కూతురు.. ఆ వెంటే తండ్రి మరణం.. అయినా జట్టు వెంటే! | Baroda Bater Vishnu Solankis father passes away | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2022: ఒక వైపు కూతురు పోయిన బాధ..ఇప్పుడు తండ్రి మరణం.. శభాష్‌ సోలంకి!

Published Mon, Feb 28 2022 2:09 PM | Last Updated on Mon, Feb 28 2022 2:58 PM

Baroda Bater Vishnu Solankis father passes away - Sakshi

Vishnu Solanki Sad Story: బరోడా క్రికెటర్‌ విష్ణు సోలంకిను విధి వెంటాడింది. కన్న కూతురు మరణించిందన్న బాధను దిగమింకముందే.. మరో విషాదం తన కుటుంబం చోటు చేసుకుంది. విష్ణు సోలంకి తండ్రి ఆదివారం మరణించాడు.  ఈ క్రమంలో అంత్యక్రియలకు హాజరు కాకుండా జట్టుతోనే ఉండి మరోసారి సోలంకి రియల్‌ హీరో అనిపించుకున్నాడు. జట్టుతో పాటు బయో బబుల్‌లోనే సోలంకి ఉన్నాడు. తన తండ్రి అంత్యక్రియలకు సోలంకి వీడియో కాల్‌లో మాత్రమే హాజరయ్యాడు. దీంతో సోలంకిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిస్తోంది.

కాగా, రంజీట్రోఫీలో భాగంగా చంఢీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో విష్ణు సోలంకి అద్భుతమైన సెంచరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌కు కొద్ది రోజులు ముందు విష్ణు సోలంకి కూతురు మరణించింది. ఆ బాధను దిగమింగుతూ కఠిన పరిస్థితుల్లో అద్భుతమైన సెంచరీ చేశాడు. కాగా తన కుమార్తె మరణించిన తర్వాత కుటుంబంతో ఉండమని సూచించినట్లు  బరోడా క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఆట మీద మక్కువతో జట్టును విడిచిపెట్టడానికి సోలంకీ ఇష్టపడలేదని అతడు పేర్కొన్నారు. ఇక బరోడా జట్టు మార్చి 4న హైదరాబాద్‌తో తల పడనుంది.

చదవండి: Ranji Trophy 2022: కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement