
హైదరాబాద్ : టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి మళ్లీ హైదరాబాద్ జట్టు తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఈ మేరకు అతడికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వీ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. తొలుత హైదరాబాద్ తరఫున రంజీ పోటీల్లో పాల్గొన్న విహారి.. అనంతరం ఆంధ్రాకు తరలి వెళ్లాడు.
ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ పర్యటనకు ఎంపికైన విహారి.. కేవలం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమ్యాడు. కాగా కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధంతరంగా రద్దు కావడంతో విహారి స్వదేశానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 12 టెస్ట్ మ్యాచులాడిన విహారి 624 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2012 అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులో విహారి సభ్యుడుగా ఉన్నాడు.
చదవండి: IPL 2021: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్..