Dining
-
వాలెంటైన్స్ డే: ఈ క్రెడిట్ కార్డుల ఆఫర్లతో మరింత ఆనందంగా..
ప్రేమ పక్షులు ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. ఆ రోజున తమ ప్రేమను తెలియజేసేందుకు, ఆనందంగా గడిపేందుకు ఏడాదంతా ఎదురు చూస్తారు. ప్రత్యేకమైన ఈరోజున ప్రేమికులు ప్రధానంగా డైనింగ్ కోసం రెస్టారెంట్లకు వెళ్తుంటారు లేదా నచ్చిన ఫుడ్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భంలో మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉంటే మరింతగా ఆనందించవచ్చు కదా.. వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందించే కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. బజాజ్ ఫిన్సర్వ్కు అనుబంధ సంస్థ అయిన బజాబ్ మార్కెట్స్ డైనింగ్‌పై డిస్కౌంట్లు అందిస్తున్న కొన్ని క్రెడిట్ కార్డుల గురించి తెలియజేసింది. ప్రేమికుల రోజును మరింత ఆనందంగా జరుపుకోవాలనుకుంటున్నవారు బజాబ్ మార్కెట్స్ వెబ్‌సైట్‌కి వెళ్లి వీటి గురించి తెలుసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైన కొన్ని క్రెడిట్ కార్డుల గురించి ఇక్కడ అందిస్తున్నాం.. యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డు క్యాండిల్ లైట్ డిన్నర్లు ప్లాన్ చేస్తున్నవారికి ఈ క్రెడిట్ ఉపయోగపడుతుంది. ఇది స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసే ఫుడ్ డెలివరీలపై తక్షణ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ కార్డుకు రూ.500 జాయినింగ్ ఫీజు ఉంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్లాటినమ్ ఆరా ఎడ్జ్ క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వాలైంటైన్స్ పార్టీలకు చేసే రెస్టారెంట్ బిల్లులపై 1.5 సేవింగ్ పాయింట్లు లభిస్తాయి. ఇక్కడ మరో ప్రయోజనకర విషయం ఏమిటంటే దీనికి ఎలాంటి వార్షిక ఫీజు లేదు. యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్ దీనిపై ఏకంగా 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కార్డు పార్ట్నర్ రెస్టారెంట్లలో చేసే డిన్నర్లకు ఇది వర్తిస్తుంది. అయితే ఈ క్రెడిట్ కార్డుకు రూ.250 జాయినింగ్ ఫీజు ఉంటుంది. -
ఆకలైతుందా.. తినేసిపో! అంతేరా! దా–తిను!
రెస్టారెంట్ల వ్యాపారంలోకి దిగుతున్నవారు.. భోజన ప్రియుల్ని, ఇంట్లో వంటకు విరామం ఇచ్చి వెరైటీగా హోటల్లో తిందామనుకుని వచ్చే వారిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హంగులు, ఆర్భాటాలతో మెప్పించేవారు కొందరైతే, వినూత్నమైన ఆలోచనలతో థీమ్ బేస్డ్ రెస్టారెంటుల ఏర్పాటు వైపు మరికొందరు మొగ్గుచూపుతున్నారు. ఇంకొందరు మాత్రం..తమ రెస్టారెంట్లు, టేక్ అవేలు, కర్రీ, బిరియానీ పాయింట్లకు..ప్రత్యేక ప్రాంతం, వంటకం, రుచి, అంకెలు, అక్షరాలు ఆధారంగా పేర్లు పెట్టేస్తున్నారు. మనం రోజువారీ ఉపయోగించే కొన్ని పదాలు, వాక్యాలు కూడా రెస్టారెంట్ల పేర్లుగా మారిపోతున్నాయి. వీటిల్లో కొన్ని సరదాగా ధ్వనించే, నవ్వు పుట్టించే పేర్లు కూడా ఉంటుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ తరహా ట్రెండ్ ఇటీవల బాగా పెరిగిపోయింది. – సాక్షి, సిటీడెస్క్ ఉడిపి, విలాస్, మిలటరీ స్థానంలో.. ► గతంలో చాలా హోటళ్లకు అన్నపూర్ణ, అజంతా లాంటి సాధారణ పేర్ల తర్వాత ఉడిపి అనో, విలాస్ అనో, మిలటరీ హోటల్ అనో ఉండేది. దేవుళ్లు, కుటుంబసభ్యులు, పిల్ల లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు కలిసొచ్చేలా పెట్టేవారు. ఇప్పుడ లాంటి పేర్లకు చాలావరకు కాలం చెల్లింది. కొత్త, వింతైన, సరదా పేర్లదే హవా. గ్రేటర్ హైదరాబాద్‌లో అలాంటి పేర్ల మీద ఓ లుక్కేద్దామా.. అన్ని రుచులూ ఇక్కడే.. ఉప్పు కారం (కొండాపూర్), పెప్పర్ అండ్ సాల్ట్ (షేక్‌పేట్), సిల్వర్ సాల్ట్ (బంరాహిల్స్), సాల్ట్ అండ్ పెప్పర్ (లక్డీకాపూల్), టామరిండ్ ట్రీ (చింతచెట్టు (సికింద్రాబాద్), టామరిండ్ (మణికొండ), రాయలసీమ రుచులు (చాలాచోట్ల ఉంది), తెలు గింటి రుచులు (కూకట్పల్లి), రాజుగారి రుచులు (కొత్తగూడ), గోదావరి రు చులు (జూబ్లీహిల్స్), నెల్లూరు రుచులు (మోతీనగర్), రాయలవారి రుచులు (యూసుఫ్‌గూడ), కోనసీమ వంటిల్లు (కూకట్పల్లి), కృష్ణపట్నం (బంజారాహిల్స్), సింప్లీ సౌత్ (జూబ్లీహిల్స్), సింప్లీ తెలంగాణ (కొత్తపేట్), మా పల్లె వంటకాలు (గచ్చిబౌలి). వంటకాలనూ వదలకుండా.. కోడికూర–చిట్టిగారె (జూబ్లీహిల్స్, కొండాపూర్), దిబ్బరొట్టి (మణికొండ), రాజుగారి పులావ్, పొట్లం పులావ్ (శ్రీనగర్ కాలనీ), పకోడా పాపారావు (కేపీహెచ్‌బీ ఫేజ్–1), ఉలవచారు (జూబ్లీహిల్స్), ముద్దపప్పు ఆవకాయ అండ్ మోర్ (గచ్చిబౌలి), నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు (కేపీహెచ్‌బీ, మణికొండ), పంచెకట్టు దోశ (ప్రగతినగర్), పులిహోరాస్ (మణికొండ), బిరియానీ వాలా, బిర్యానీ హౌస్ (బంజారాహిల్స్), కిచిడీ ఎక్స్‌ప్రెస్ (మాదాపూర్). ఆహా.. ఏమి పేర్లు.. ► వివాహ భోజనంబు (సికింద్రాబాద్, బంజారాహిల్స్), వియ్యాలవారి విందు (కొత్త పేట్), అద్భుత: (దిల్సుఖ్నగర్), తినే సిపో (కొంపల్లి), తిన్నంత భోజనం (ఉప్ప ల్, సికింద్రాబాద్), దా–తిను (హఫీజ్‌పేట), పొట్ట నింపు (గుండ్ల పోచంపల్లి), కడుపు నిండా (ఉప్పల్), భలే బంతి భోజనం (మియాపూర్), రా బావా తిని చూడు (కూకట్పల్లి), సెకండ్ వైఫ్, పందెం కోడి (వెంగళరావునగర్), అంతేరా (జూబ్లీహిల్స్), ఆకలైతుందా?.. పంచభక్ష్య (కూకట్పల్లి), మాయా బజార్ (కార్ఖానా), పందెం కోడి (వెంగళరావునగర్), విలేజ్ వంటకాలు, ఆహా (షేక్‌పేట), పాకశాల (కూకట్పల్లి), విస్తరాకు, అరిటాకు భోజనం (అమీర్‌పేట), లలితమ్మగారి భోజనం (బంజారాహిల్స్), బాబాయ్ భోజనం (నేరేడ్మెట్), తాళింపు (అమీర్‌పేట), గోంగూర (బంజారాహిల్స్), ఘుమఘుమలు (మాదాపూర్). ప్రాంతీయతకు ప్రతిరూపం..‘అంతేరా’ రెస్టారెంట్ ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రాంతీయత ప్రతిబింబించేలా పేరు పెట్టాలనుకున్నాం. ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ’ఆంధ్రా తెలంగాణ రాయలసీమ’ సమ్మేళనంతో ఆ పేర్ల లోని మొదటి అక్షరాలతో ‘అంతేరా’పేరును ఎంచుకున్నాం. ఈ మూడు ప్రాంతాల రుచులను అందిస్తున్నాం. – నిర్వాహకులు,అంతేరా రెస్టారెంట్ థీమ్‌తో ఫామ్‌లోకి.. ► కొందరు నిర్వాహకులు థీమ్/కాన్సెప్ట్ బేస్డ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తూ భోజనప్రియుల్ని ఆకర్షిస్తున్నారు. రైలు, గుహలు, అడవులు, పల్లె వాతావరణం, జైళ్లు, బీచ్ ఆధారంగా చేసుకుని రెస్టారెంట్లు వెలుస్తుండటం గమనార్హం. గుహను తలపించేలా ఏర్పాటు చేసిన గుఫా ఓహ్రీస్ (బషీర్‌బాగ్), అడవి వాతావరణాన్ని తలపించేలా ఏర్పా టు చేసిన మారేడుమిల్లి (గచ్చి బౌలి), జైలును గుర్తుకు తెచ్చే జైల్ మండి (చాలాచోట్ల ఉంది).. ఖైదీ కిచెన్ (బంజారాహిల్స్), రైల్లో ఉన్నట్టుగా ఉండే జర్నీ 1853 (బంజారాహిల్స్) ఈ కోవలోనివే. ఇక బొమ్మ రైలు మీద భోజనం రావడం (ప్లాట్‌ఫామ్ 65), రోబో ఆహారం సర్వ్ చేయడం (రోబో కిచెన్, జూబ్లీహిల్స్) లాంటి ప్రత్యేకతలతో కూడిన రెస్టారెంట్లు కూడా నగరంలో వెలిసి కస్టమర్లను అలరిస్తున్నాయి. వియ్యాలవారి విందు. బహు పసందు మా హోటల్లో అన్నీ ప్రత్యేక వంటకాలే. తెలుగు రుచులు మా సొంతం. వెరైటీగా ఉంటుందని వియ్యాలవారి విందు పేరు పెట్టాం. అందరూ వియ్యాల వారిని ఏ లోటు లేకుండా ఎలా చూసుకుంటారో అదే తరహాలో ఆతిథ్యం ఇస్తున్నాం. – సీహెచ్ఆర్వీ నర్సింహారెడ్డి, వియ్యాల వారి విందు నిర్వాహకుడు బావలకు ఇచ్చే మర్యాదే ఇస్తాం ఇంటికి వచ్చిన బావకి ఏ విధంగా మర్యాద చేస్తారో అదే విధంగా మా హోటల్‌కు వచ్చినవారికి ఇస్తాం. ఈ ఆలోచనతోనే ‘రా బావా.. తిని చూడు’అని మా హోటల్‌కి పేరు పెట్టాం. – రామకృష్ణారెడ్డి, ‘రా బావ తిని చూడు’యజమాని అక్షరాలు, నంబర్లు.. ► మండీ 36 (జూబ్లీహిల్స్), 1980 మిలటరీ హోటల్ (మణికొండ, సైనిక్‌పురి),అంగారా 5 (బంజారాహిల్స్), శ్యాల 95ఏ (మాదా పూర్), వై2కే (పంజగుట్ట), ఎన్ గ్రాండ్ (కార్ఖానా), ఎం గ్రాండ్ (వనస్థలిపురం), బీ ప్లేస్ (అయ్యప్ప సొసైటీ), డీ కార్పెంటర్ (మాసబ్‌ట్యాంక్), ఏ2జెడ్ (జీడిమెట్ల). కడుపారా ’తిన్నంత భోజనం’.. ‘తిన్నంత భోజనం’లో ఆత్మీయత, అనుబంధం కనిపిస్తుంది. మా వద్దకు వచ్చే కస్టమర్ మాకు బంధువుతో సమానం. చుట్టాల ఇంటికి వెళితే కడుపు నిండా అన్నం పెట్టి తమ ప్రేమను చాటుకుంటారు. మా రెస్టారెంట్‌కు వచ్చినా అంతే. – గాంధీ మిర్యాల, తిన్నంత భోజనం వ్యవస్థాపకులు -
వంటిల్లు.. పాలక్ చికెన్
ఇంటికి బంధువులు వస్తున్నారు. డైనింగ్ టేబుల్ కళకళలాడుతోంది. తోటకూర ఉంది... పక్కనే వేటకూరా ఉంది. కూరగాయల ఆధరువులూ కొలువుదీరాయి. బంధువుల వచ్చారు... భోజనాలు పూర్తయ్యాయి. వేటకూర పా త్రలో గరిటె మాత్రమే మిగిలింది. తోటకూర పా త్ర అదే కళతో నిండుగా ఉంది. కూరగాయల వంటలు దిగులుగా చూస్తున్నాయి. అతిథులు రుచిగా భోజనం చేశారు... సంతోషం. మరి... రుచికి ఆరోగ్యం జతగా చేరి ఉంటే మరీ సంతోషం. అందుకే... ఈ వారానికి ఇలా వండి టేస్ట్ చేద్దాం. పాలక్ చికెన్ కావలసినవి: పా లకూర– 100 గ్రాములు (శుభ్రం చేసినది) ; బోన్ లెస్ చికెన్ – పా వు కేజీ. మారినేట్ చేయడానికి: పెరుగు – 2 టేబుల్ స్పూన్లు ; మిరప్పొ డి – అర టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; కసూరి మేథీ (మెంతి ఆకులపొ డి) – టీ స్పూన్ (΄పొ డి లేక΄ోతే గుప్పెడు తాజా ఆకులు వాడవచ్చు) ; గరం మసాలాపొ డి– అర టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మరసం– టేబుల్ స్పూన్ ; నెయ్యి– టేబుల్ స్పూన్ . గ్రేవీ కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు ; యాలకులు – 3 ; బిర్యానీ ఆకులు – 2 ; జీలకర్ర – అర టీ స్పూన్ ; ఉల్లిపా యలు – 3 (గ్రైండ్ చేయాలి) ; వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ; అల్లం పేస్ట్ – టేబుల్ స్పూన్ ; పచి్చమిర్చి– 2 (నిలువుగా చీరాలి) ; టొమాటోలు – 3 (తొక్క, గింజలు తీసి గ్రైండ్ చేయాలి) ; మిరప్పొ డి– అర టీ స్పూన్ ; గరం మసాలాపొ డి– టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; కసూరి మేథీ– టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; మీగడ– టేబుల్ స్పూన్. గారి్నష్ చేయడానికి: వెన్న – టేబుల్ స్పూన్ తయారీ: ♦ చికెన్‌ను శుభ్రం చేసి పెద్ద పా త్రలో వేయాలి. మరొక పా త్రలో మారినేట్ చేయడానికి తీసుకున్న దినుసులను వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కల్లో వేసి అన్నింటికీ సమంగా పట్టించి మూతపెట్టి ఆ పా త్రను మూడు గంటల సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ♦ ఈ లోపు ఒక పా త్రలో నీటిని మరిగించి పా లకూర ఆకులను వేసి రెండు నిమిషాలపా టు మరిగిన తర్వాత ఆకులను చిల్లుల గరిటెతో బయటకు తీసి చన్నీటిలో వేయాలి. వేడి తగ్గిన తర్వాత వడ΄ోసి పక్కన ఉంచాలి. చల్లారిన తరవాత మెత్తగా గ్రైండ్ చేయాలి. ♦ మందపా టి పా త్రలో నెయ్యి వేడి చేసి మారినేట్ చేసిన చికెన్ వేసి (మీడియం మంట మీద ) ముక్కలను గరిటెతో కలుపుతూ మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడిన తరవాత దించేసి పక్కన పెట్టాలి. ♦ వెడల్పుగా ఉన్న పా న్లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. యాలకులు, బిర్యానీ ఆకులు, పచి్చమిర్చి, ఉల్లిపా య, వెల్లుల్లి, అల్లం పేస్టు వేసి మూడు నిమిషాల పా టు వేయించాలి. నూనె వేరు పడిన తర్వాత టొమాటో పేస్ట్ వేసి కలిపి అందులో ధనియాలపొ డి, మిరప్పొ డి, కసూరీ మేథీ, గరం మసాలాపొ డి, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తరవాత పా లకూర పేస్ట్, ఉడికించిన చికెన్ వేసి కలిపి నాలుగు నిమిషాల సేపు ఉడికించాలి. చివరగా మీగడ వేసి కలిపి దించేయాలి. వడ్డించేముందు కర్రీ మీద వెన్న వేయాలి. గోంగూర మటన్ కావలసినవి: మటన్ – అర కేజీ ; గోంగూర – పా వు కేజీ (ఆకులు); పసుపు – టీ స్పూన్ ; అల్లంవెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ; ఉల్లిపా య ముక్కలు – కప్పు ; మిరప్పొ డి– టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; జీలకర్రపొ డి– అర టీ స్పూన్ ; పచ్చి మిర్చి – 5 (నిలువుగా చీరాలి) ; కొత్తిమీర – చిన్న కట్ట ; గరం మసాలాపొ డి– టీ స్పూన్ ; షాజీర– టీ స్పూన్ ; యాలకులు – 2 ; దాల్చిన చెక్క – అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నూనె – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ♦ ప్రెషర్ కుక్కర్లో మటన్, జీలకర్రపొ డి, ధనియాల΄పొ డి, మిరప్పొ డి, అరకప్పు నీరు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. ♦ పెనంలో నూనె వేడి చేసి గరం మసాలా దినుసులన్నీ వేసి వేగిన తర్వాత ఉల్లిపా య ముక్కలు, ఉప్పు వేయాలి. ఉల్లిపా య ముక్కలు రంగు మారిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన ΄ోయేవరకు వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, పచి్చమిర్చి, గోంగూర ఆకులు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి. గోంగూర మెత్తబడిన తర్వాత మటన్ (ఉడికించిన నీటితోపా టు) వేసి కలిపి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ♦ చివరగా అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసి కలిపి గరం మసాలాపొ డి, కొత్తిమీర ఆకులు వేసి కలిపి దించేయాలి. చికెన్ వెజిటబుల్ స్ట్యూ కావలసినవి: చికెన్ – అర కేజీ ; నూనె – 2 టేబుల్ స్పూన్లు ; జీలకర్ర – అర టీ స్పూన్ ; మెంతులు – అర టీ స్పూన్ ; అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్ ; కరివేపా కు – 2 రెమ్మలు ; ఉల్లిపా య – 1 (తరగాలి) ; పచి్చమిర్చి– 1 (తరగాలి) ; టొమాటో – 1 (తరగాలి) ; బంగాళదుంప ముక్కలు – కప్పు ; క్యారట్ ముక్కలు – కప్పు ; బీన్స్ ముక్కలు – అర కప్పు ; పసుపు – టీ స్పూన్ ; కశ్మీర్ మిరప్పొ డి – టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; గరం మసాలాపొ డి– అర టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మరసం – టీ స్పూన్ ; మిరియాలపొ డి – పా వు టీ స్పూన్ నీరు – 3 కప్పులు. తయారీ: ∙ ♦ చికెన్ ముక్కలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ♦ పెద్ద పెనంలో నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేయించాలి. అందులో కరివేపా కు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి వేగిన తరవాత ఉల్లిపా య, పచి్చమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు మసాలాపొ డి, పసుపు, కశీ్మర్ మిరప్పొ డి, ధనియాలపొ డి వేసి అర నిమిషం పా టు సన్న మంట మీద అన్నింటినీ కలుపుతూ వేయించి, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ♦ ఇందులో చికెన్ ముక్కలు వేసి మసాలా మిశ్రమం బాగా పట్టేటట్లు కలిపి మూత పెట్టి సన్న మంట మీద ఐదు నిమిషాల పా టు ఉడికించాలి. ♦ ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, నీరు ΄ోసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత క్యారట్, బీన్స్ వేసి కలిపి మళ్లీ మూత పెట్టి మరో ఐదారు నిమిషాల పా టు ఉడకనివ్వాలి. ఇప్పుడు నిమ్మరసం, మిరియాలపొ డి వేసి కలిపి దించేయాలి. వేడి వేడి చికెన్ వెజిటబుల్ స్ట్యూ రెడీ. బీరకాయ రొయ్యలు కావలసినవి: రొయ్యలు – అరకేజీ (΄పొ ట్టు వలిచినవి) ; బీరకాయ – అరకేజీ ; పసుపు – అర టీ స్పూన్ ; పచ్చిమిర్చి– 2 ; ఉల్లిపా యలు – 4 ; అల్లంవెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్ ; ఆవాలు – టీ స్పూన్ ; జీలకర్ర – టీ స్పూన్ ; కరివేపా కు – 4 రెమ్మలు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నూనె – 4 టేబుల్ స్పూన్లు. తయారీ: ♦ రొయ్యలను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి మందంగా ఉన్న పా త్రలో వేయాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరప్పొ డి, కొద్దిగా నూనె వేసి కలిపి పదినిమిషాల సేపు పక్కన ఉంచాలి. ♦ బీరకాయ చెక్కు తీసి ముక్కలుగా తరగాలి. ♦ పెనంలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపా య ముక్కలు, పచి్చమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత కరివేపా కు వేయాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నమంట మీద ఉడకనివ్వాలి. ∙రొయ్యలు, మసాలా మిశ్రమం ఉన్న పా త్రను మరొక స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద ఉడికించాలి (ఇందులో నీరు ΄ోయనక్కరలేదు). రొయ్యలు ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని బీరకాయ ఉడుకుతున్న పా త్రలో వేయాలి. ఇందులో ఉప్పు, మిరప్పొ డి కూడా వేసి బాగా కలిపి రుచి కలిసే వరకు రెండు నిమిషాల సేపు ఉడికించాలి. -
'ఆపండి రా నాయనా'.. మీ అతి ప్రేమతో చంపేటట్లున్నారు!
టీమిండియా వెటరన్ ఆటగాడు శిఖర్ ధావన్ ఫన్నీ వీడియోలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. ఆటలో ఎంత దూకుడు కనబరుస్తాడో.. బయట అంత ఫన్నీగా ఉంటాడు. తనదైన హ్యూమర్‌ను జత చేసి అభిమానులకు నవ్వు తెప్పించిన సందర్భాలు కొకొల్లలు. తండ్రితో ధావన్ చెంపదెబ్బలు తిన్న వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా అలాంటి ఫన్నీ వీడియోనే మరొకటి మన ముందుకు తీసుకొచ్చాడు. మనం ఎవరైనా తెలిసిన వాళ్ల ఇంటికి మొదటిసారి వెళితే.. వాళ్లు చేసి అతిథి మర్యాదలు మాములుగా ఉండవు. ముఖ్యంగా తిండి తినే సమయంలో ఇలాంటి ప్రేమలు ఎక్కువగా కనిపిస్తాయి. మనం వద్దన్నా సరే తినండి.. తినండి అంటూ వడ్డించేస్తారు. అలాంటి సందర్బంలో వారి అతి ప్రేమను తట్టుకోవడం కష్టమవుతుంది. ఏమైనా చెబుదామంటే మొహమాటం అడ్డు వస్తుంది. ఇలాంటి అనుభవాలు మీకు కూడా చాలానే ఎదురయ్యే ఉంటాయి. తాజాగా ధావన్ ఇదే అంశాన్ని తీసుకొని ఒక ఫన్నీ వీడియో తయారు చేశాడు. ధావన్ డైనింగ్టేబుల్పై కూర్చొని ఉంటాడు. అతని ప్లేట్లో అప్పటికే రోటీలు, కర్రీలు, అన్నం, కప్పు సలాడ్‌తో నింపేశారు. ధావన్ ఇంకా తినడం ప్రారంభించకముందే పక్కన ఉన్న ఇద్దరు సర్వర్లు వడ్డిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ధావన్.. ''అరె భయ్యా ప్లేట్ ఖాళీ లేదు.. కాసేపు ఆగండి'' అని అన్నాడు. కానీ ధావన్ మాటను లెక్కచేయని సర్వర్లు..''అరె మీ ప్లేట్లో చాలా ఖాళీ ఉంది.. ముందు మీరు తినండి'' అని పేర్కొన్నారు. దీంతో ధావన్ ''మీ ప్రేమ తగలయ్యా.. తిండి పెట్టి పెట్టి నన్ను చంపేటట్లున్నారు.'' అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ధావన్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే వీడియోకు రెండు మిలియన్ వ్యూస్ రాగా.. మూడు లక్షల లైకులు.. 2వేల కామెంట్లు వచ్చాయి. కాగా ధావన్(గబ్బర్)కు ఇన్‌స్టాగ్రామ్‌లో 11.1 మిలియన్ ఫాలోవర్లు ఉండడం విశేషం. ఇక పరిమిత ఓవర్ల(50 ఓవర్లు) ఆటకు మాత్రమే పరిమితమైన శిఖర్ ధావన్ తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటునే వస్తున్నాడు. ఇటీవలే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అటు కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా గబ్బర్ అదరగొట్టాడు. విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి టీమిండియాకు సిరీస్ అందించడంతో పాటు మూడు వన్డేలు కలిపి 168 పరుగులు చేశాడు. తొలి వన్డేలో 97 పరుగుల వద్ద ఔటై తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) చదవండి: Ishan Kishan: ఎంపిక చేయలేదన్న కోపమా?.. పాట రూపంలో నిరసన Sachin-Yuvraj: కొత్త వేషంలో టీమిండియా దిగ్గజం.. టీజ్ చేసిన యువీ కాబోయే భార్యతో సాగర తీరంలో టీమిండియా ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ -
అక్కడ విందుభోజనం 13.4 కోట్లు..!!
సింగపూర్ః ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా... ఎంతమంది అతిథులను పిలిచి విందు భోజనం పెట్టినా కోటి రూపాయలకు మించి ఖర్చు కాదేమో... కానీ సింగపూర్ లోని ఓ రెస్టరెంట్ లో విందు భోజనం ఖరీదు సుమారు 13.4 కోట్ల రూపాయలు అంటే నమ్ముతారా? ఇంతకూ ఆ భోజనానికి అంత ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సింగపూర్ లోని ' సె లా వీ' హోటల్లో కాలు పెట్టాలంటేనే కోటీశ్వరుడయ్యుండాలి. అత్యంత సంపన్నులకోసం ఏర్పాటు చేసిన ఆ రెస్టరెంట్ లో సింగపూర్ లోని మరీనా బే శాండ్స్.. రష్యన్ వరల్డ్ ఆఫ్ డైమండ్స్ సంయుక్తంగా ప్రత్యేక విందును ఏర్పాటు చేశాయి. ఇద్దరు లక్కీ కపుల్ కోసం ఏర్పాటు చేసిన ఈ విందు భోజనం ఖరీదు 13.4 కోట్ల రూపాయలు. అయితే ఎంతటి ఖరీదైన ఆహార పదార్థాలను పెట్టినా అంతటి ఖర్చు ఉండదు కదా! అందుకే అక్కడ విందు చేయాలనుకునేవారికి ' సె లా వీ' కొన్ని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎనిమిది గంటలపాటు రెస్టరెంట్లో గడిపే అవకాశంతోపాటు.. భోజనానికి టికెట్ బుక్ చేసుకున్నవారికి ముందుగా 45 నిమిషాలపాటు హెలికాప్టర్ లో సింగపూర్ అందాలను చూపించే ఏర్పాటు చేసింది. అనంతరం రోల్స్ రాయిస్ కారులో మరీనా బే శాండ్ హోటల్ రూఫ్ పైన ఉండే ' సె లా వీ' రెస్టరెంట్ కు తీసుకెడతారు. సుమారు 10,000 తాజా గులాబీలతో చేసిన అలంకరణ వచ్చిన అతిథులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతుంది. 'సె లా వీ' కి చేరిన అథిదులిద్దరూ సింగపూర్ సిటీ అందాలను తిలకించేందుకు వీలుగా బాల్కనీలో విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఈ విందులో కూడా అత్యంత ఖరీదైన 18 రకాల వంటకాలను వడ్డిస్తారు. వాటిని తినేందుకు వచ్చిన వారి పేర్లతో వజ్రాలు పొదిగిన చాప్ స్టిక్ లను, 40-50 సంవత్సరాలనాటి ఓల్డ్ వింటేజ్ వైన్ సర్వ్ చేస్తారు. విందు భోజనం ఆస్వాదించిన ఇద్దరికీ ప్రపంచంలోనే అరుదైన వజ్రాలతో తయారు చేసిన 2.08 క్యారెట్ డైమండ్ ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇస్తారు. అయితే ఈ వజ్రం ఖరీదు సుమారు 13 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, సంపన్నమైన విందు అనుభవం అని, 'డైమండ్ ఇన్ ద స్కై' అన్నట్లు సంపన్నులకు ' సె లా వీ' ఆకాశం లోని నక్షత్రంలాంటిదని వరల్డ్ ఆఫ్ డైమండ్ గ్రూప్ డైరెక్టర్ కరన్ తిలానీ చెప్తున్నారు. అయితే ఈ విందు కేవలం ఎంపిక చేసిన ఇద్దరికి మాత్రమే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ ఇద్దర్నీ ఎంపిక చేసే విషయంలో మాత్రం సదరు వజ్రాల వ్యాపారులు చాలా కండిషన్లే పెట్టినట్లు తెలుస్తోంది. -
ఈ 'నగ్న రెస్టారెంట్'లో బట్టలిప్పి భోజనం చేస్తారు!
లండన్: భోజన ప్రియులకోసం లండన్ లోని ఓ హోటల్ కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. విభిన్నరుచులను చవిచూడాలనుకునే వారికోసం కొత్త పోకడకు తెరతీసింది. ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకునేందుకు ప్రత్యేక టాప్ అప్ లతో ఆహ్వానం పలుకుతోంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' పేరిట అన్ని ప్రత్యేకతలు కలిగిన థీమ్డ్ రెస్టారెంట్ ప్రారంభానికి స్థానిక ఔల్ కేఫ్.. శ్రీకారం చుట్టింది. లండన్ ప్రజలకు మరింత చేరువవ్వాలన్న ఉద్దేశంతో ఔల్ కేఫ్.. కొత్త డైనింగ్ అనుభవాలను అందించేందుకు 'నేకెడ్ రెస్టారెంట్' (నగ్న రెస్టారెంట్)ను ప్రారంభిస్తోంది. ప్రపంచంలోనే ఇప్పటి వరకూ ఎక్కడా లేని అదనపు సౌకర్యాలను వినియోగదారులకు అందించేందుకు ఈ హోటల్ ముందుకొచ్చింది. ఇంతకుముందు కడిల్ కేఫ్ లో కాఫీ, స్నాక్స్, టీతోపాటు కౌగిలింతల సౌకర్యాన్ని కూడా అందుకున్న లండన్ ప్రజలకు, ఇప్పుడు ఔల్ కేఫ్ బర్త్ డే డ్రెస్ (నగ్నంగా) తో భుజించే ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది. నగరంలోని భూగర్భ రైల్వే నెట్వర్క్ లండన్ ట్యూబ్.. కూడా ప్రస్తుతం పాప్ అప్ రెస్టారెంట్ గా మారిపోయింది. బ్రిటన్ రాజధానిలో భోజన ప్రియులకు ప్రత్యేక అనుభూతులను అందించేందుకు విభిన్నంగా ఆలోచించిన ఈ సంస్థ.. దుస్తులు తొలగించి మరీ (నగ్నంగా) భోజనాలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. విడిచిన దుస్తులు, ఇతర ఖరీదైన వస్తువులు భద్రపరచుకొనేందుకు హోటల్ ప్రత్యేక లాకర్ల వసతిని కల్పిస్తుందట. భోజనానికి దుస్తులు విప్పి కూర్చోవాలా, ఉంచుకొని కూర్చోవాలా అన్న ఎంపికను మాత్రం వినియోగదారుల ఇష్టానికే వదిలేసింది. గోప్యతకు వీలుగా రెస్టారెంట్లో బ్యాంబూ పార్టిషన్లతోపాటు ప్రత్యేక స్థలాన్ని కేటాయించిందట. ఇక్కడి సభ్యులు, సిబ్బంది కూడా కురుచ దుస్తులు ధరించి ఈ రెస్టారెంట్‌కు వచ్చేసారి ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. బున్యాది పేరుతో ఈ కొత్త రకం రెస్టారెంట్ సెంట్రల్ లండన్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ లభించే ప్రత్యేక సౌకర్యాలు, డిన్నర్లు, వంటి అనుభవాలను రుచిచూసేందుకు ముందుగా బున్యాది డాట్ కామ్ (thebunyadi.com) లో రిజిస్టర్ చేసుకోవచ్చట. ఇప్పటికే 4000 మందికి పైగా ప్రజలు ఈ కొత్త భోజనశాలను పరీక్షించేందుకు సైన్ అప్ చేశారట. దుస్తుల సంకెళ్ళనుండి విముక్తులను చేయడం, ఆధునిక జీవితంలో సరికొత్త అనుభవాలను చవి చూసేందుకు వీలుగా ఈ రెస్టారెంట్ ఉంటుందట. ఇక్కడ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు వంటివి ఉపయోగించే వీలు ఉండదట. ఎక్కువ కాంతి లేకుండా డిమ్ లైట్ (క్యాండిల్ లైట్) లోనే డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయని నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాదు పూర్వకాలపు పద్ధతిలో వంటకాలను కట్టెల పొయ్యిపై వండటం, మట్టి పాత్రలతో వడ్డించడం వంటివి కూడ ఇక్కడి సౌకర్యాల్లో భాగమే. ఈ రెస్టారెంట్లో 'నేకెడ్'' మాత్రమే కాదు 'నాన్ నేకెడ్' సెక్షన్ కూడ వేరుగా ఉంటుందట. -
చికెన్ చెట్టినాడు
నల్లా ఇరుక్కు... అంటే నల్లాలో నీళ్ళు వస్తున్నాయని కాదు. సాంబారు వస్తుందని! చాలా బాగుంది. అదే తమిళంలో నల్లా ఇరుక్కు. తమిళ భోజనమంటే, అంతా... సాంబరమే! అదేనండీ! సంబరమే!ఇవాళ డైనింగ్ టేబుల్ని త‘మిళ’ మిళ లాడించండి! ఇంక వెయిటింగ్ దేనికి? పొట్టంతా ఇరుక్కు... ఇరుక్కుగా ఉండేలా లాగించండి. వాంగో... వక్కారుంగో... సాపుడుంగో... (రండి... కూర్చోండి... ఆరగించండి...) అవల్ వడై కావల్సినవి: అటుకులు - 200 గ్రా.లు; ఉల్లిపాయలు - 1అల్లం తరుగు - అర టీ స్పూన్; వెల్లుల్లి తరుగు - అర టీ స్పూన్పచ్చిమిర్చి - 2 (తరగాలి); కొత్తిమీర - చిన్న కట్ట బియ్యప్పిండి - మూడున్నర టేబుల్ స్పూన్లు నూనె - వేయించడానికి తగినంత; ఉప్పు - తగినంత తయారీ: వేడినీళ్లలో అటుకులు వేసి 5 నిమిషాలు నానబెట్టి, వడకట్టాలి. అటుకులను నీళ్లు లేకుండా పిండేసి దీంట్లో ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం, వెల్లుల్లి, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి.బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని వడల్లా చేసుకోవాలి. కడాయిలో నూనె కాగాక తయారుచేసుకున్న అటుకుల వడలను వేసి గోధుమరంగు వచ్చేంతవరకు రెండు వైపులా వేయించాలి. వీటిని టొమాటో లేదా పుదీనా చట్నీతో వడ్డించాలి. మద్రాస్ సాంబార్ కావల్సినవి: మెంతులు - టీ స్పూన్ బెల్లం పొడి - మూడు టేబుల్ స్పూన్లు మునక్కాడలు - 1 (3 అంగుళాల పొడవులో ముక్కలు చేయాలి) టొమాటో - 2 (ముక్కలు చేయాలి) ఉల్లిపాయలు - పెద్దవి 2 (నిలువుగా ముక్కలు చేయాలి); శనగపప్పు - 3 టేబుల్ స్పూన్లు ధనియాలు - టేబుల్ స్పూన్ జీలకర్ర - టీ స్పూన్; ఆవాలు - అర టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ; కందిపప్పు - పావు కేజీ చింతపండు గుజ్జు - 6 టేబుల్ స్పూన్లు ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత నూనె - 4 టేబుల్ స్పూన్లు; మిరపకాయలు - 4పసుపు - అర టీ స్పూన్; పచ్చిమిర్చి - 4వెల్లుల్లి రెబ్బలు - 5 (కచ్చాపచ్చాగా దంచాలి) తయారీ: కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి పప్పు ఉడికించి, పక్కన ఉంచాలి. నెయ్యి వేసి శనగపప్పు, ధనియాలు, మెంతులు వేయించి, పొడి చేసి పక్కనుంచాలి. మందపాటి గిన్నెలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేయించాలి. దీంట్లో పసుపు, మునక్కాడలు, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. ఉడికిన కందిపప్పును మెత్తగా చేసి పై మిశ్రమంలో వేసి, కలపాలి. దీంట్లో బెల్లం, తగినన్ని నీళ్లు, ఉప్పు, వేయించి - మసాలా పొడి వేసి మరో 10 నిమిషాలు ఉడికించాలి. అన్ని దినుసులు సరిపోయావో లేదో సరి చూసుకొని దించాలి. నెయ్యితో ఈ సాంబారును వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి. చికెన్ చెట్టినాడు కావల్సినవి: చింతపండు - నిమకాయ పరిమాణం అంత టొమాటో - 1; ఉప్పు - తగినంత మిరియాలపొడి - టేబుల్ స్పూన్ జీలకర్ర - టేబుల్ స్పూన్ ఎండుమిర్చి - 3; వెల్లుల్లి - 4 పసుపు - చిటికెడు; నూనె - 2 టీ స్పూన్లు ఆవాలు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ కొత్తిమీర తరుగు - టీ స్పూన్ తయారీ చింతపండులో అర కప్పు నీళ్లు పోసి, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టాలి. టొమాటోను గుజ్జు చేసి తీసిన చింతపండు రసంలో కలపాలి.మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి కలిపి పొడి చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. మరికాస్త నూనె వేసి టొమాటో గుజ్జు కలిపిన చింతపండు రసాన్ని కడాయిలో పోయాలి. పిప్పిని చేత్తోనే వడకట్టుకోవాలి. దీంట్లో మిరియాలు, వెల్లుల్లి కలిపి చేసిన మసాలా మిశ్రమం, ఉప్పు కలిపి మరిగించాలి.మంట తగ్గించి, కొత్తిమీర వేసి రసం మంచి వాసన వచ్చేంతవరకు ఉంచి దించేయాలి. మోర్ కుళంబు కావలసినవి: చికెన్ ముక్కలు - పావుకేజీ సోంపు - ఒకటిన్నర టేబుల్ స్పూన్ అనాసపువ్వు - 5; ఎండుమిర్చి - 5 పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్ జీలకర్రపొడి - టీ స్పూన్; కొత్తిమీర - చిన్న కట్ట ఉప్పు - తగినంత; పచ్చిమిర్చి - 5 ఉల్లిపాయ తరుగు - 200 గ్రా.లు అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు గరం మసాలా - టీ స్పూన్; నూనె - 5 టేబుల్ స్పూన్లు తయారీ కొబ్బరి తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి మెత్తగా నూరుకోవాలి. గిన్నెలో చికెన్ ముక్కలు వేసి, దాంట్లో పచ్చిమిర్చి వేసి నూరిన కొబ్బరి మిశ్రమం, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలిపి అర గంటసేపు నానబెట్టాలి. కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో అనాసపువ్వు, ఎండుమిర్చి వేసి, ఆ తర్వాత ఉల్లిపాయ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.బాగా నానిన చికెన్‌లో గరం మసాలా వేసి కలిపి బాగా వేగిన ఉల్లిపాయ మిశ్రమంలో కలిపి, 15 నిమిషాలు ఉడికించాలి. చికెన్ ఉడుకుతుండగా సరిపడా ఉప్పు వేసి కలపాలి. పూర్తిగా అయ్యాక దించి, వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి. రసం కావల్సినవి: చింతపండు - నిమకాయ పరిమాణం అంత టొమాటో - 1; ఉప్పు - తగినంత మిరియాలపొడి - టేబుల్ స్పూన్ జీలకర్ర - టేబుల్ స్పూన్ ఎండుమిర్చి - 3; వెల్లుల్లి - 4 పసుపు - చిటికెడు; నూనె - 2 టీ స్పూన్లు ఆవాలు - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ కొత్తిమీర తరుగు - టీ స్పూన్ తయారీ చింతపండులో అర కప్పు నీళ్లు పోసి, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టాలి.టొమాటోను గుజ్జు చేసి తీసిన చింతపండు రసంలో కలపాలి.మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి కలిపి పొడి చేసుకోవాలి.కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.మరికాస్త నూనె వేసి టొమాటో గుజ్జు కలిపిన చింతపండు రసాన్ని కడాయిలో పోయాలి. పిప్పిని చేత్తోనే వడకట్టుకోవాలి. దీంట్లో మిరియాలు, వెల్లుల్లి కలిపి చేసిన మసాలా మిశ్రమం, ఉప్పు కలిపి మరిగించాలి. మంట తగ్గించి, కొత్తిమీర వేసి రసం మంచి వాసన వచ్చేంతవరకు ఉంచి దించేయాలి. మిళగు పొంగల్ కావల్సినవి: బియ్యం - గ్లాసు పెసరపప్పు - అర గ్లాసు మిరియాలు - 2 స్పూన్లు జీలకర్ర - 2 స్పూన్లు నెయ్యి - 5 టేబుల్ స్పూన్లు జీడిపప్పు - తగినన్ని అల్లం తరుగు - అర టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ తయారీ మూకుడులో బియ్యం, మినపప్పు వేయించుకోవాలి.{పెజర్ కుకర్‌లో 3 కప్పుల నీళ్లు బియ్యం-పప్పు పోసి, పైన వెయిట్ పెట్టి, 5-6 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి.మిరియాల పొడి, జీలకర్ర పొడి చేసి పక్కన ఉంచాలి.విడిగా మూకుడులో నెయ్యి వేసి మిరియాలు, జీలకర్ర పొడి, జీడిపప్పు, అల్లం తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. కుకర్ మూత తీసి, పోపు మిశ్రమాన్ని కలపాలి. కావాలనుకుంటే మరికాస్త నెయ్యి వేసుకొని, సాంబారుతో వడ్డించాలి. పాల్ పణి యారమ్ కావల్సినవి: కొబ్బరిపాలు - అర లీటరు నెయ్యి - 100 ఎం.ఎల్; పంచదార - 200 గ్రా.లు యాలకుల పొడి - టీ స్పూన్; మినప్పప్పు - 100 గ్రా.లు బియ్యం - 100 గ్రా.లు; నూనె - వేయించడానికి తగినంత జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూన్ తయారీ గోరువెచ్చని నీటిలో మినప్పప్పు, బియ్యం కడిగి, వేసి 2 గంటల సేపు నానబెట్టి, మెత్తగా రుబ్బుకోవాలి. గిన్నెలో నెయ్యి వేడి చేసి, జీడిపప్పు పలుకులను వేయించాలి. దీంట్లో కొబ్బరి పాలు, పంచదార వేసి బాగా చిక్కగా అయ్యేదాకా మరిగించాలి. కడాయిలో నూనె పోసి కాగిన తర్వాత అందులో మెత్తగా రుబ్బిన మినప్పప్పు - బియ్యప్పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. వేయించిన వాటిని తీసి, మరుగుతున్న కొబ్బరి పాలలో వేసి, మంట తీసేయాలి. వేయించిన ఉండలు మెత్తగా అయ్యేంతవరకు ఉంచి, సర్వ్ చేయాలి.