
చండీగఢ్: పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో వీడియోల లీక్ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు మహిళా అధికారులతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ సోమవారం చెప్పారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశామన్నారు.
హాస్టల్‌లో తోటి విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డు చేసి షేర్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థిని, ఆమె స్నేహితుడి ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపామన్నారు. ఆందోళనల సందర్భంగా విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలొచ్చిన ఇద్దరు హాస్టల్ వార్డెన్లను సస్పెండ్ చేశారు. మరికొందరిని బదిలీ చేశారు. వర్సిటీలో సెలవులను 24 దాకా పొడిగించారు. ముగ్గురు నిందితులను 7 రోజులపాటు పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment