ఇంటికి బంధువులు వస్తున్నారు. డైనింగ్ టేబుల్ కళకళలాడుతోంది. తోటకూర ఉంది... పక్కనే వేటకూరా ఉంది. కూరగాయల ఆధరువులూ కొలువుదీరాయి. బంధువుల వచ్చారు... భోజనాలు పూర్తయ్యాయి. వేటకూర పా త్రలో గరిటె మాత్రమే మిగిలింది. తోటకూర పా త్ర అదే కళతో నిండుగా ఉంది. కూరగాయల వంటలు దిగులుగా చూస్తున్నాయి. అతిథులు రుచిగా భోజనం చేశారు... సంతోషం. మరి... రుచికి ఆరోగ్యం జతగా చేరి ఉంటే మరీ సంతోషం. అందుకే... ఈ వారానికి ఇలా వండి టేస్ట్ చేద్దాం.
పాలక్ చికెన్
కావలసినవి: పా లకూర– 100 గ్రాములు (శుభ్రం చేసినది) ; బోన్ లెస్ చికెన్ – పా వు కేజీ.
మారినేట్ చేయడానికి: పెరుగు – 2 టేబుల్ స్పూన్‌లు ; మిరప్పొ డి – అర టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; కసూరి మేథీ (మెంతి ఆకులపొ డి) – టీ స్పూన్ (΄పొ డి లేక΄ోతే గుప్పెడు తాజా ఆకులు వాడవచ్చు) ; గరం మసాలాపొ డి– అర టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మరసం– టేబుల్ స్పూన్ ; నెయ్యి– టేబుల్ స్పూన్ .
గ్రేవీ కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్‌లు ; యాలకులు – 3 ; బిర్యానీ ఆకులు – 2 ; జీలకర్ర – అర టీ స్పూన్ ; ఉల్లిపా యలు – 3 (గ్రైండ్ చేయాలి) ; వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ; అల్లం పేస్ట్ – టేబుల్ స్పూన్ ; పచి్చమిర్చి– 2 (నిలువుగా చీరాలి) ; టొమాటోలు – 3 (తొక్క, గింజలు తీసి గ్రైండ్ చేయాలి) ; మిరప్పొ డి– అర టీ స్పూన్ ; గరం మసాలాపొ డి– టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; కసూరి మేథీ– టేబుల్ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; మీగడ– టేబుల్ స్పూన్.
గారి్నష్ చేయడానికి: వెన్న – టేబుల్ స్పూన్
తయారీ: ♦ చికెన్‌ను శుభ్రం చేసి పెద్ద పా త్రలో వేయాలి. మరొక పా త్రలో మారినేట్ చేయడానికి తీసుకున్న దినుసులను వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కల్లో వేసి అన్నింటికీ సమంగా పట్టించి మూతపెట్టి ఆ పా త్రను మూడు గంటల సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.
♦ ఈ లోపు ఒక పా త్రలో నీటిని మరిగించి పా లకూర ఆకులను వేసి రెండు నిమిషాలపా టు మరిగిన తర్వాత ఆకులను చిల్లుల గరిటెతో బయటకు తీసి చన్నీటిలో వేయాలి. వేడి తగ్గిన తర్వాత వడ΄ోసి పక్కన ఉంచాలి. చల్లారిన తరవాత మెత్తగా గ్రైండ్ చేయాలి.
♦ మందపా టి పా త్రలో నెయ్యి వేడి చేసి మారినేట్ చేసిన చికెన్ వేసి (మీడియం మంట మీద ) ముక్కలను గరిటెతో కలుపుతూ మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడిన తరవాత దించేసి పక్కన పెట్టాలి.
♦ వెడల్పుగా ఉన్న పా న్‌లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. యాలకులు, బిర్యానీ ఆకులు, పచి్చమిర్చి, ఉల్లిపా య, వెల్లుల్లి, అల్లం పేస్టు వేసి మూడు నిమిషాల పా టు వేయించాలి. నూనె వేరు పడిన తర్వాత టొమాటో పేస్ట్ వేసి కలిపి అందులో ధనియాలపొ డి, మిరప్పొ డి, కసూరీ మేథీ, గరం మసాలాపొ డి, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తరవాత పా లకూర పేస్ట్, ఉడికించిన చికెన్ వేసి కలిపి నాలుగు నిమిషాల సేపు ఉడికించాలి. చివరగా మీగడ వేసి కలిపి దించేయాలి. వడ్డించేముందు కర్రీ మీద వెన్న వేయాలి.
గోంగూర మటన్
కావలసినవి:
మటన్ – అర కేజీ ; గోంగూర – పా వు కేజీ (ఆకులు); పసుపు – టీ స్పూన్ ; అల్లంవెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్ ; ఉల్లిపా య ముక్కలు – కప్పు ; మిరప్పొ డి– టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; జీలకర్రపొ డి– అర టీ స్పూన్ ; పచ్చి మిర్చి – 5 (నిలువుగా చీరాలి) ; కొత్తిమీర – చిన్న కట్ట ; గరం మసాలాపొ డి– టీ స్పూన్ ; షాజీర– టీ స్పూన్ ; యాలకులు – 2 ; దాల్చిన చెక్క – అంగుళం ముక్క ; లవంగాలు – 2 ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నూనె – 2 టేబుల్ స్పూన్‌లు.
తయారీ: ♦ ప్రెషర్ కుక్కర్‌లో మటన్, జీలకర్రపొ డి, ధనియాల΄పొ డి, మిరప్పొ డి, అరకప్పు నీరు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.
♦ పెనంలో నూనె వేడి చేసి గరం మసాలా దినుసులన్నీ వేసి వేగిన తర్వాత ఉల్లిపా య ముక్కలు, ఉప్పు వేయాలి. ఉల్లిపా య ముక్కలు రంగు మారిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన ΄ోయేవరకు వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, పచి్చమిర్చి, గోంగూర ఆకులు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి. గోంగూర మెత్తబడిన తర్వాత మటన్ (ఉడికించిన నీటితోపా టు) వేసి కలిపి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.
♦ చివరగా అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసి కలిపి గరం మసాలాపొ డి, కొత్తిమీర ఆకులు వేసి కలిపి దించేయాలి.
చికెన్ వెజిటబుల్ స్ట్యూ
కావలసినవి: చికెన్ – అర కేజీ ; నూనె – 2 టేబుల్ స్పూన్‌లు ; జీలకర్ర – అర టీ స్పూన్ ; మెంతులు – అర టీ స్పూన్ ; అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్ ; కరివేపా కు – 2 రెమ్మలు ; ఉల్లిపా య – 1 (తరగాలి) ; పచి్చమిర్చి– 1 (తరగాలి) ; టొమాటో – 1 (తరగాలి) ; బంగాళదుంప ముక్కలు – కప్పు ; క్యారట్ ముక్కలు – కప్పు ; బీన్స్ ముక్కలు – అర కప్పు ; పసుపు – టీ స్పూన్ ; కశ్మీర్ మిరప్పొ డి – టీ స్పూన్ ; ధనియాలపొ డి– టీ స్పూన్ ; గరం మసాలాపొ డి– అర టీ స్పూన్ ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నిమ్మరసం – టీ స్పూన్ ; మిరియాలపొ డి – పా వు టీ స్పూన్
నీరు – 3 కప్పులు.
తయారీ: ∙
♦ చికెన్ ముక్కలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
♦ పెద్ద పెనంలో నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేయించాలి. అందులో కరివేపా కు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి వేగిన తరవాత ఉల్లిపా య, పచి్చమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు మసాలాపొ డి, పసుపు, కశీ్మర్ మిరప్పొ డి, ధనియాలపొ డి వేసి అర నిమిషం పా టు సన్న మంట మీద అన్నింటినీ కలుపుతూ వేయించి, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
♦ ఇందులో చికెన్ ముక్కలు వేసి మసాలా మిశ్రమం బాగా పట్టేటట్లు కలిపి మూత పెట్టి సన్న మంట మీద ఐదు నిమిషాల పా టు ఉడికించాలి.
♦ ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, నీరు ΄ోసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు ఉడికించాలి. ఆ తర్వాత క్యారట్, బీన్స్ వేసి కలిపి మళ్లీ మూత పెట్టి మరో ఐదారు నిమిషాల పా టు ఉడకనివ్వాలి. ఇప్పుడు నిమ్మరసం, మిరియాలపొ డి వేసి కలిపి దించేయాలి. వేడి వేడి చికెన్ వెజిటబుల్ స్ట్యూ రెడీ.
బీరకాయ రొయ్యలు కావలసినవి:
రొయ్యలు – అరకేజీ (΄పొ ట్టు వలిచినవి) ; బీరకాయ – అరకేజీ ; పసుపు – అర టీ స్పూన్ ; పచ్చిమిర్చి– 2 ; ఉల్లిపా యలు – 4 ; అల్లంవెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్ ; ఆవాలు – టీ స్పూన్ ; జీలకర్ర – టీ స్పూన్ ; కరివేపా కు – 4 రెమ్మలు ; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి ; నూనె – 4 టేబుల్ స్పూన్‌లు.
తయారీ:
♦ రొయ్యలను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి మందంగా ఉన్న పా త్రలో వేయాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరప్పొ డి, కొద్దిగా నూనె వేసి కలిపి పదినిమిషాల సేపు పక్కన ఉంచాలి.
♦ బీరకాయ చెక్కు తీసి ముక్కలుగా తరగాలి.
♦ పెనంలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపా య ముక్కలు, పచి్చమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత కరివేపా కు వేయాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నమంట మీద ఉడకనివ్వాలి. ∙రొయ్యలు, మసాలా మిశ్రమం ఉన్న పా త్రను మరొక స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద ఉడికించాలి (ఇందులో నీరు ΄ోయనక్కరలేదు). రొయ్యలు ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని బీరకాయ ఉడుకుతున్న పా త్రలో వేయాలి. ఇందులో ఉప్పు, మిరప్పొ డి కూడా వేసి బాగా కలిపి రుచి కలిసే వరకు రెండు నిమిషాల సేపు ఉడికించాలి.
Comments
Please login to add a commentAdd a comment