
రుమాలీ రోటీ ఎంత ఫేమస్ అనేది తెలిసిందే. ప్రస్తుతం మెనూలో నుంచి కనుమరుగవ్వుతోంది. ఒకప్పుడు పెళ్లిళ్లలోనూ, ఫంక్షన్‌లోనూ తప్పనిసరిగా ఉండే ఈ రుమాలీ రోటీ ఎందువల్ల మన నుంచి దూరంగా వెళ్తుంది, అలాగే జనాదరణ కూడా ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. అస్సలు ఈ రుమాలీ రోటీ ఎలా భారతీయ ఆహార సంస్కృతిలోకి వచ్చింది. దాని కథా కమామీషు గురించి సవివరంగా చూద్దాం.!
మొఘలుల కారణంగా మన దేశంలోకి ఈ వంటకం వచ్చింది. డిల్లీలో బాగా చేసే వంటకం క్రమంగా భారత్‌లోని అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాప్తి చెందింది. అలాగే ప్రజలు కూడా ఎంతో ఇష్టంగా తినేవారు. దీంతో భారతదేశమంతా ఈ రోటీల డాబాలు, రెస్టారెంట్లు వెలిశాయి. ఒకప్పుడూ ఈ రోటీలకు క్యూ కట్టిన జనం..ఇప్పుడు క్రమక్రమంగా ఆర్డర్ చేసేవాళ్ల సంఖ్య తగ్గుతుంది.
దీన్ని ఆలు కుర్మా, మటన్ లేదా చికెన్ కుర్మాలతో ఇష్టంగా తినేవారు. ఒక్కొక్కరూ ఐదు లేదా పది లాగించే ఈ పలుచని రోటీలను ప్రజలు ఇష్టపడటం లేదు. అలాగే రెస్టారెంట్‌లలోని మెనూల్లో కూడా చోటు ఉండటం లేదు. ఎక్కడో గానీ లభ్యంకావడం లేదు.
ఇలా ఎందుకంటే ఈ రుమాలి రోటీలను ఎక్కువగా మెత్తటి మైదాపిండితో తయారు చేస్తారు. ప్రస్తుతం ఆరోగ్య స్ప్రుహ ఎక్కవ అవ్వడంతో జనాలు వాటి జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా మైదాతో చేసిన పదార్థాల జోలికిపోకపోవడంతో దీన్ని తినే వాళ్ల సంఖ్య తగ్గింది.
మరో కారణం ఏంంటే..దీని తయారీ కారణంగా కనుమరుగవ్వుతుంది. తలకిందులుగా ఉండే ఒక కుండపై దీన్ని కాలుస్తారు. అలాగే దీని తయారీకి చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే పలుచగా ఈ రోటీలను చేయాలి. అందుకు మంచి నైపుణ్యం ఉన్న చెఫ్‌లు కూడా కావాల్సి ఉంటుంది.
ఇప్పుడున్న వాళ్ల దగ్గర అంత నైపుణ్యం కొరవడం కూడా ఈ రోటీలు అదృశ్యం కావడానికి ఒక కారణమని చెబుతున్నారు కొందరు. ఒక్కప్పుడు హైదరాబాద్‌లో రుమాలి రోటీలను కబాబ్, తడ్కా వంటి కర్రీల గ్రేవ్‌తో చక్కగా తినేవారు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో చికెన్ 65తో తినేవారు. ప్రస్తుతం వీటి బదులు నాన్‌లు, తాండూర్-కాల్చిన రొట్టెలు, కుల్చాలు, ఖమీరీ రోటీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రాను రాను తరువాత తరాలకు అస్సలు ఈ వంటకం గురించి తెలియకపోవచ్చు కూడా.
If you're going to eat a Rumali Roti then eat this one, or don't eat at all. Incredible skill and what a roll this roti will make pic.twitter.com/qVqIovJbLR
— Rocky Singh 🇮🇳 (@RockyEatsX) March 31, 2017
(చదవండి: ఈ డివైజ్‌తో అందమైన ముఖాకృతి సొంతం..!)