World's Largest Human Formation Of Waving National Flag In Chandigarh - Sakshi
Sakshi News home page

ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’

Published Sat, Aug 13 2022 3:47 PM | Last Updated on Sat, Aug 13 2022 6:38 PM

Worlds Largest Human Formation Of Waving National Flag In Chandigarh - Sakshi

చండీగఢ్‌: ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ చేపట్టిన హర్‌ ఘర్‌ తిరంగ ప్రచారాన్ని బలోపేతం చేసేలా చండీగఢ్‌​ వాసులు ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో బాగంగా అతి పెద్ద జాతీయ జెండాలా మానవహారంగా నిలబడి రికార్డు సృష్టించారు. ఈ మేరకు చండీగఢ్‌ విశ్వవిద్యాలయంలోని సుమారు 16 ఎకరాల క్రికెట్‌ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మందికి పైగా మానవహారంగా నిలబడి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్‌ఐడీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కేంద్ర మంత్రి మీనాకాశీ లేఖి,  చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ సత్నామ్‌ సింగ్‌ సంధు, విశ్వవిద్యాలయ అధికారులు తదితరులు హజరయ్యేరు.

దాదాపు 5 వేల మందికి పైగా అతిపెద్ద మానవహారంలా ఏర్పడి జాతీయ జెండాను రెపరెపలాడించి సరికొత్త రికార్డును సృష్టించారు. ‘హర్ ఘర్ తిరంగ’ అనేది జాతీయ జెండాతో ఉన్న సంబంధాన్ని అధికారికంగా లేదా సంస్థాగతంగా ఉంచడం కంటే వ్యక్తిగతంగా దేశభక్తిని పెంపొందించేలా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం. భారతదేశ ప్రజలు, మన దేశ సంస్కృతి, సమర యోధులు సాధించిన విజయాలు వాటి వెనుక దాగి ఉన్న అద్భుతమైన చరిత్రను స్మరించుకుంటూ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రోత్సహించింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మీరు కూడా వీక్షించండి. 

(చదవండి:

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement