ఇడ్లీ తట్టలో చిక్కుకున్న వేలు
కర్ణాటక ,శివాజీనగర: ఇంట్లో చిన్న పిల్లలుంటే ఎంతో సందడిగా ఉంటుంది, ఒక్కోసారి వారిపట్ల పెద్దలు అజాగ్రత్తగా ఉంటే సమస్యలు కూడా వస్తాయి. నోట్లో ఏదైనా వస్తువు పెట్టుకోవడం, మింగడం వంటివి చేస్తుంటారు. ఓ 18 నెలల బాలుడు ఇడ్లీ తట్ట రంధ్రంలో వేలును దూర్చడంతో అది కాస్తా ఇరుక్కుపోయింది. దీంతో మార్తహళ్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు స్టీల్ కటింగ్ మిషన్‌ను తీసుకొచ్చి ఇడ్లీ తట్టను కత్తిరించాలని నిర్ణయించారు. సుమారు ఒక గంట పాటు కష్టపడి ప్లేటును కత్తిరించి బిడ్డ వేలుకు విముక్తి కల్పించారు. రంధ్రంలో వేలు చిక్కుకొని తక్షణమే ఉబ్బటం మొదలైంది. బయటకు తీయడం సాధ్యం కాలేదు, దీంతో ప్లేటును కత్తిరించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment