సాక్షి, చండీగఢ్: కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితుల కష్టాలు వర్ణనాతీతం. ఊపిరాడక తమ కళ్లముందే ఆత్మీయులు విలవిల్లాడుతోంటే కుటుంబ సభ్యుల ఆవేదన ఇంతా కాదు. ఒక మాదిరి నుంచి తీవ్రంగా ప్రభావితమైన కరోనా బాధితుల్లో సీపాప్ థెరపీ చాలా కీలకంగా మారింది. అయితే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, సీపాప్, బీపాప్ మెషీన్లు ఖరీదైనవిగావటం బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళన రేపింది. అయితే జీవన్ వాయు పేరుతో రూపొందించిన ఒకకొత్త సీపాప్ డివైస్ వివరాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ ( ఐఐటి రోపర్ )ట్వీట్ చేసింది.
చాలా తక్కువ రేటులో సీపాప్‌ను మెషీన్ మోడల్ రూపొందించడం ఒక ప్రత్యేకత అయితే..విద్యుత్ అవసరం లేకుండానే పనిచేయడం మరో విశేషం. ఐఐటీ రోపార్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖుష్బూరాక దీన్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా విద్యుతు అవసరం లేకుండానే అతి తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేసినట్టు రాక వెల్లడించారు. నిమిషానికి 15 లీటర్లు ఆక్సిజన్ అందిస్తుండగా, తమ డివైస్ ద్వారా నిమిషానికి 16 లీటర్లు దాకా అందిచ వచ్చన్నారు. అంతేకాదు దీన్ని 3 వేల రూపాయలలోపే దీన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘జీవన్ వాయు’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ మెషీన్ ద్వారా గ్రామాలు, సౌకర్యాలు కొరత వున్న గ్రామాల నుంచి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు చేరేవారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పీఈసీ భాగస్వామ‍్యంతో ఈ పరికరాన్ని తయారుచేసినట్టు వెల్లడించారు. అన్ని అనుమతులు లభిస్తే.. త్వరలోనే దీన్ని కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె చెప్పారు.
@iitrpr develops NATION’S FIRST Power-free CPAP device ‘JIVAN VAYU’ to save lives in villages and low resource areas and during transit of patients from ambulance to hospitals. @Reuters @DrRPNishank @EduMinOfIndia @SanjayDhotreMP @iitcouncil @PIB_India @HuffPost @PTI_News pic.twitter.com/VBKtKxWWqG
— IIT Ropar (@iitrpr) June 14, 2021
Comments
Please login to add a commentAdd a comment