Hyderabad Ranji Team
-
హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్ గా తిలక్ వర్మ
దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. భారత జట్టు సభ్యుడు ఠాకూర్ తిలక్ వర్మ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. రాహుల్ సింగ్ గహ్లోత్ వైస్ కెప్టెన్ గా ఉంటాడు. గత రంజీ ట్రోఫీ సీజన్లో ఎలైట్ డివిజన్లో పోటీపడ్డ హైదరాబాద్ తమ గ్రూప్‌లో చివరిస్థానంలో నిలవడంతో ఈసారి ‘ప్లేట్’ డివిజన్లో పోటీ పడనుంది. ‘ప్లేట్’ డివిజన్లో హైదరాబాద్‌తోపాటు సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ జట్లున్నాయి. హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 5 నుంచి నాగాలాండ్‌తో, రెండో మ్యాచ్‌ను జనవరి 12 నుంచి మేఘాలయతో ఆడుతుంది. హైదరాబాద్ రంజీ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్ ), రాహుల్ సింగ్ గహ్లోత్ (వైస్ కెప్టెన్ ), తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, రోహిత్ రాయుడు, టి.రవితేజ, తనయ్ త్యాగరాజన్, చందన్ సహని, కార్తికేయ కక్, నితేశ్ కన్నల, సాయిప్రజ్ఞయ్ రెడ్డి, సాకేత్ సాయిరామ్, అభిరత్ రెడ్డి, సాగర్ చౌరాసియా, ఇ.సంకేత్. స్టాండ్‌బైస్: రాహుల్ బుద్ధి, జావీద్ అలీ, యశ్ గుప్తా, రిషబ్ బస్లాస్, టీపీ అనిరుధ్, గణేశ్. డీబీ రవితేజ (హెడ్ కోచ్), పవన్ కుమార్ (అసిస్టెంట్ కోచ్), రొనాల్డ్ రోడ్రిగ్స్ (ఫీల్డింగ్ కోచ్), రియాజ్ ఖురేషి (టీమ్ మేనేజర్), సుభాశ్ పాత్రో (స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్), సంతోష్ (ఫిజియో), కృష్ణా రెడ్డి (వీడియో ఎనలిస్ట్), సాజిద్ హుస్సేన్ (మసాజర్). -
హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ..
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో తమ తొలి రెండు మ్యాచ్‌లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. నాగాలాండ్, మేఘాలయతో జరిగే తొలి రెండు మ్యాచ్‌ల్లో తిలక్ సారథ్యంలో హైదరాబాద్ బరిలోకి దిగనుంది. తిలక్ వర్మకు డిప్యూటీగా రాహుల్ సింగ్ గహ్లౌట్ ఎంపికయ్యాడు. అదే విధంగా మాజీ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక వచ్చే రంజీ సీజన్లో హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో జనవరి 5న నాగాలాండ్‌తో తలపడనుంది. కాగా తిలక్ ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వైట్‌బాల్ సిరీస్‌లలో భాగమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ గహ్లౌత్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, సివి మిలింద్, రోహిత్ రాయుడు, రవితేజ, తనయ్ త్యాగరాజన్, చందన్ సహాని, కార్తికేయ కాక్, నితేష్ కన్నాల, సాయి ప్రగ్నయ్ రెడ్డి (వికెట్ కీపర్), సాకేత్ సాయి రామ్, అభిరత్ రెడ్డి, సాగర్ చౌరాసియా (వికెట్ కీపర్),సంకేత్ -
విహారి అద్భుత శతకం.. ఆకట్టుకున్న తిలక్ వర్మ
భువనేశ్వర్: రంజీ ట్రోఫీ 2022 గ్రూప్ బి లో భాగంగా చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టెస్ట్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ స్టార్ ఆటగాడు హనుమ విహారి అద్భుత శతకంతో మెరిశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ (59)తో రాణించిన విహారి.. రెండో ఇన్నింగ్స్‌లో 149 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఐపీఎల్ వేలంలో భారీ ధర (1.70 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది).దక్కించుకున్న తిలక్ వర్మ (76 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విహారికి మరో ఎండ్‌లో ఉండి సహకరించాడు. ఫలితంగా హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 269 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ప్రత్యర్ధికి 400 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. అంతకుముందు టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌట్ కాగా, మనన్ వోహ్రా సూపర్ శతకంతో మెరవడంతో చండీగఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 216 పరుగులు చేసి ఆలౌటైంది. చదవండి: Ranji Trophy 2022: హనుమ విహారి అర్ధ శతకం.. హైదరాబాద్ 270/7 -
హైదరాబాద్ రంజీ జట్టు వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో జరిగే రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 25 మందితో కూడిన హైదరాబాద్ జట్టుకు తన్మయ్ అగర్వాల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా... యువ భారత్ జట్టు సభ్యుడు, 19 ఏళ్ల ఠాకూర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో తిలక్ వర్మ 180 పరుగులు, ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. జనవరి 13 నుంచి జరిగే రంజీ ట్రోఫీ తొలి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడుతుంది. హైదరాబాద్ రంజీ జట్టు: తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), ఠాకూర్ తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), పీఎస్ చైతన్య రెడ్డి, బుద్ధి రాహుల్, జావేద్ అలీ, ప్రతీక్ రెడ్డి (వికెట్ కీపర్), సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, మికిల్ జైస్వాల్, కార్తికేయ కక్, చందన్ సహని, హిమాలయ్ అగర్వాల్, మెహదీ హసన్, అలంకృత్ అగర్వాల్, ధీరజ్ గౌడ్ (వికెట్ కీపర్), టి.రవితేజ, అబ్రార్ మొహియుద్దీన్, రక్షణ్ రెడ్డి, అబ్దుల్ ఇలా ఖురేషి, అఫ్రిది, ఎన్.సూర్య తేజ, అలిగ వినయ్, మొహమ్మద్ సక్లాయిన్, సూర్యప్రసాద్. చదవండి: Ashes 2021: 68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాదే.. -
మళ్లీ హైదరాబాద్ జట్టు తరఫున ఆడనున్న విహారి
హైదరాబాద్ : టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి మళ్లీ హైదరాబాద్ జట్టు తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఈ మేరకు అతడికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వీ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. తొలుత హైదరాబాద్ తరఫున రంజీ పోటీల్లో పాల్గొన్న విహారి.. అనంతరం ఆంధ్రాకు తరలి వెళ్లాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ పర్యటనకు ఎంపికైన విహారి.. కేవలం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమ్యాడు. కాగా కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధంతరంగా రద్దు కావడంతో విహారి స్వదేశానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 12 టెస్ట్ మ్యాచులాడిన విహారి 624 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2012 అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులో విహారి సభ్యుడుగా ఉన్నాడు. చదవండి: IPL 2021: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్.. -
హైదరాబాద్ రంజీ జట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల హైదరాబాద్ జట్టును సోమవారం ప్రకటించారు. నవంబర్ 1 నుంచి 4 వరకు జరిగే తొలి మ్యాచ్‌లో కేరళతో హైదరాబాద్ తలపడుతుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా పి. అక్షత్ రెడ్డి ఎంపికవగా... ఎన్. అర్జున్ యాదవ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు ఆలిండియా కల్నల్ సీకే నాయుడు చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అండర్–23 హైదరాబాద్ జట్టును కూడా సోమవారమే ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా చందన్ సహాని, కోచ్‌గా జాకీర్ హుస్సేన్ ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో నవంబర్ 2 నుంచి 5 వరకు జరిగే తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. జట్ల వివరాలు హైదరాబాద్ రంజీ జట్టు: పి. అక్షత్ రెడ్డి (కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, బి. సందీప్, కె. రోహిత్ రాయుడు, మొహమ్మద్ సిరాజ్, కె. సుమంత్, మెహదీ హసన్, ఎం. రవికిరణ్, సీవీ మిలింద్, సాకేత్ సాయిరాం, ఆకాశ్ భండారి, టి.రవితేజ, తనయ్ త్యాగరాజన్, హిమాలయ్ అగర్వాల్, కేఎస్కే చైతన్య, ఎన్. అర్జున్ యాదవ్ (కోచ్), ఎన్పీ సింగ్ (బౌలింగ్ కోచ్), దిలీప్ (ఫీల్డింగ్ కోచ్). ∙హైదరాబాద్ అండర్–23 జట్టు: చందన్ సహాని (కెప్టెన్), భవేశ్ సేథ్ (వికెట్ కీపర్), గడ్డం సంకేత్, శశిధర్ రెడ్డి, శ్రేయస్ వాలా, యుధ్వీర్ సింగ్, ఆశిష్ శ్రీవాస్తవ్, భగత్ వర్మ, సాత్విక్ రెడ్డి, జైరాం రెడ్డి, అభిరత్ రెడ్డి, ఒమేర్, నిఖిల్, రాజమణి ప్రసాద్, నిఖిల్, జాకీర్ హుస్సేన్ (కోచ్), ఎం. శ్రీనివాస్ (అసిస్టెంట్‌కోచ్).