
ప్రతికాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యా ర్థులు చండీగఢ్ వర్సిటీ ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పంజాబ్‌లోని చండీగఢ్ వర్సిటీలో జరిగిన ప్రాంగణ నియామకాలు– 2020 ఫేజ్–1లో 4 వేల మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపిక కాగా.. వారిలో 64 మంది ఏపీ విద్యార్థులేనని వర్సిటీ వీసీ ఆర్.ఎస్.బావా తెలిపారు. ఇందులోనూ 36 మంది ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందుకున్నవారేనని తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన గగన్ చాటు ఐబీఎం, కాగ్నిజెంట్, పెర్సిస్టెంట్, వర్చ్యూసా సిస్టమ్స్ అనే 4 కంపెనీల నుంచి, విశాఖపట్టణానికి చెందిన గొంటిన ఉదయ్ కుమార్‌కు విప్రో, కాగ్నిజెంట్, సార్టప్ ఫామ్ వంటి మూడు కంపెనీల నుంచి జాబ్ ఆఫర్లు వచ్చినట్లు వర్సిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment