వాలెంటైన్స్ డే: ఈ క్రెడిట్‌ కార్డుల ఆఫర్లతో మరింత ఆనందంగా.. | Valentines Day Explore Credit Card Dining Offers for the Perfect Date | Sakshi
Sakshi News home page

Valentines Day: డిన్నర్‌కి వెళ్తున్నారా? ఈ క్రెడిట్‌ కార్డుల ఆఫర్లతో మరింత ఆనందంగా..

Published Sat, Feb 10 2024 2:26 PM | Last Updated on Sat, Feb 10 2024 2:50 PM

Valentines Day Explore Credit Card Dining Offers for the Perfect Date - Sakshi

ప్రేమ పక్షులు ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. ఆ రోజున తమ ప్రేమను తెలియజేసేందుకు, ఆనందంగా గడిపేందుకు ఏడాదంతా ఎదురు చూస్తారు. ప్రత్యేకమైన ఈరోజున ప్రేమికులు ప్రధానంగా డైనింగ్‌ కోసం రెస్టారెంట్లకు వెళ్తుంటారు లేదా నచ్చిన ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భంలో మంచి డిస్కౌంట్‌ ఆఫర్లు ఉంటే మరింతగా ఆనందించవచ్చు కదా..

వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే డిస్కౌంట్‌ ఆఫర్లు అందించే కొన్ని క్రెడిట్‌ కార్డుల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌కు అనుబంధ సంస్థ అయిన బజాబ్‌ మార్కెట్స్‌ డైనింగ్‌పై డిస్కౌంట్లు అందిస్తున్న కొన్ని క్రెడిట్‌ కార్డుల గురించి తెలియజేసింది. ప్రేమికుల రోజును మరింత ఆనందంగా జరుపుకోవాలనుకుంటున్నవారు బజాబ్‌ మార్కెట్స్‌ వెబ్‌సైట్‌కి వెళ్లి వీటి గురించి తెలుసుకోవచ్చు. వాటిలో ముఖ్యమైన కొన్ని క్రెడిట్‌ కార్డుల గురించి ఇక్కడ అందిస్తున్నాం..

యాక్సిస్‌ బ్యాంక్‌ మై జోన్‌ క్రెడిట్‌ కార్డు
క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌లు ప్లాన్‌ చేస్తున్నవారికి ఈ క్రెడిట్‌ ఉపయోగపడుతుంది. ఇది స్విగ్గీ ద్వారా ఆర్డర్‌ చేసే ఫుడ్‌ డెలివరీలపై తక్షణ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ కార్డుకు రూ.500 జాయినింగ్‌ ఫీజు ఉంటుంది.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్లాటినమ్‌ ఆరా ఎడ్జ్‌  క్రెడిట్‌ కార్డు
ఈ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా వాలైంటైన్స్‌ పార్టీలకు చేసే రెస్టారెంట్‌ బిల్లులపై 1.5 సేవింగ్‌ పాయింట్లు లభిస్తాయి. ఇక్కడ మరో ప్రయోజనకర విషయం ఏమిటంటే దీనికి ఎలాంటి వార్షిక ఫీజు లేదు.

యాక్సిస్‌ బ్యాంక్‌ నియో క్రెడిట్‌ కార్డ్‌
దీనిపై ఏకంగా 15 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ కార్డు పార్ట్‌నర్‌ రెస్టారెంట్లలో చేసే డిన్నర్లకు ఇది వర్తిస్తుంది. అయితే ఈ క్రెడిట్‌ కార్డుకు రూ.250 జాయినింగ్‌ ఫీజు ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement