
భువనేశ్వర్: రంజీ ట్రోఫీ 2022 గ్రూప్ బి లో భాగంగా చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టెస్ట్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ స్టార్ ఆటగాడు హనుమ విహారి అద్భుత శతకంతో మెరిశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ (59)తో రాణించిన విహారి.. రెండో ఇన్నింగ్స్‌లో 149 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఐపీఎల్ వేలంలో భారీ ధర (1.70 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది).దక్కించుకున్న తిలక్ వర్మ (76 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విహారికి మరో ఎండ్‌లో ఉండి సహకరించాడు.
ఫలితంగా హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 269 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ప్రత్యర్ధికి 400 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. అంతకుముందు టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌట్ కాగా, మనన్ వోహ్రా సూపర్ శతకంతో మెరవడంతో చండీగఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 216 పరుగులు చేసి ఆలౌటైంది.
చదవండి: Ranji Trophy 2022: హనుమ విహారి అర్ధ శతకం.. హైదరాబాద్ 270/7