కన్న కూతుర్ని తల్లిని చేసిన కీచక తండ్రి | Man Molested Mentally Ill Daughter In Haryana | Sakshi
Sakshi News home page

కన్న కూతురిపై కీచక తండ్రి అఘాయిత్యం

Published Sun, May 17 2020 4:20 PM | Last Updated on Sun, May 17 2020 4:35 PM

Man Molested Mentally Ill Daughter In Haryana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఛండీఘర్‌‌ : అభంశుభం తెలియని మానసిక వికలాంగురాలైన కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో తండ్రి. కీచక తండ్రి కారణంగా ఆ కూతురు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన హర్యానా పంచుకులాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంచు‌కుల జిల్లాలోని సెక్టార్‌ 18 పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన ఓ వ్యక్తి మానసిక వికలాంగురాలైన 23 ఏళ్ల తన కూతురిపై తరచుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావటంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ యువతి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, కుటుంబసభ్యుల్ని విచారించగా యువతి గర్భానికి గల కారణాలను వారు చెప్పలేకపోయారు. ( ఇద్దర్ని కాల్చిచంపిన పోలీస్‌ కానిస్టేబుల్‌‌ )

పోలీసులకు బాధితురాలి తండ్రిపై అనుమానం కలగటంతో అతడ్ని విచారించారు. దీంతో అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఓ సంవత్సర కాలంగా కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలిపాడు. అనంతరం అతడిపై రేప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడిన విషయం ఇంట్లో ఎవరికీ తెలియదని బాధితురాలు వాపోతుండటం గమనార్హం. ( కంటిపాపకు తెలియకుండా కాటికి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement