ఆబాలగోపాలానికి ఇడ్లీ ఇష్టమైన ఫుడ్. రుచి విషయంలోనే కాదు సులభంగా జీర్ణమయ్యే ఈ అద్భుత వంటకం ఆరోగ్యానికి అదనపు బలం. మన ఆల్‌టైమ్ ఫేవరెట్ ఇడ్లీ గురించి కొన్ని విషయాలు...బటన్ ఇడ్లీ, తల్లే ఇడ్లీ, సాంబర్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ...ఇలా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రకాల వెరైటీ ఇడ్లీలు ఉన్నాయి. లాంగ్ లాంగ్ ఎగో, వన్స్ ఆపాన్ ఏ టైమ్ ‘ఇడ్లీ’ ఇండోనేషియా నుంచి ఇక్కడికి వచ్చిందని ఫుడ్ హిస్టారియన్ కె.జె.ఆచార్య పరిశోధనాత్మకంగా తెలియజేశారు. వారి ‘కెడ్లీ’నే మన ‘ఇడ్లీ’ అంటారు ఆచార్య. లిజి కొలింగమ్ అనే మరో ఫుడ్ హిస్టారియన్ మాత్రం అలనాడు అరబ్ వ్యాపారులు సముద్రతీర ప్రాంత ప్రజలకు ఇడ్లీని పరిచయం చేశారని అంటారు.
‘ఇడ్డలిగె’ అనే కన్నడ పదం నుంచి ‘ఇడ్లీ’ వచ్చింది అంటారు. కొందరు మాత్రం 12వ శతాబ్దానికి చెందిన సంస్కృత పదం ‘ఇడ్డరిక’ నుంచి వచ్చింది అంటారు. మరికొందరు సౌరాష్ట్ర (గుజరాత్) ప్రాంతానికి చెందిన నేతకార్మికులు ఉపయోగించే ‘ఇడడ’ నుంచి వచ్చింది అంటారు.‘రామసేరి ఇడ్లీ’ అనేది ఇడ్లీలలో ప్రత్యేకత సంతరించుకుంది. సదరు ఈ ఇడ్లీ మనం రోజూ చూసే ఇడ్లీ సైజులో కాకుండా ఏకంగా దోసె సైజ్‌లో ఉంటుంది. డిఫెన్స్ ఫుడ్ రిసెర్చి లెబోరేటరి(డీఎఫ్‌ఆర్‌ఎల్) ఆస్ట్రోనాట్స్ కోసం ‘స్పేస్ ఇడ్లీ’తో పాటు పౌడర్ చెట్నీ కూడా తయారు చేసింది. చెన్నైకి చెందిన ఎనియవన్ అనే వ్యక్తి ఇడ్లీకి ఈరాభిమాని. ఇడ్లీకి ఒకరోజు ఉండాలంటూ ‘వరల్డ్ ఇడ్లీ డే’ మొదలుపెట్టాడు. ఫుడ్‌వరల్డ్‌లో ఇదొక ట్రెండ్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment