారు. 24వ తేదీ సాయంత్రం ప్రసవవేదన ఎక్కువై నొప్పులు తీవ్రమయ్యాయి. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జనరల్ వార్డులోనే నీరజ ప్రసవ నొప్పులతో తల్లడిల్లిపోయింది. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో బెడ్డుపైనే కాన్పు జరిగే పరిస్థితులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన నర్సులు చేసేది లేక అక్కడే కాన్పు చేసి బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. పసికందు మృతితో ఆందోళన.. కన్నతల్లి పొత్తిళ్లలో పాలుతాగుతూ బిడ్డ మృతి చెందింది. పసికందు మృతితో బంధువులు వైద్యులపై ఆగ్రహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ దూరమైందని ఆస్పత్రి ఎదురుగా రహదారిపై మృతి చెందిన పసికందుతో బంధువులు బైఠాయించి న్యాయం చేయాలంటూ, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న డీసీహెచ్ఎస్ జ్యోతిర్మణి, సీఐ నాగప్రసాద్, ఎస్ఐ గురుప్రకాష్ బాధితులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నీరజ బంధువులు మాట్లాడుతూ, ఆస్పత్రిలో సరిగ్గా కాన్పు చేయకపోవడం వలనే బిడ్డ దూరమైందన్నారు. కాన్పు జరిగాక రెండు రోజుల వరకు తల్లిబిడ్డ ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీసీహెచ్ఎస్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే నిర్లక్ష్యం వలన పసికందు మృతి చెందలేదని వైద్యులు చెబుతున్నారు. -
వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో పసికందు మృతి
-
పురిట్లోనే శిశువు మృతి
డాక్టర్ల నిర్లక్ష్యంతో చనిపోయిందని బంధువుల ఆరోపణ మృతశిశువుతో ఆస్పత్రి ఎదుట ధర్నా తల్లి గర్భంలోనే బిడ్డ చనిపోయిందంటున్న వైద్యులు పరకాల : అమ్మ కడుపులో తొమ్మిది నెలలు సురక్షితంగా పెరిగిన బిడ్డ.. గర్భం నుంచి బయటికి వచ్చిన కొద్ది సేపట్లోనే ప్రాణాలు విడిచింది. కనులు తెరవక ముందే కన్నుమూసింది. డ్యూటీ డాక్టర్ సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో శనివారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం... మండలంలోని కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన హన్మకొండ రాము–లావణ్య(సవిత)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. రాము పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో హమాలీ పనిచేస్తుండగా లావణ్య కూలీ పని చేస్తోంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం లావణ్య మూడోసారి గర్భం దాల్చింది. హన్మకొండలోని ప్రభుత్వ మెటర్నరీ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటున్నారు. స్థానిక ఏఎన్ఎం పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో మంచి సదుపాయాలున్నాయని చెప్పి నిండు గర్భిణి అయిన లావణ్యను ఇక్కడికి తీసుకొచ్చింది. శుక్రవారం లావణ్యతోపాటు భర్త రాము కూడా వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు లావణ్యను ఇంటికి తీసుకెళ్లండని, నొప్పులు వస్తే తీసుకురావాలని చెప్పారు. దీంతో కామారెడ్డిపల్లికి లావణ్యను తీసుకెళ్లారు. శనివారం ఉదయం నొప్పులు రావడంతో రాము ఆమెను సివిల్ ఆస్పత్రికి తరలించాడు. అయితే డాక్టర్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో మధ్యాహ్నం రాము డ్యూటీ డాక్టర్‌కు తన భార్య విషయం చెప్పాడు. దీంతో డ్యూటీ డాక్టర్ పద్మజ వచ్చి లావణ్యను డెలివరీ కోసం గదిలోకి తీసుకెళ్లారు. సాధారణ డెలివరీతో లావణ్య మగ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినప్పుడు బాగానే ఉన్న శిశువుకు ఆక్సిజన్ అందించడంలో డాక్టర్లు పట్టించుకోలేదు. శిశువును ప్రైవేటు ఆస్పత్రిలో చూపించడం కోసం తీసుకుపోతుండగా మృతిచెందింది. మృతశిశువుతో ధర్నా.. ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే శిశువు చనిపోయిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. మృతశిశువును చేతుల్లో పట్టుకొని ఆస్పత్రిలోకి వెళ్లకుండా బైఠాయించారు. సుమారు మూడు గంటలపాటు ఆందోళన చేశారు. ఎస్సై దీపక్ అక్కడకు చేరుకొని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. మృతశిశివునే బయటకు తీశాం : డ్యూటీ డాక్టర్ పద్మజ ఆస్పత్రిలో చేరిన లావణ్యను పరిశీలిస్తూనే ఉన్నాం. చనిపోయిన శిశువు పూర్తిగా బయటకు వచ్చింది. అందులో మా తప్పు లేదు. డెలివరీ చేయకుంటే తల్లి ప్రాణాలకు ప్రమాదం జరిగేది. విచారణ చేస్తున్నాం: డాక్టర్ రాజేందర్‌రెడ్డి, ఇన్చార్జీ సూపరింటెండెంట్ ఆస్పత్రిలో చనిపోయిన శిశువు ఘటనపై విచారణ చేస్తున్నాం. డ్యూటీ డాక్టర్ పద్మజ, ఏఎన్ఎంలు స్వరూప, వాణి ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. నిర్లక్ష్యం ఉన్నట్లు తెలితే చర్యలు తీసుకుంటాం.