recipient
-
రుమాలీ రోటీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
రుమాలీ రోటీ ఎంత ఫేమస్ అనేది తెలిసిందే. ప్రస్తుతం మెనూలో నుంచి కనుమరుగవ్వుతోంది. ఒకప్పుడు పెళ్లిళ్లలోనూ, ఫంక్షన్లోనూ తప్పనిసరిగా ఉండే ఈ రుమాలీ రోటీ ఎందువల్ల మన నుంచి దూరంగా వెళ్తుంది, అలాగే జనాదరణ కూడా ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. అస్సలు ఈ రుమాలీ రోటీ ఎలా భారతీయ ఆహార సంస్కృతిలోకి వచ్చింది. దాని కథా కమామీషు గురించి సవివరంగా చూద్దాం.!మొఘలుల కారణంగా మన దేశంలోకి ఈ వంటకం వచ్చింది. డిల్లీలో బాగా చేసే వంటకం క్రమంగా భారత్‌లోని అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాప్తి చెందింది. అలాగే ప్రజలు కూడా ఎంతో ఇష్టంగా తినేవారు. దీంతో భారతదేశమంతా ఈ రోటీల డాబాలు, రెస్టారెంట్లు వెలిశాయి. ఒకప్పుడూ ఈ రోటీలకు క్యూ కట్టిన జనం..ఇప్పుడు క్రమక్రమంగా ఆర్డర్ చేసేవాళ్ల సంఖ్య తగ్గుతుంది. దీన్ని ఆలు కుర్మా, మటన్ లేదా చికెన్ కుర్మాలతో ఇష్టంగా తినేవారు. ఒక్కొక్కరూ ఐదు లేదా పది లాగించే ఈ పలుచని రోటీలను ప్రజలు ఇష్టపడటం లేదు. అలాగే రెస్టారెంట్లలోని మెనూల్లో కూడా చోటు ఉండటం లేదు. ఎక్కడో గానీ లభ్యంకావడం లేదు. ఇలా ఎందుకంటే ఈ రుమాలి రోటీలను ఎక్కువగా మెత్తటి మైదాపిండితో తయారు చేస్తారు. ప్రస్తుతం ఆరోగ్య స్ప్రుహ ఎక్కవ అవ్వడంతో జనాలు వాటి జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా మైదాతో చేసిన పదార్థాల జోలికిపోకపోవడంతో దీన్ని తినే వాళ్ల సంఖ్య తగ్గింది. మరో కారణం ఏంంటే..దీని తయారీ కారణంగా కనుమరుగవ్వుతుంది. తలకిందులుగా ఉండే ఒక కుండపై దీన్ని కాలుస్తారు. అలాగే దీని తయారీకి చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే పలుచగా ఈ రోటీలను చేయాలి. అందుకు మంచి నైపుణ్యం ఉన్న చెఫ్‌లు కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ల దగ్గర అంత నైపుణ్యం కొరవడం కూడా ఈ రోటీలు అదృశ్యం కావడానికి ఒక కారణమని చెబుతున్నారు కొందరు. ఒక్కప్పుడు హైదరాబాద్‌లో రుమాలి రోటీలను కబాబ్, తడ్కా వంటి కర్రీల గ్రేవ్తో చక్కగా తినేవారు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో చికెన్ 65తో తినేవారు. ప్రస్తుతం వీటి బదులు నాన్లు, తాండూర్-కాల్చిన రొట్టెలు, కుల్చాలు, ఖమీరీ రోటీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రాను రాను తరువాత తరాలకు అస్సలు ఈ వంటకం గురించి తెలియకపోవచ్చు కూడా. If you're going to eat a Rumali Roti then eat this one, or don't eat at all. Incredible skill and what a roll this roti will make pic.twitter.com/qVqIovJbLR— Rocky Singh 🇮🇳 (@RockyEatsX) March 31, 2017 (చదవండి: ఈ డివైజ్‌తో అందమైన ముఖాకృతి సొంతం..!) -
ముంజులతో కేక్ చేసుకోండి ఇలా..
ముంజలు – రాగి పాన్ కేక్ కావలసినవి: ముంజి కాయలు – 2 (జాగ్రత్తగా ముంజలు తీసి.. తొక్క ఒలిచి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కలిపి.. జ్యూస్‌లా మిక్సీ పట్టుకోవాలి) రాగిపిండి – 2 కప్పులు మొక్కజొన్నపిండి – పావు కప్పు పంచదార పొడి – అరకప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) నూనె – సరిపడా తయారీ విధానం: ముందుగా బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, రాగి పిండి ఒకదాని తర్వాత ఒకటి పెద్ద బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా ముంజల జ్యూస్ వేస్తూ ఆ మిశ్రమాన్ని కాస్త పలుచగా కలుపుకోవాలి. అవసరమైతే మరిన్ని పాలు పోసుకోవచ్చు. అనంతరం ఐదారు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత పా¯Œ లో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. మందంగా పాన్ కేక్స్ వేసుకుని దోరగా ఇరువైపులా కాల్చుకోవాలి. వాటిపై నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని.. సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. (చదవండి: చేదు లేకుండా కాకరకాయ ఆమ్లెట్ తయారీ ఇలా..) -
వాట్సాప్‌లో కొత్త ఫీచర్..! వాటిని ‘ఒక్కసారి’ మాత్రమే..!
వాట్సాప్ తన యూజర్లకోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ తన యూజర్ల కోసం ‘వ్యూ వన్స్’ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్ పంపిన ఫోటో, వీడియో, మెసేజ్‌లను రెసిపెంట్(గ్రహీత) యూజర్ చూడటానికి నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా వాట్సాప్‌లో యూజర్ వీడియోను, ఫోటోలను పంపితే రెసిపెంట్ యూజర్ వాటిని చూడగల్గుతాడు. కాగా వీడియోలు, ఫోటోస్ ఒక్కసారి రెసిపెంట్ యూజర్ డౌన్లోడ్ చేశాక ఎల్లప్పుడు మొబైల్లోనే స్టోర్ అవుతాయి. రెసిపెంట్ తిరిగి యూజర్ పంపిన సమాచారాన్ని చూసుకోగలడు. ప్రస్తుతం వాట్సాప్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో రెసిపెంట్ కేవలం ఒక్కసారి మాత్రమే మేసెజ్‌లను చూడగలడు. ప్రస్తుతం ఈ ఫీచర్ అప్డేట్డ్ వాట్సాప్ యాప్ కల్గి ఉన్న ఐఫోన్ యూజర్లకు మంగళవారం రోజున భారత్‌లో లాంచ్ చేసింది. ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన కొద్దిసేపటికే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ ఫర్ ఐఫోన్ యాప్ 2.21.150 వెర్షన్లో అందుబాటులో ఉండనుంది. వ్యూ వన్స్ ఫీచర్లో భాగంగా వాట్సాప్ యాప్‌లో ఫోటో లేదా వీడియోను సెండ్ చేసేటప్పుడు యాడ్ క్యాప్షన్ బార్ పక్కన కొత్తగా '1' చిహ్నాంపై ట్యాప్ చేయాలి. దీంతో రెసిపెంట్ మీరు పంపిన ఫోటోను, లేదా వీడియోను ఒక్కసారి మాత్రమే చూడగలడు. రెసిపెంట్ మేసేజ్‌ను ఒపెన్ చేశాక ‘ఒపెన్డ్’ అనే సందేశం కన్పిస్తుంది. వ్యూ వన్స్ ఫీచర్‌తో మీడియా కంటెంట్‌ను రెసిపెంట్ (గ్రహీత) ఫోటోలు లేదా వీడియోలు మొబైల్ గ్యాలరీలో సేవ్ కావు. వ్యూ వన్స్ ఫీచర్‌తో సెండ్ చేసిన మేసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్ చేయలేరు. వ్యూ వన్స్ ఫీచర్‌ని ఉపయోగించి పంపిన ఫోటో లేదా వీడియో 14 రోజుల్లోపు తెరవకపోతే చాట్‌లో రెసిపెంట్‌కు కనిపించదు. అయితే రెసిపెంట్‌కు పంపిన ఫోటోను స్క్రీన్‌షాట్ తీస్తే మాత్రం యూజర్‌కు తెలియదు. రెసిపెంట్ స్క్రీన్ షాట్ తీస్తే యూజర్‌కు తెలిసే సదుపాయం కేవలం స్నాప్‌చాట్‌లో మాత్రమే కలదు. -
వాట్సాప్‌లో ఇకపై అలా కుదరదు..!
యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందించడంలో వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా వాట్సాప్ తన యూజర్లకు మరొ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ కొత్తగా ‘వ్యూ వన్స్’ అనే సరికొత్త మోడ్‌ను యూజర్లకు అందించనుంది. సాధారణంగా వాట్సాప్‌లో యూజర్ వీడియోను, ఫోటోలను పంపితే రెసిపెంట్ (గ్రహీత) యూజర్ వాటిని చూడగల్గుతాడు. కాగా వీడియోలు, ఫోటోస్ ఒక్కసారి రెసిపెంట్ యూజర్ డౌన్లోడ్ చేశాక ఎల్లప్పుడు మొబైల్లోనే స్టోర్ అవుతాయి. రెసిపెంట్ తిరిగి యూజర్ పంపిన సమాచారాన్ని చూసుకోగలడు. ప్రస్తుతం వాట్సాప్ తెచ్చిన ‘వ్యూ వన్స్’ మోడ్‌తో మెసేజ్ పంపితే ఇకపై అలా జరగదు. వాట్సాప్ తెచ్చిన ‘వ్యూ వన్స్’ మోడ్‌తో.. ఒకసారి పంపిన వీడియో, ఫోటో, మెసేజ్‌లను రెసిపెంట్ యూజర్ కేవలం ఒక్కసారి మాత్రమే చూడటానికి వీలు పడుతుంది. తరువాత ఆ మెసేజ్‌లను రెసిపెంట్ చూడటానికి వీలుండదు. దీంతో యూజర్ పంపిన ఫోటో, వీడియో, మెసేజ్‌లను రెసిపెంట్ యూజర్ చూడటానికి నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. WABetaInfo నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ 2.21.14.3 వెర్షన్లో ఈ సదుపాయాన్ని చూడవచ్చును. భవిష్యత్తులో ఐవోస్ యూజర్ల కోసం కూడా అందుబాటులో ఉండనుంది. ఒక వేళ రెసిపెంట్ యూజర్ స్రీన్ షాట్ చేస్తే ఫలనా సమాచారాన్ని సేవ్ చేసుకోగలడు. రెసిపెంట్ యూజర్ స్రీన్ షాట్ తీసుకుంటే యూజర్‌కు తెలిపే ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ యాప్‌లో అందుబాటులో లేదు. ఇది కేవలం స్నాప్ చాట్ యాప్‌లోనే కలదు. చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ కొత్త ఫీచర్ ఏదో బాగుందే..! -
రుణాలకు ఆక్సీలోన్స్
• రుణదాత, గ్రహీత ఇద్దరినీ కలిపే వేదిక • ఆక్సీలోన్‌స ఫౌండర్, సీఈఓ రాధాకృష్ణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు రుణాల కోసం బ్యాంకులకో, ఆర్థిక సంస్థలకో, లేక వడ్డీ వ్యాపారుల వద్దకో పరుగెత్తాం. కానీ, ఇప్పుడా అవసరం లేదంటోంది ఆక్సీలోన్‌స. రుణదాతలు, గ్రహీతలు ఇద్దరినీ కలపడమే మా పనంటోంది కూడా. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఆక్సీలోన్‌స స్టార్టప్ సేవలు, విశేషాల గురించి సంస్థ ఫౌండర్, సీఈఓ రాధాకృష్ణ తాటవర్తి మాటల్లోనే.. ⇔ సాంకేతికత, విద్యా, వ్యాపార రుణాలు మాత్రమే కాకుండా గర్భవతి రుణాలు, గోల్ఫ్ మెంబర్షిప్ రుణాలు, ఇస్లామిక్ రుణాల వంటివి కూడా ఇప్పించడం మా ప్రత్యేకత. ప్రస్తుతం 20 రకాల రుణాలను ఇప్పిస్తున్నాం. గోల్ఫ్ కోర్ట్లతో, విద్యా సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నాం. ⇔ మొత్తం రుణ మంజూరులో గ్రహీత నుంచి 1.5 శాతం, దాత నుంచి 2.5 శాతం కమీషన్ రూపంలో తీసుకుంటాం. ప్రస్తుతం మన దేశంతో పాటు దుబాయ్, కతర్ వంటి జీసీసీ దేశాలు, యూకేల్లో సేవలందిస్తున్నాం. ⇔ సాంకేతికత అభివృద్ధి, ఉద్యోగుల నియామకం, ప్రచారం కోసం కోటి రూపాయలు ఖర్చరుుంది. వచ్చే నెలలో సీడ్ క్యాపిటల్ కింద రూ.3 కోట్ల ని దుల సమీకరణ చేయనున్నాం. వచ్చే ఏడాది ఆగ స్టు నాటికి రూ.20 మిలియన్ డాలర్ల వెంచర్ క్యాపటలిస్ట్ నిధులను కూడా పొందాలని లక్ష్యించాం.