Recipe: పన్నీర్‌ వెజిటబుల్‌ ఇడ్లీ, కోకోనట్‌ పాన్‌కేక్‌ తయారు చేసుకోండిలా! | Recipes In Telugu: How To Prepare Vegetable Idli And Coconut Pancakes | Sakshi
Sakshi News home page

Paneer Vegetable Idli Recipe: పన్నీర్‌ వెజిటబుల్‌ ఇడ్లీ, కోకోనట్‌ పాన్‌కేక్‌ తయారు చేసుకోండిలా!

Published Wed, Aug 3 2022 3:02 PM | Last Updated on Wed, Aug 3 2022 3:13 PM

Recipes In Telugu: How To Prepare Vegetable Idli And Coconut Pancakes - Sakshi

హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ పన్నీర్‌ వెజిటబుల్‌ ఇడ్లీ, కోకోనట్‌ పాన్‌కేక్‌ ఇలా తయారు చేసుకోండి!
పన్నీర్‌ వెజిటబుల్‌ ఇడ్లీ తయారీకి కావలసినవి:
►పన్నీర్‌ తురుము – అరకప్పు
►క్యారట్‌ తురుము – పావు కప్పు
►క్యాబేజీ తరుగు – పావు కప్పు
►సూజీ రవ్వ – అరకప్పు

►పెరుగు – కప్పు
►శనగపిండి – అరకప్పు
►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
►పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను
►ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ:
►ఒక గిన్నెలో సూజీ రవ్వ, శనగపిండి, పెరుగువేసి కలపాలి.
►దీనిలో పావు కప్పు నీళ్లు కలిపి అరగంటపాటు నానబెట్టుకోవాలి.
►నానిన పిండిలో మిగతా పదార్థాలు, ఉప్పు వేసి చక్కగా కలపాలి.
►ఇడ్లీ పాత్రలో ఈ పిండిని వేసి ఆవిరి మీద పదిహేను నిమిషాలు ఉడికించి, కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్‌ చేసుకోవాలి. 

కోకోనట్‌ పాన్‌కేక్‌ తయారీకి కావలసినవి:
►కొబ్బరి పాలు – ముప్పావు కప్పు
►పచ్చికొబ్బరి తురుము – అరకప్పు
►గుడ్లు – రెండు
►పంచదార – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు

►బటర్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు
►గోధుమ పిండి – కప్పు
►వంటసోడా – మూడు టీస్పూన్లు
►ఉప్పు – అరటీస్పూను
►నూనె – అరకప్పు
►మేపుల్‌ సిరప్‌ – పావు కప్పు.

కోకోనట్‌ పాన్‌కేక్‌ తయారీ:
►గిన్నెలో కొబ్బరిపాలు, పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి పక్కనపెట్టుకోవాలి.
►మరో గిన్నెలో గుడ్లసొనను బీట్‌ చేయాలి.
►బటర్‌ను కరిగించి గుడ్ల సొనలో వేసి మరోసారి బీట్‌ చేయాలి.
►ఇప్పుడు కొబ్బరిపాల మిశ్రమంలో గుడ్లసొన, బటర్‌ మిశ్రమాన్ని వేసి చక్కగా కలపాలి.

►మరో గిన్నెలో గోధుమపిండి, వంటసోడా, ఉప్పు వేసి కలపాలి.
►ఈ మిశ్రమాన్ని కూడా కొబ్బరిపాల మిశ్రమంలో వేసి కలపాలి.
►స్టవ్‌ మీద పాన్‌పెట్టి టేబుల్‌ స్పూను నూనెవేసి పాన్‌ మొత్తం రాయాలి.

►నూనె వేడెక్కిన తరువాత పావుకప్పు మిశ్రమం వేసి నీటిబుడగలు లేకుండా అట్టులా పోసుకోవాలి.
►సన్నని మంట మీద రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత తీసి ప్లేట్‌లో వేసి మేపుల్‌ సిరప్‌ చల్లుకుని వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్‌ రింగ్స్‌ తయారీ ఇలా!  
Oats Uthappam Recipe: ఓట్స్‌ ఊతప్పం తయారీ విధానం ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement