
యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందించడంలో వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా వాట్సాప్ తన యూజర్లకు మరొ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ కొత్తగా ‘వ్యూ వన్స్’ అనే సరికొత్త మోడ్‌ను యూజర్లకు అందించనుంది. సాధారణంగా వాట్సాప్‌లో యూజర్ వీడియోను, ఫోటోలను పంపితే రెసిపెంట్ (గ్రహీత) యూజర్ వాటిని చూడగల్గుతాడు. కాగా వీడియోలు, ఫోటోస్ ఒక్కసారి రెసిపెంట్ యూజర్ డౌన్‌లోడ్ చేశాక ఎల్లప్పుడు మొబైల్‌లోనే స్టోర్ అవుతాయి. రెసిపెంట్ తిరిగి యూజర్ పంపిన సమాచారాన్ని చూసుకోగలడు.
ప్రస్తుతం వాట్సాప్ తెచ్చిన ‘వ్యూ వన్స్’ మోడ్‌తో మెసేజ్ పంపితే ఇకపై అలా జరగదు. వాట్సాప్ తెచ్చిన ‘వ్యూ వన్స్’ మోడ్‌తో.. ఒకసారి పంపిన వీడియో, ఫోటో, మెసేజ్‌లను రెసిపెంట్ యూజర్ కేవలం ఒక్కసారి మాత్రమే చూడటానికి వీలు పడుతుంది. తరువాత ఆ మెసేజ్‌లను రెసిపెంట్ చూడటానికి వీలుండదు. దీంతో యూజర్ పంపిన ఫోటో, వీడియో, మెసేజ్‌లను రెసిపెంట్ యూజర్ చూడటానికి నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. WABetaInfo నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ 2.21.14.3 వెర్షన్‌లో ఈ సదుపాయాన్ని చూడవచ్చును. భవిష్యత్తులో ఐవోస్ యూజర్ల కోసం కూడా అందుబాటులో ఉండనుంది.
ఒక వేళ రెసిపెంట్ యూజర్ స్రీన్ షాట్ చేస్తే ఫలనా సమాచారాన్ని సేవ్ చేసుకోగలడు. రెసిపెంట్ యూజర్ స్రీన్ షాట్ తీసుకుంటే యూజర్‌కు తెలిపే ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ యాప్‌లో అందుబాటులో లేదు. ఇది కేవలం స్నాప్ చాట్ యాప్‌లోనే కలదు.