చికెన్ చెట్టినాడు | sakshi food special:Chicken Chettinad Recipe | Sakshi
Sakshi News home page

చికెన్ చెట్టినాడు

Published Sat, Apr 16 2016 9:00 AM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

చికెన్ చెట్టినాడు

చికెన్ చెట్టినాడు

నల్లా ఇరుక్కు... అంటే నల్లాలో నీళ్ళు వస్తున్నాయని కాదు. సాంబారు వస్తుందని! చాలా బాగుంది. అదే తమిళంలో నల్లా ఇరుక్కు. తమిళ భోజనమంటే, అంతా... సాంబరమే! అదేనండీ! సంబరమే!ఇవాళ డైనింగ్ టేబుల్‌ని త‘మిళ’ మిళ లాడించండి! ఇంక వెయిటింగ్ దేనికి? పొట్టంతా ఇరుక్కు... ఇరుక్కుగా ఉండేలా లాగించండి. వాంగో... వక్కారుంగో... సాపుడుంగో... (రండి... కూర్చోండి... ఆరగించండి...)

 

అవల్ వడై
కావల్సినవి: అటుకులు - 200 గ్రా.లు; ఉల్లిపాయలు - 1అల్లం తరుగు - అర టీ స్పూన్; వెల్లుల్లి తరుగు - అర టీ స్పూన్పచ్చిమిర్చి - 2 (తరగాలి); కొత్తిమీర - చిన్న కట్ట బియ్యప్పిండి - మూడున్నర టేబుల్ స్పూన్లు నూనె - వేయించడానికి తగినంత; ఉప్పు - తగినంత

 
తయారీ
:  వేడినీళ్లలో అటుకులు వేసి 5 నిమిషాలు నానబెట్టి, వడకట్టాలి. అటుకులను నీళ్లు లేకుండా పిండేసి దీంట్లో ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం, వెల్లుల్లి, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి.బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని వడల్లా చేసుకోవాలి. కడాయిలో నూనె కాగాక తయారుచేసుకున్న అటుకుల వడలను వేసి గోధుమరంగు వచ్చేంతవరకు రెండు వైపులా వేయించాలి.   వీటిని టొమాటో లేదా పుదీనా చట్నీతో వడ్డించాలి.

 

మద్రాస్ సాంబార్
కావల్సినవి: మెంతులు - టీ స్పూన్ బెల్లం పొడి - మూడు టేబుల్ స్పూన్లు మునక్కాడలు - 1 (3 అంగుళాల పొడవులో ముక్కలు చేయాలి) టొమాటో - 2 (ముక్కలు చేయాలి) ఉల్లిపాయలు - పెద్దవి 2 (నిలువుగా ముక్కలు చేయాలి); శనగపప్పు - 3 టేబుల్ స్పూన్లు ధనియాలు - టేబుల్ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్; ఆవాలు - అర టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ; కందిపప్పు - పావు కేజీ చింతపండు గుజ్జు - 6 టేబుల్ స్పూన్లు ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత నూనె - 4 టేబుల్ స్పూన్లు; మిరపకాయలు - 4పసుపు - అర టీ స్పూన్; పచ్చిమిర్చి - 4వెల్లుల్లి రెబ్బలు - 5 (కచ్చాపచ్చాగా దంచాలి)

 
తయారీ:  కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి పప్పు ఉడికించి, పక్కన ఉంచాలి. నెయ్యి వేసి శనగపప్పు, ధనియాలు, మెంతులు వేయించి, పొడి చేసి పక్కనుంచాలి. మందపాటి గిన్నెలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేయించాలి. దీంట్లో పసుపు, మునక్కాడలు, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి.  చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి.  ఉడికిన కందిపప్పును మెత్తగా చేసి పై మిశ్రమంలో వేసి, కలపాలి. దీంట్లో బెల్లం, తగినన్ని నీళ్లు, ఉప్పు, వేయించి - మసాలా పొడి వేసి మరో 10 నిమిషాలు ఉడికించాలి. అన్ని దినుసులు సరిపోయావో లేదో సరి చూసుకొని దించాలి. నెయ్యితో ఈ సాంబారును వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి.

 

చికెన్ చెట్టినాడు
కావల్సినవి: చింతపండు - నిమకాయ పరిమాణం అంత టొమాటో - 1; ఉప్పు - తగినంత మిరియాలపొడి - టేబుల్ స్పూన్ జీలకర్ర - టేబుల్ స్పూన్ ఎండుమిర్చి - 3; వెల్లుల్లి - 4 పసుపు - చిటికెడు; నూనె - 2 టీ స్పూన్లు ఆవాలు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ కొత్తిమీర తరుగు - టీ స్పూన్


తయారీ
చింతపండులో అర కప్పు నీళ్లు పోసి, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టాలి. టొమాటోను గుజ్జు చేసి తీసిన చింతపండు రసంలో కలపాలి.మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి కలిపి పొడి చేసుకోవాలి.  కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. మరికాస్త నూనె వేసి టొమాటో గుజ్జు కలిపిన చింతపండు రసాన్ని కడాయిలో పోయాలి. పిప్పిని చేత్తోనే వడకట్టుకోవాలి. దీంట్లో మిరియాలు, వెల్లుల్లి కలిపి చేసిన మసాలా మిశ్రమం, ఉప్పు కలిపి మరిగించాలి.మంట తగ్గించి, కొత్తిమీర వేసి రసం మంచి వాసన వచ్చేంతవరకు ఉంచి దించేయాలి.

 

మోర్ కుళంబు
కావలసినవి: చికెన్ ముక్కలు - పావుకేజీ సోంపు - ఒకటిన్నర టేబుల్ స్పూన్ అనాసపువ్వు - 5; ఎండుమిర్చి - 5 పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్రపొడి - టీ స్పూన్; కొత్తిమీర - చిన్న కట్ట  ఉప్పు - తగినంత; పచ్చిమిర్చి - 5 ఉల్లిపాయ తరుగు - 200 గ్రా.లు అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు గరం మసాలా - టీ స్పూన్; నూనె - 5 టేబుల్ స్పూన్లు

 

తయారీ

కొబ్బరి తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి మెత్తగా నూరుకోవాలి. గిన్నెలో చికెన్ ముక్కలు వేసి, దాంట్లో పచ్చిమిర్చి వేసి నూరిన కొబ్బరి మిశ్రమం, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలిపి అర గంటసేపు నానబెట్టాలి. కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో అనాసపువ్వు, ఎండుమిర్చి వేసి, ఆ తర్వాత ఉల్లిపాయ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.బాగా నానిన చికెన్‌లో గరం మసాలా వేసి కలిపి బాగా వేగిన ఉల్లిపాయ మిశ్రమంలో కలిపి, 15 నిమిషాలు ఉడికించాలి.   చికెన్ ఉడుకుతుండగా సరిపడా ఉప్పు వేసి కలపాలి.  పూర్తిగా అయ్యాక దించి, వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి.

 

రసం
కావల్సినవి: చింతపండు - నిమకాయ పరిమాణం అంత టొమాటో - 1; ఉప్పు - తగినంత మిరియాలపొడి - టేబుల్ స్పూన్ జీలకర్ర - టేబుల్ స్పూన్ ఎండుమిర్చి - 3; వెల్లుల్లి - 4 పసుపు - చిటికెడు; నూనె - 2 టీ స్పూన్లు ఆవాలు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ  కొత్తిమీర తరుగు - టీ స్పూన్

 
తయారీ

చింతపండులో అర కప్పు నీళ్లు పోసి, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టాలి.టొమాటోను గుజ్జు చేసి తీసిన చింతపండు రసంలో కలపాలి.మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి కలిపి పొడి చేసుకోవాలి.కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.మరికాస్త నూనె వేసి టొమాటో గుజ్జు కలిపిన చింతపండు రసాన్ని కడాయిలో పోయాలి. పిప్పిని చేత్తోనే వడకట్టుకోవాలి. దీంట్లో మిరియాలు, వెల్లుల్లి కలిపి చేసిన మసాలా మిశ్రమం, ఉప్పు కలిపి మరిగించాలి. మంట తగ్గించి, కొత్తిమీర వేసి రసం మంచి వాసన వచ్చేంతవరకు ఉంచి దించేయాలి.

 

మిళగు పొంగల్
కావల్సినవి: బియ్యం - గ్లాసు పెసరపప్పు - అర గ్లాసు మిరియాలు - 2 స్పూన్లు జీలకర్ర - 2 స్పూన్లు నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు జీడిపప్పు - తగినన్ని  అల్లం తరుగు - అర టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ

 
తయారీ
మూకుడులో బియ్యం, మినపప్పు వేయించుకోవాలి.{పెజర్ కుకర్‌లో 3 కప్పుల నీళ్లు బియ్యం-పప్పు పోసి, పైన వెయిట్ పెట్టి, 5-6 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి.మిరియాల పొడి, జీలకర్ర పొడి చేసి పక్కన ఉంచాలి.విడిగా మూకుడులో నెయ్యి వేసి మిరియాలు, జీలకర్ర పొడి, జీడిపప్పు, అల్లం తరుగు, కరివేపాకు వేసి వేయించాలి.  కుకర్ మూత తీసి, పోపు మిశ్రమాన్ని కలపాలి. కావాలనుకుంటే మరికాస్త నెయ్యి వేసుకొని, సాంబారుతో వడ్డించాలి.

 

పాల్  పణి యారమ్
కావల్సినవి: కొబ్బరిపాలు - అర లీటరు నెయ్యి - 100 ఎం.ఎల్; పంచదార - 200 గ్రా.లు యాలకుల పొడి - టీ స్పూన్; మినప్పప్పు - 100 గ్రా.లు  బియ్యం - 100 గ్రా.లు; నూనె - వేయించడానికి తగినంత జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూన్

 
తయారీ
గోరువెచ్చని నీటిలో మినప్పప్పు, బియ్యం కడిగి, వేసి 2 గంటల సేపు నానబెట్టి, మెత్తగా రుబ్బుకోవాలి.   గిన్నెలో నెయ్యి వేడి చేసి, జీడిపప్పు పలుకులను వేయించాలి.  దీంట్లో కొబ్బరి పాలు, పంచదార వేసి బాగా చిక్కగా అయ్యేదాకా మరిగించాలి.  కడాయిలో నూనె పోసి కాగిన తర్వాత అందులో మెత్తగా రుబ్బిన మినప్పప్పు - బియ్యప్పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. వేయించిన వాటిని తీసి, మరుగుతున్న కొబ్బరి పాలలో వేసి, మంట తీసేయాలి. వేయించిన ఉండలు మెత్తగా అయ్యేంతవరకు ఉంచి, సర్వ్ చేయాలి.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement