( ఫైల్ ఫోటో )
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో తమ తొలి రెండు మ్యాచ్‌లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. నాగాలాండ్, మేఘాలయతో జరిగే తొలి రెండు మ్యాచ్‌ల్లో తిలక్ సారథ్యంలో హైదరాబాద్ బరిలోకి దిగనుంది. తిలక్ వర్మకు డిప్యూటీగా రాహుల్ సింగ్ గహ్లౌట్ ఎంపికయ్యాడు.
అదే విధంగా మాజీ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక వచ్చే రంజీ సీజన్‌లో హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో జనవరి 5న నాగాలాండ్‌తో తలపడనుంది. కాగా తిలక్ ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వైట్‌బాల్ సిరీస్‌లలో భాగమైన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ గహ్లౌత్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, సివి మిలింద్, రోహిత్ రాయుడు, రవితేజ, తనయ్ త్యాగరాజన్, చందన్ సహాని, కార్తికేయ కాక్, నితేష్ కన్నాల, సాయి ప్రగ్నయ్ రెడ్డి (వికెట్ కీపర్), సాకేత్ సాయి రామ్, అభిరత్ రెడ్డి, సాగర్ చౌరాసియా (వికెట్ కీపర్),సంకేత్
Comments
Please login to add a commentAdd a comment