
నీరజ్ చోప్రా తల్లికి స్వీట్ తినిపిస్తున్న బంధువులు
చంఢీఘర్: హరియాణా రాష్ట్రం, పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామం నీరజ్ స్వస్థలం. వ్యవసాయం చేసుకునే 17 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం. అధిక బరువు, అల్లరి పిల్లాడు కావడంతో కాస్త ఆటల్లో పెడితే కుదురుగా ఉంటాడని భావించిన తండ్రి సతీశ్ 13 ఏళ్ల నీరజ్‌ను సమీపంలోనే ఉన్న పానిపట్‌లోని స్టేడియానికి తీసుకెళ్లాడు. అయితే అక్కడి అన్ని ఆటల్లో అతనికి జావెలిన్ త్రో కొత్తగా అనిపించి ఆసక్తి పెరిగింది. కోచ్ జై చౌదరి మార్గనిర్దేశనంలో, బాబాయ్ భీమ్ చోప్రా అండగా నీరజ్ జావెలిన్ త్రోలోనే తన భవిష్యత్తును వెతుక్కునేందుకు సిద్ధమయ్యాడు.
తన సహజసిద్ధమైన ప్రతిభతో చోప్డా కొద్ది రోజుల్లోనే ఆటలో మెరుగయ్యాడు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన తర్వాత అతని పయనం పంచ్‌కులాలోని ‘సాయ్’ స్పోర్ట్స్ హాస్టల్‌కు చేరింది. అక్కడి నుంచి నీరజ్ తన శ్రమ, పట్టుదలతో ఒక్కసారిగా ఎదిగిపోయాడు. వివిధ దశల్లో కోచ్‌లుగా వ్యవహరించిన గ్యారీ కాల్‌వర్ట్, యువ్ హాన్ అతడి ఆటను పైస్థాయికి తీసుకెళ్లగా, ప్రస్తుత కోచ్ క్లాస్ బార్టోనెట్జ్ నీరజ్‌ను చాంపియన్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు.
#WATCH live from javelin thrower Neeraj Chopra's residence in Panipat, Haryana
— ANI (@ANI) August 7, 2021
Chopra wins gold at #TokyoOlympics https://t.co/0kj0q2Pruu
Comments
Please login to add a commentAdd a comment