Pan Cakes
-
లక్షల్లో ఒకరికే వచ్చే అరుదైన సమస్య
హైదరాబాద్, నగరంలోని కొంపల్లి ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మహిళకు పుట్టుకతోనే రెండు కిడ్నీలు కలిసిపోయి ఉండడంతో పాటు.. వాటిలో కుడివైపు కిడ్నీ ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా కింది భాగంలో ఏర్పడింది. పైగా మామూలుగా కిడ్నీ అంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. కానీ ఈ కేసులో మాత్రం అవి పాన్కేక్ మాదిరిగా ఉన్నాయి. 45 ఏళ్లుగా ఆ మహిళ ఇలా పాన్కేక్ కిడ్నీలతోనే జీవిస్తున్నారు. తాజాగా ఆ రెండింటికీ మధ్యలో క్యాన్సర్ కణితి వచ్చింది. పాన్కేక్ కిడ్నీలు ఉండడమే అత్యంత అరుదు. 3.75 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుంది. ఇలాంటి ప్రదేశంలో కేన్సర్ కణితి రావడం మరింత అరుదు. కలిసిపోయిన కిడ్నీలను ఫ్యూజ్డ్ కిడ్నీ అని, వేరే ప్రదేశంలో ఉండడాన్ని ఎక్టోపిక్ కిడ్నీ అని అంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆ రెండింటికీ మధ్యలో కణితి ఏర్పడితే దాన్ని కనిపెట్టడమే చాలా కష్టం. కిడ్నీలకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు కూడా ఎక్కడున్నాయో గుర్తించాలి. అందుకే.. నగరంలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు సీటీ స్కాన్ చేసి, దాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించడం ద్వారా 3-డి ఇమేజ్ సృష్టించారు. దాని సాయంతో అసలు కిడ్నీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి రక్తసరఫరా ఎటు నుంచి జరుగుతోంది, కణితి ఎక్కడుందన్న విషయాలను గుర్తించారు. ఈ వివరాలను ఆస్పత్రికి చెందిన రోబోటిక్ అండ్ యూరో ఆంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం గౌస్ తెలిపారు.“కొంపల్లికి చెందిన 45 ఏళ్ల మహిళ వచ్చినప్పుడు పరీక్షలు చేస్తే.. ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. సీటీ స్కాన్ చేసి చూడగా పరిస్థితి మరింత సంక్లిష్టంగా అనిపించింది. దాంతో అప్పుడు 3-డి మోడల్ సృష్టించి దాన్ని పరిశీలించగా.. రెండు కిడ్నీలు కలిసిపోయి ఉండడం, కుడివైపు కిడ్నీ ఉండాల్సిన చోట కాకుండా కింద కటిప్రాంతంలో ఉండడం, ఒక కిడ్నీ ఉండాల్సిన ఆకారంలో కాకుండా పాన్‌కేక్‌లా ఉండడం లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో కణితి ఏర్పడడం లాంటివి గుర్తించాము. సాధారణంగా అయితే ఇలాంటి కణితులను అవి సరిగ్గా ఎక్కడ, ఎంత పరిమాణంలో ఉన్నాయో గమనించడం చాలా కష్టం. అందుకే అత్యంత అరుదుగా చేసే 3-డి మోడలింగ్ పద్ధతిని మేం ఎంచుకున్నాం. దీనివల్ల శస్త్రచికిత్సకు ముందుగానే చేసుకునే ప్లానింగ్ చాలా సులభం అవుతుంది. ఇలాంటి కేసుల్లో కిడ్నీలో కొంత భాగం గానీ, పూర్తి కిడ్నీని గానీ తొలగించాల్సి ఉంటుంది. అయితే ఈ కేసులో సంక్లిష్లత చూసుకుంటే.. ఇది పాన్కేక్ కిడ్నీ కావడం, రక్తసరఫరా కూడా ఇబ్బందికరంగా ఉండడంతో ఓపెన్ శస్త్రచికిత్స చేయడం కుదరని పని. దాంతో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కీహోల్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం.ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి.మల్లికార్జున నాయకత్వంలో మా బృందం అత్యంత అరుదైన, సంక్లిష్టమైన ఈ శస్త్రచికిత్స ప్రారంభించింది. మా ఆస్పత్రిలోని ప్రముఖ యూరో ఆంకాలజిస్టు డాక్టర్ రాజేష్ కూడా ఈ శస్త్రచికిత్స మొత్తంలో చాలా కీలకపాత్ర పోషించారు. 3-డి మోడల్ ఉండడంతో, కేవలం రెండు చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా మొత్తం కణితిని అత్యంత కచ్చితత్వంతో తొలగించాం. కీహోల్ శస్త్రచికిత్స కావడంతో రక్తస్రావం కూడా చాలా తక్కువగానే జరిగింది. రోగి పూర్తిగా కోలుకోవడంతో మూడో రోజునే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం.ఇలా చేయడం ఇదే తొలిసారిఈ కేసు చాలా చరిత్రాత్మకం. ఎందుకంటే.. ఇలాంటి కలిసిపోయి ఉన్న, పాన్కేక్ కిడ్నీల మధ్యలో ఏర్పడిన కణితిని ఇప్పటివరకు కేవలం ఓపెన్ పద్ధతిలోనే తొలగించారు. కీహోల్ శస్త్రచికిత్స చేయడం ఇప్పటివరకు ఎక్కడా లేదు. తొలిసారిగా ఏఐఎన్‌యూలోనే ఈ ఘనత సాధించగలిగాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి వైద్యుల నైపుణ్యం కూడా తోడైనప్పుడే ఇలా చేయగలం. 3-డి మోడలింగ్ చేయగలడం ఇందులో అతిపెద్ద విజయం. దానివల్లే అన్నిరకాల సవాళ్లను మేం అధిగమించి, శస్త్రచికిత్సను విజయవంతంగా చేయగలిగాం” అని డాక్టర్ ఎస్ఎం గౌస్ వివరించారు.ఈ సందర్భంగా ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, “యూరాలజీ, ఆంకాలజీ విభాగాల్లో అత్యుత్తమంగా ఏం చేయగలమో అన్నింటినీ చేయాలన్నది ఏఐఎన్‌యూలో మా అందరి ఏకైక లక్ష్యం. అందుకోసం అన్నిరకాల సరిహద్దులను చెరిపేందుకు మేం సదా సిద్ధం. ఈ విజయం మా బృందం నిబద్ధత, సమర్థత, అత్యంత సంక్లిష్ట కేసులను కూడా పూర్తి కచ్చితత్వంతో చేయగల సామర్థ్యాలకు మరో నిదర్శనం” అని చెప్పారు. -
చల్లటి చలిలో కారం కారంగా కరకరలాడే పొటాటో పాన్‌కేక్స్ చేయండిలా!
చలి కొరుకుడుని తట్టుకోవాలంటే నోటికి కాస్త వేడివేడి రుచులు తగలాల్సిందే. వేడితోపాటు కారం, కరకర లాడే కమ్మదనం తోడయితే చలిని కూడా కొరికేయవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు. కావలసిన పదార్థాలు: ఉడికించి చిదుముకున్న బంగాళ దుంపలు – రెండు కప్పులు గుడ్డు – ఒకటి మైదా – ముప్పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు చీజ్ తరుగు – కప్పు; క్యారట్ తురుము – అరకప్పు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – రెండు టీస్పూన్లు నూనె – అరకప్పు పుల్లటి పెరుగు – గార్నిష్‌కు సరిపడా తయారీ విధానం: గిన్నెలో చిదిమిన దుంపల మిశ్రమం, గుడ్డుసొన, మైదా, స్ప్రింగ్ ఆనియన్, చీజ్ తరుగు, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ఈ మిశ్రమం చేతులకు అంటుకుంటున్నట్లు అయితే మరో టేబుల్ స్పూను మైదా వేసి కలపాలి. పిండి ముద్దను ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.ఇరవై నిమిషాల తరువాత పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసి పాన్‌కేక్‌లా వత్తుకోవాలి ∙బాణలిలో నూనె వేయాలి. బాగా కాగిన∙నూనెలో ఒక్కో పాన్‌కేక్‌ను వేసి మీడియం మంట మీద కాల్చాలి. క్రిస్పీగా బ్రౌన్ కలర్లోకి మారాక పాన్కేక్లను తీసేయాలి. పాన్కేక్పైన కొద్దిగా పుల్లటి పెరుగువేసి సర్వ్ చేసుకోవాలి. (చదవండి: దేవి నవరాత్రుల్లో వెరైటీగా దెహరోరి స్వీట్ ట్రై చేయండి!) -
ముంజులతో కేక్ చేసుకోండి ఇలా..
ముంజలు – రాగి పాన్ కేక్ కావలసినవి: ముంజి కాయలు – 2 (జాగ్రత్తగా ముంజలు తీసి.. తొక్క ఒలిచి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కలిపి.. జ్యూస్‌లా మిక్సీ పట్టుకోవాలి) రాగిపిండి – 2 కప్పులు మొక్కజొన్నపిండి – పావు కప్పు పంచదార పొడి – అరకప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) నూనె – సరిపడా తయారీ విధానం: ముందుగా బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, రాగి పిండి ఒకదాని తర్వాత ఒకటి పెద్ద బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా ముంజల జ్యూస్ వేస్తూ ఆ మిశ్రమాన్ని కాస్త పలుచగా కలుపుకోవాలి. అవసరమైతే మరిన్ని పాలు పోసుకోవచ్చు. అనంతరం ఐదారు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత పా¯Œ లో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. మందంగా పాన్ కేక్స్ వేసుకుని దోరగా ఇరువైపులా కాల్చుకోవాలి. వాటిపై నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని.. సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. (చదవండి: చేదు లేకుండా కాకరకాయ ఆమ్లెట్ తయారీ ఇలా..) -
Recipe: పన్నీర్ వెజిటబుల్ ఇడ్లీ, కోకోనట్ పాన్కేక్ తయారు చేసుకోండిలా!
హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ పన్నీర్ వెజిటబుల్ ఇడ్లీ, కోకోనట్ పాన్కేక్ ఇలా తయారు చేసుకోండి! పన్నీర్ వెజిటబుల్ ఇడ్లీ తయారీకి కావలసినవి: ►పన్నీర్ తురుము – అరకప్పు ►క్యారట్ తురుము – పావు కప్పు ►క్యాబేజీ తరుగు – పావు కప్పు ►సూజీ రవ్వ – అరకప్పు ►పెరుగు – కప్పు ►శనగపిండి – అరకప్పు ►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ►ఒక గిన్నెలో సూజీ రవ్వ, శనగపిండి, పెరుగువేసి కలపాలి. ►దీనిలో పావు కప్పు నీళ్లు కలిపి అరగంటపాటు నానబెట్టుకోవాలి. ►నానిన పిండిలో మిగతా పదార్థాలు, ఉప్పు వేసి చక్కగా కలపాలి. ►ఇడ్లీ పాత్రలో ఈ పిండిని వేసి ఆవిరి మీద పదిహేను నిమిషాలు ఉడికించి, కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేసుకోవాలి. కోకోనట్ పాన్కేక్ తయారీకి కావలసినవి: ►కొబ్బరి పాలు – ముప్పావు కప్పు ►పచ్చికొబ్బరి తురుము – అరకప్పు ►గుడ్లు – రెండు ►పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►బటర్ – రెండు టేబుల్ స్పూన్లు ►గోధుమ పిండి – కప్పు ►వంటసోడా – మూడు టీస్పూన్లు ►ఉప్పు – అరటీస్పూను ►నూనె – అరకప్పు ►మేపుల్ సిరప్ – పావు కప్పు. కోకోనట్ పాన్కేక్ తయారీ: ►గిన్నెలో కొబ్బరిపాలు, పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి పక్కనపెట్టుకోవాలి. ►మరో గిన్నెలో గుడ్లసొనను బీట్ చేయాలి. ►బటర్‌ను కరిగించి గుడ్ల సొనలో వేసి మరోసారి బీట్ చేయాలి. ►ఇప్పుడు కొబ్బరిపాల మిశ్రమంలో గుడ్లసొన, బటర్ మిశ్రమాన్ని వేసి చక్కగా కలపాలి. ►మరో గిన్నెలో గోధుమపిండి, వంటసోడా, ఉప్పు వేసి కలపాలి. ►ఈ మిశ్రమాన్ని కూడా కొబ్బరిపాల మిశ్రమంలో వేసి కలపాలి. ►స్టవ్ మీద పాన్‌పెట్టి టేబుల్ స్పూను నూనెవేసి పాన్ మొత్తం రాయాలి. ►నూనె వేడెక్కిన తరువాత పావుకప్పు మిశ్రమం వేసి నీటిబుడగలు లేకుండా అట్టులా పోసుకోవాలి. ►సన్నని మంట మీద రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో వేసి మేపుల్ సిరప్ చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ తయారీ ఇలా! Oats Uthappam Recipe: ఓట్స్ ఊతప్పం తయారీ విధానం ఇలా! -
పార్లమెంటేరియన్ల చేతిలో పాన్‌కేకులు!
వేషధారణను బట్టి ఫైవ్‌స్టార్ హోటల్ షెఫ్లలా ఉన్నారు కానీ నిజానికి వీళ్లు బ్రిటన్ ఎంపీలు. మరి ఆ చేతుల్లో పాన్లు, ఎగురుతున్న కేక్‌లు ఏమిటంటే... ఇదంతా ఒక చారిటీ ప్రోగ్రామ్. చేతిలో పాన్‌తో ఒక రొట్టెను గాల్లో ఎగరేస్తూ తిరిగి పట్టుకొంటూ పరిగెత్తడానికి వీళ్లు ప్రాక్టీస్ అవుతున్నారు. ప్రతియేటా బ్రిటన్ ఎగువసభ, దిగువసభకు చెందిన పార్లమెంటేరియన్లు ఒక టీమ్‌గా, పొలిటికల్ జర్నలిస్టులంతా మరో టీమ్‌గా ఈ రేస్‌లో పాల్గొంటారు. దీన్నే పాన్కేక్ రేస్ అని అంటారు. ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం జరిగింది. రాజకీయ ప్రముఖులు పాల్గొనే షో కాబట్టి దీనికి మంచి ఆదరణ కనిపించింది. విరాళాలూ బాగానే పోగయ్యాయి.