చంఢీగఢ్: విమానం అనగానే మనకు వేగం..ఆకాశంలో ఎగరడం గుర్తొస్తుంది. అయితే ఈ ‘పంజాబ్ రాఫెల్’ మాత్రం కాస్త స్సెషల్ . ఇది ఆకాశంలో కాకుండా నేలమీద ప్రయాణిస్తొంది. పంజాబ్‌లోని బతిండాకు చెందిన ఆర్కిటెక్ట్ రాంపాల్ బెహనీవాల్ దీన్ని తయారు చేశాడు. కాగా, రాఫెల్‌ను స్ఫూర్తిగా తీసుకొని దీన్ని తయారు చేసినట్టు ఆయన తెలిపాడు. ఇది రాఫెల్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఈ పంజాబ్ రాఫెల్ నేలపై గంటకు 15-20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. దీని తయారీకి మూడు లక్షలు ఖర్చయ్యిందని రాంపాల్ తెలిపాడు.
కాగా, రాఫెల్‌లో ఎగరలేని వారు తన పంజాబ్ రాఫెల్‌లో ప్రయాణించి కోరిక నెరవేర్చుకోవచ్చని తెలిపాడు. మొత్తానికి ఈ రాఫెల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని తొందరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పంజాబ్ ఆర్కిటెక్ట్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment