
Rajkummar Rao Marries Patralekhaa in Chandigarh: బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు తన చిరకాల ప్రేయసి పత్రలేఖ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. వేద మంత్రాల సాక్షిగా పత్రలేఖతో రాజ్ కుమార్ నవంబర్ 15న(సోమవారం) ఏడడుగులు వేశారు. వీరి వివాహ వేడుకకు చండీగఢ్ వేదికగా మారింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను రాజ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.
చదవండి: Samantha: పుకార్లే నిజమయ్యాయి.. సమంతకు ఫస్ట్ టైమ్ ఇది
రాజ్ కుమార్.. పత్రలేఖ నుదుటున కుంకుమ దిద్దుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘11 సంవత్సరాల ప్రేమ, స్నేహం, వినోదం తరువాత చివరికి ఈరోజు నా సర్వస్వం, నా సోల్‌మెట్, బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకన్నాను. నా సోల్‌మెట్, బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజు పత్రలేఖ నుంచి భర్తగా పిలిపించుకోవడంకంటే గొప్ప ఆనందం మరొకటి లేదు’ అనే క్యాషన్ ఇచ్చాడు. ఈ ఫోటోలనలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా కాగా రాజ్ కుమార్ రావు, ప్రతలేఖ దాదాపు పదేళ్లకు పైగా ప్రేమించుకున్నారు. నేడు పెళ్లితో ఒకటయ్యారు.
చదవండి: ఊర'నాటు' స్టెప్పులేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు
నూతన జంటకు బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ప్రియాంక చోప్రా, తాప్సీ, ఆయుష్మాన్ ఖురానా వంటి నటులు ‘మీ జంట చూడముచ్చటగా ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.