ముంజులతో కేక్‌ చేసుకోండి ఇలా.. | Make Ragi Pan Cake With Munju Recipe | Sakshi
Sakshi News home page

ముంజులతో కేక్‌ చేసుకోండి ఇలా..

Published Sun, Jun 25 2023 11:17 AM | Last Updated on Fri, Jul 14 2023 4:12 PM

Make Ragi Pan Cake With Munju Recipe - Sakshi

ముంజలు – రాగి పాన్‌ కేక్‌ కావలసినవి:
ముంజి కాయలు – 2 (జాగ్రత్తగా ముంజలు తీసి.. తొక్క ఒలిచి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కలిపి.. జ్యూస్‌లా మిక్సీ పట్టుకోవాలి)
రాగిపిండి – 2 కప్పులు
మొక్కజొన్నపిండి – పావు కప్పు
పంచదార పొడి – అరకప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు)
నూనె – సరిపడా

తయారీ విధానం: ముందుగా బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, రాగి పిండి ఒకదాని తర్వాత ఒకటి పెద్ద బౌల్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా ముంజల జ్యూస్‌ వేస్తూ ఆ మిశ్రమాన్ని కాస్త పలుచగా కలుపుకోవాలి. అవసరమైతే మరిన్ని పాలు పోసుకోవచ్చు. అనంతరం ఐదారు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత పా¯Œ లో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. మందంగా పాన్‌ కేక్స్‌ వేసుకుని దోరగా ఇరువైపులా కాల్చుకోవాలి. వాటిపై నచ్చినవిధంగా గార్నిష్‌ చేసుకుని.. సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

(చదవండి: చేదు లేకుండా కాకరకాయ ఆమ్లెట్‌ తయారీ ఇలా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement