WhatsApp Launches View Once Feature For Auto Deleting Photos And Videos - Sakshi
Sakshi News home page

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌..! వాటిని ‘ఒక్కసారి’ మాత్రమే..!

Published Wed, Aug 4 2021 6:37 PM | Last Updated on Thu, Aug 5 2021 9:41 AM

Whatsapp Launched View Once Feature - Sakshi

వాట్సాప్‌ తన యూజర్లకోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ తన యూజర్ల కోసం ‘వ్యూ వన్స్‌’ ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్‌ పంపిన ఫోటో,  వీడియో, మెసేజ్‌లను రెసిపెంట్‌(గ్రహీత) యూజర్‌ చూడటానికి నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా వాట్సాప్‌లో యూజర్‌ వీడియోను, ఫోటోలను పంపితే రెసిపెంట్‌ యూజర్‌ వాటిని చూడగల్గుతాడు. కాగా వీడియోలు, ఫోటోస్‌ ఒక్కసారి రెసిపెంట్‌ యూజర్‌ డౌన్‌లోడ్‌ చేశాక ఎల్లప్పుడు మొబైల్‌లోనే స్టోర్‌ అవుతాయి. రెసిపెంట్‌ తిరిగి యూజర్‌ పంపిన సమాచారాన్ని చూసుకోగలడు. ప్రస్తుతం వాట్సాప్‌ తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో రెసిపెంట్‌ కేవలం ఒక్కసారి మాత్రమే మేసెజ్‌లను చూడగలడు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ అప్‌డేట్‌డ్‌ వాట్సాప్‌ యాప్‌ కల్గి ఉన్న ఐఫోన్‌ యూజర్లకు మంగళవారం రోజున భారత్‌లో లాంచ్‌ చేసింది. ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన కొద్దిసేపటికే ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్‌ వాట్సాప్‌ ఫర్‌ ఐఫోన్‌ యాప్‌ 2.21.150 వెర్షన్‌లో అందుబాటులో ఉండనుంది.  


వ్యూ వన్స్‌ ఫీచర్‌లో భాగంగా వాట్సాప్‌ యాప్‌లో ఫోటో లేదా వీడియోను సెండ్‌ చేసేటప్పుడు యాడ్‌ క్యాప్షన్ బార్ పక్కన  కొత్తగా '1' చిహ్నాంపై ట్యాప్‌ చేయాలి. దీంతో రెసిపెంట్‌ మీరు పంపిన ఫోటోను, లేదా వీడియోను ఒక్కసారి మాత్రమే చూడగలడు. రెసిపెంట్‌ మేసేజ్‌ను ఒపెన్‌ చేశాక ‘ఒపెన్డ్‌’ అనే సందేశం కన్పిస్తుంది. వ్యూ వన్స్‌ ఫీచర్‌తో మీడియా కంటెంట్‌ను రెసిపెంట్‌ (గ్రహీత) ఫోటోలు లేదా వీడియోలు మొబైల్‌ గ్యాలరీలో సేవ్‌ కావు.

వ్యూ వన్స్‌ ఫీచర్‌తో సెండ్‌ చేసిన మేసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్‌ చేయలేరు. వ్యూ వన్స్‌  ఫీచర్‌ని ఉపయోగించి పంపిన ఫోటో లేదా వీడియో 14 రోజుల్లోపు తెరవకపోతే చాట్‌లో రెసిపెంట్‌కు కనిపించదు. అయితే రెసిపెంట్‌కు పంపిన ఫోటోను స్క్రీన్‌షాట్‌ తీస్తే మాత్రం యూజర్‌కు తెలియదు. రెసిపెంట్‌ స్క్రీన్‌ షాట్‌ తీస్తే యూజర్‌కు తెలిసే సదుపాయం కేవలం స్నాప్‌చాట్‌లో మాత్రమే కలదు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement