సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో జరిగే రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 25 మందితో కూడిన హైదరాబాద్ జట్టుకు తన్మయ్ అగర్వాల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా... యువ భారత్ జట్టు సభ్యుడు, 19 ఏళ్ల ఠాకూర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో తిలక్ వర్మ 180 పరుగులు, ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. జనవరి 13 నుంచి జరిగే రంజీ ట్రోఫీ తొలి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడుతుంది.
హైదరాబాద్ రంజీ జట్టు: తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), ఠాకూర్ తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), పీఎస్ చైతన్య రెడ్డి, బుద్ధి రాహుల్, జావేద్ అలీ, ప్రతీక్ రెడ్డి (వికెట్ కీపర్), సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, మికిల్ జైస్వాల్, కార్తికేయ కక్, చందన్ సహని, హిమాలయ్ అగర్వాల్, మెహదీ హసన్, అలంకృత్ అగర్వాల్, ధీరజ్ గౌడ్ (వికెట్ కీపర్), టి.రవితేజ, అబ్రార్ మొహియుద్దీన్, రక్షణ్ రెడ్డి, అబ్దుల్ ఇలా ఖురేషి, అఫ్రిది, ఎన్.సూర్య తేజ, అలిగ వినయ్, మొహమ్మద్ సక్లాయిన్, సూర్యప్రసాద్.
చదవండి: Ashes 2021: 68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాదే..
Comments
Please login to add a commentAdd a comment