Mughals
-
రుమాలీ రోటీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
రుమాలీ రోటీ ఎంత ఫేమస్ అనేది తెలిసిందే. ప్రస్తుతం మెనూలో నుంచి కనుమరుగవ్వుతోంది. ఒకప్పుడు పెళ్లిళ్లలోనూ, ఫంక్షన్లోనూ తప్పనిసరిగా ఉండే ఈ రుమాలీ రోటీ ఎందువల్ల మన నుంచి దూరంగా వెళ్తుంది, అలాగే జనాదరణ కూడా ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. అస్సలు ఈ రుమాలీ రోటీ ఎలా భారతీయ ఆహార సంస్కృతిలోకి వచ్చింది. దాని కథా కమామీషు గురించి సవివరంగా చూద్దాం.!మొఘలుల కారణంగా మన దేశంలోకి ఈ వంటకం వచ్చింది. డిల్లీలో బాగా చేసే వంటకం క్రమంగా భారత్‌లోని అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాప్తి చెందింది. అలాగే ప్రజలు కూడా ఎంతో ఇష్టంగా తినేవారు. దీంతో భారతదేశమంతా ఈ రోటీల డాబాలు, రెస్టారెంట్లు వెలిశాయి. ఒకప్పుడూ ఈ రోటీలకు క్యూ కట్టిన జనం..ఇప్పుడు క్రమక్రమంగా ఆర్డర్ చేసేవాళ్ల సంఖ్య తగ్గుతుంది. దీన్ని ఆలు కుర్మా, మటన్ లేదా చికెన్ కుర్మాలతో ఇష్టంగా తినేవారు. ఒక్కొక్కరూ ఐదు లేదా పది లాగించే ఈ పలుచని రోటీలను ప్రజలు ఇష్టపడటం లేదు. అలాగే రెస్టారెంట్లలోని మెనూల్లో కూడా చోటు ఉండటం లేదు. ఎక్కడో గానీ లభ్యంకావడం లేదు. ఇలా ఎందుకంటే ఈ రుమాలి రోటీలను ఎక్కువగా మెత్తటి మైదాపిండితో తయారు చేస్తారు. ప్రస్తుతం ఆరోగ్య స్ప్రుహ ఎక్కవ అవ్వడంతో జనాలు వాటి జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా మైదాతో చేసిన పదార్థాల జోలికిపోకపోవడంతో దీన్ని తినే వాళ్ల సంఖ్య తగ్గింది. మరో కారణం ఏంంటే..దీని తయారీ కారణంగా కనుమరుగవ్వుతుంది. తలకిందులుగా ఉండే ఒక కుండపై దీన్ని కాలుస్తారు. అలాగే దీని తయారీకి చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే పలుచగా ఈ రోటీలను చేయాలి. అందుకు మంచి నైపుణ్యం ఉన్న చెఫ్‌లు కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ల దగ్గర అంత నైపుణ్యం కొరవడం కూడా ఈ రోటీలు అదృశ్యం కావడానికి ఒక కారణమని చెబుతున్నారు కొందరు. ఒక్కప్పుడు హైదరాబాద్‌లో రుమాలి రోటీలను కబాబ్, తడ్కా వంటి కర్రీల గ్రేవ్తో చక్కగా తినేవారు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో చికెన్ 65తో తినేవారు. ప్రస్తుతం వీటి బదులు నాన్లు, తాండూర్-కాల్చిన రొట్టెలు, కుల్చాలు, ఖమీరీ రోటీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రాను రాను తరువాత తరాలకు అస్సలు ఈ వంటకం గురించి తెలియకపోవచ్చు కూడా. If you're going to eat a Rumali Roti then eat this one, or don't eat at all. Incredible skill and what a roll this roti will make pic.twitter.com/qVqIovJbLR— Rocky Singh 🇮🇳 (@RockyEatsX) March 31, 2017 (చదవండి: ఈ డివైజ్‌తో అందమైన ముఖాకృతి సొంతం..!) -
ఓ ఆదివాసి వీరనారి పోరాటం!
మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి వీరమరణం పొందిన ఆదివాసీ వీరనారి రాణి దుర్గావతి. మధ్యప్రదేశ్‌లోని గోండు తెగకు చెందిన బుందేల్ ఖండ్ సంస్థానాధీశుడు చందవేల్‌కు 1524 అక్టోబర్ 5న దుర్గావతి జన్మించింది. దుర్గావతి భర్త దళపత్ షా గోండు రాజ్యాన్ని పాలిస్తూ మరణించాడు. కుమారుడు వీరనారాయణ్ మైనర్ కావడంతో దుర్గావతి గోండ్వానా రాజ్య పాలన చేపట్టింది. రాణి దుర్గావతి పైనా, ఆమె పాలిస్తున్న గోండ్వానా రాజ్య సంపద పైనా మనసు పారేసుకున్న అక్బర్ సేనాని ఖ్వాజా అబ్దుల్ మజీద్ అసఫ్ ఖాన్... అక్బర్ అనుమతిని తీసుకొని గోండ్వానాపై దండెత్తాడు. సుశిక్షితులైన వేలాది మొఘల్ సైనికులు ఒకవైపు, అసంఘ టితమైన ఆదివాసీ సైన్యం ఒకవైపు యుద్ధ రంగంలో తలపడ్డారు. మొఘల్ సైన్యానికి ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆదివాసీ సైనికులకు సంప్రదాయ ఆయుధాలే దిక్కయ్యాయి. మొఘల్ సైన్యం రాకను తెలుసుకున్న దుర్గావతి రక్షణాత్మకంగా ఉంటుందని భావించి ‘నరాయ్’ అనే ప్రాంతానికి చేరుకొంది. ఇక్కడ ఒకపక్క పర్వత శ్రేణులు ఉండగా మరోపక్క గౌర్, నర్మద నదులు ఉన్నాయి. ఈ లోయలోకి ప్రవేశించిన మొఘల్ సైన్యంపై గెరిల్లా దాడులకు దిగింది దుర్గావతి. ఇరువైపులా సైనికులు మరణించారు. దుర్గావతి ఫౌజ్దార్ అర్జున్ దాస్ వీరమరణం పొందాడు. ఆమె గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తే సైనికాధికారులు రాత్రి గుడ్డి వెలుతురులో ప్రత్యక్ష యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు. మరుసటిరోజు ఉదయానికి పెద్ద తుపాకులను వాడమని మొఘల్ సైన్యాధికారి అసఫ్ ఖాన్ సైనికులను ఆదేశించాడు. రాణి ఏనుగునెక్కి మొఘల్ సైనికులపై విరుచుకుపడింది. యువరాజు వీర్ నారాయణ్ కూడా యుద్ధరంగంలోకి దూకి మొఘల్ సైనికులను మూడుసార్లు వైనక్కి తరిమాడు. కానీ అతడు తీవ్రంగా గాయపడడంతో సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోయాడు. రాణి దుర్గావతికి కూడా చెవి దగ్గర బాణం తగిలి గాయపడింది. ఆ తర్వాత ఒక బాణం ఆమె గొంతును చీల్చివేసింది. వెంటనే ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహ వచ్చిన తర్వాత ఆమె ఏనుగును తోలే మావటి యుద్ధ రంగం నుంచి సురక్షిత ప్రదేశానికి తప్పించుకు వెళదామని సలహా ఇచ్చాడు. ఆమెకు అపజయం ఖాయం అని అర్థమయ్యింది. శత్రువుకు భయపడి పారిపోవడం లేదా అతడికి చిక్కి మరణించడం అవమానకరం అని భావించి తన సురకత్తిని తీసుకుని పొడుచుకొని ప్రాణాలు వదిలింది రాణి. దీంతో ఒక మహోజ్వల ఆదివాసీ తార నేలకొరిగినట్లయ్యింది. – గుమ్మడి లక్ష్మీ నారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి (చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..) -
ఛత్రపతి శివాజీ ప్రారంభించారు.. మోదీ కొనసాగిస్తున్నారు: అమిత్ షా
పుణే: మొగలులు, ఇతర విదేశీ దురాక్రమణదారులు ధ్వంసం చేసిన ఆలయాలను ఛత్రపతి శివాజీ పునర్నిర్మించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్లాఘించారు. మరాఠా యోధుడు ప్రారంభించిన ఆ పనిని ప్రధాని మోదీ నేడు కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడేందుకే శివాజీ తన జీవితాన్ని పణంగా చెప్పారన్నారు. పుణేలోని నర్హే–అంబేగావ్‌లో శివాజీ జీవితగాథ ఆధారంగా ‘శివసృష్టి’ ఇతివృత్తంతో 21 ఏకరాల్లో ఏర్పాటవుతున్న పార్క్ మొదటి దశను అమిత్ షా ప్రారంభించారు. ‘శివాజీ అనంతరం ధ్వంసమైన ఆలయాల పనర్నిర్మాణాన్ని ప్రధాని కొనసాగిస్తున్నారు. పలు దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు’అన్నారు. శివాజీ ఆశీస్సులతో విల్లు, బాణం: షిండే ఛత్రపతి శివాజీ ఆశీస్సులతో తమకు శివసేన ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ లభించిందని కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. శివసృష్టి ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దుతామని షిండే చెప్పారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, అమిత్ షా తమ వెనక కొండంత అండగా నిలిచారని శనివారం ఆయన పేర్కొనడం తెలిసిందే. -
‘ఆ భూమి నాకు ఇవ్వండి.. బంగారు ఇటుక ఇస్తాను’
న్యూఢిల్లీ: మొఘల్ వంశానికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న ప్రిన్స్ హబీబుద్దీన్ తుసి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. రామ జన్మభూమికి నన్ను హక్కుదారుగా గుర్తించి.. ఆ భూమిని నాకు ఇవ్వండి. నేను అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తాను.. బంగారు ఇటుక ఇస్తానని ప్రకటించాడు. వివరాలు.. తుసి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చివరి మొఘల్ చక్రవర్తి బహుదూర్ షా జాఫర్ వారసుడిని. రామజన్మభూమిపై నాకే పూర్తిగా హక్కు ఉంది. మా వంశీకుడైన బాబర్ రామ మందిరాన్ని కూల్చి.. బాబ్రీ మసీదును నిర్మించాడు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారు ఎవరూ కూడా తామే ఆ భూమికి నిజమైన హక్కుదారులమని నిరూపించుకోలేకపోయారు’ అన్నాడు. ‘ఇప్పటికైనా సుప్రీం కోర్టు నన్ను నిజమైన హక్కుదారుగా గుర్తించి ఆ భూమిని నాకు అప్పగిస్తే మంచిది. ఆ భూమిని రామ మందిర నిర్మాణం కోసం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మందిర నిర్మాణం కోసం బంగారు ఇటుక ఇస్తాను’ అన్నారు. తుసి ఇప్పటికే మూడు సార్లు అయోధ్యను దర్శించి ప్రార్థనలు చేశారు. గతేడాది అయోధ్యను దర్శించినప్పుడు రామ మందిరాన్ని కూల్చినందుకు గాను హిందువులకు క్షమాపణలు కూడా చెప్పారు. -
అమెరికాలో వేలానికి షాజహాన్ కత్తి
న్యూఢిల్లీ: మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన వజ్రాలు పొదిగిన కత్తి, కపుర్తలా రాజు జగత్జిత్ సింగ్‌కు చెందిన ఖడ్గం సహా 400 పురాతన వస్తువులను జూన్ 19న వేలం వేయనున్నట్లు క్రీస్టీ సంస్థ తెలిపింది. సింహం తలలాంటి పిడితో వజ్రాలు పొదిగిన జగత్జిత్ సింగ్ ఖడ్గం ప్రారంభధర రూ.69 లక్షలుగా ఉంటుందని వెల్లడించింది. అలాగే మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన కత్తికి ఈ వేలంలో రూ.17.36 కోట్లు దక్కవచ్చని భావిస్తున్నారు. జైపూర్‌రాజు సవాయ్ మాన్సింగ్–2 భార్య రాణి గాయత్రీదేవికి చెందిన వజ్రాలు, ముత్యాలు పొదిగిన హారానికి రూ.10.42 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. పట్టాభిషేకం సందర్భంగా నిజాం రాజులు వాడిన వజ్రాలు, రత్నాలు, కెంపులు పొదిగిన ఖడ్గం 6.94 కోట్ల నుంచి రూ.10.42 కోట్ల వరకూ దక్కవచ్చని క్రీస్టీ సంస్థ పేర్కొంది. వీటితో పాటు టిప్పు సుల్తాన్ లాకెట్‌తో పాటు పలు ఆభరణాలు, వజ్రాలు, అలంకరణ వస్తువులను జూన్ 14–18 మధ్య న్యూయార్క్‌లో ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పింది. -
దావత్-ఏ-మొఘల్
మొఘలులు వచ్చారు. ఏలారు. మనలో కలిసిపోయారు. వాళ్ల ఏలుబడి అంతరించింది. రుచులు ఇంకా ఏలుతూనే ఉన్నాయి. దర్బార్లు బంద్ అయ్యాయి. దావత్‌లు నడుస్తూనే ఉన్నాయి. మీరూ.. ఓ దావత్ మీ ఇంట్లో చేస్కోండి. అంగూర్ కా షర్బత్ కావల్సినవి: నల్లద్రాక్ష - 2 కప్పులు పంచదార పొడి - 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి - టీ స్పూన్; నిమ్మరసం - 2 టీ స్పూన్లు అల్లం రసం - టీ స్పూన్ (తగినంత) పుదీనా తరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారీ: ద్రాక్ష పండ్లను శుభ్రపరిచి, మిక్సర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మూడున్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. దీంట్లో పంచదార, జీలకర్రపొడి, నిమ్మరసం, అల్లం రసం వేసి కలిపి ప్రిజ్‌లో ఉంచాలి. గ్లాసులో పోసి చల్లగా అందించాలి. నోట్: దాల్చిన చెక్క, జాజికాయ పొడులను కూడా కలుపుకోవచ్చు. కార్న్, పొటాటో కబాబ్ కావల్సినవి: స్వీట్ కార్న్ గింజలు (ఉడికించినవి)- కప్పుడు బంగాళదుంపలు (ఉడికించి, తరుమాలి) - కప్పుడు పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి) గరం మసాలా - పావు టీ స్పూన్ నిమ్మరసం - 2 టీ స్పూన్లు; బ్రెడ్ స్లైసులు - 2 ఉప్పు - రుచికి తగినంత; నూనె - 2 టీ స్పూన్లు తయారీ: ఒక గిన్నెలో కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. నాలుగు సమ భాగాలు చేసుకోవాలి. సన్నని ఇనుపచువ్వ తీసుకొని, కార్న్ ముద్దను దానికి బాగా అదమాలి. ప్రతి కబాబ్ మిశ్రమంపై కొద్దిగా నూనె వేయాలి. బొగ్గులను మండించి, దానిపైన ఈ కబాబ్స్‌ను అన్నివైపులా గోధుమరంగు వచ్చేవరకు కాల్చాలి. తీసి, ముక్కలుగా కట్ చేసి, ఏదైనా పచ్చడితో సర్వ్ చేయాలి. నోట్: మార్కెట్లో ఉడెన్ కబాబ్ స్టిక్స్ దొరుకుతున్నాయి. ఇనుప చువ్వలకు బదులుగా వాటిని ఉపయోగించవచ్చు. అవధి గోష్ కావల్సినవి: బోన్‌లెస్ మటన్ - అర కేజీ; జీలకర్ర - అర టేబుల్ స్పూన్ ఉల్లిపాయల తరుగు - కప్పుడు; గసగసాల పేస్ట్ - అర కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి - టేబుల్ స్పూన్ పసుపు - అర టీ స్పూన్; కారం - అర టీ స్పూన్; బిర్యానీ ఆకులు - 2 లవంగా - 8 ; ఆకుపచ్చ ఇలాచీలు - 8; దాల్చిన చెక్క - ముక్క జాజికాయ పొడి - పావు టీ స్పూన్; నూనె - 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు - రుచికి తగినంత తయారీ: కడాయిలో లవంగాలు, ఇలాచీలు, జాజికాయ పొడి, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి వేయించి, పొడి చేయాలి. గిన్నెలో నూనె వేసి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీంట్లో మటన్ ముక్కలు, చేసి పెట్టిన గరం మసాలా, పసుపు, కారం వేసి, కప్పు నీళ్లు ఉప్పు వేసి ఉడికించాలి. చిక్కదనం బట్టి మరికొన్ని నీళ్లు కూడా కలుపుకోవచ్చు. చివరగా గసగసాల పేస్ట్, కొబ్బరి పేస్ట్, ధనియాల పొడి వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. వేడి వేడిగా అన్నం లేదా రోటీలోకి వడ్డించాలి. షాహీ పనీర్ కావల్సినవి: పనీర్ - 200 గ్రా.లు; ఉల్లిపాయల తరుగు అర కప్పు, డ్రై ఫ్రూట్స్ అరకప్పు, నీళ్లు కప్పు ఇవన్నీ కలిపి మరిగించిన నీళ్లు - ఒకటిన్నర కప్పు; పెరుగు - అర కప్పు (మృదువుగా అయ్యేలా గరిటెతో గిలకొట్టాలి); అమూల్ క్రీమ్ లేదా పాల మీగడ - 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి - అర టీ స్పూన్; పసుపు - పావు టీ స్పూన్; గరం మసాలా - పావు టీ స్పూన్; ఇలాచీ పొడి - పావు టీ స్పూన్ కుంకుమపువ్వు రేకలు - 10 (చిదమాలి); ఎసెన్స్ - 2 చుక్కలు,ఉప్పు - రుచికి తగినంత గ్రేవీ కోసం.. ఉల్లిపాయ - 1 (తరగాలి); జీడిపప్పు పలుకులు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి); బాదాంపప్పులు (తరిగినవి) - టేబుల్ స్పూన్; బూడిదగుమ్మడి గింజలు - టేబుల్ స్పూన్ (నానబెట్టి పై తొక్క తీసేయాలి); వెల్లులి - 4 రెబ్బలు (తరగాలి) చిన్న అల్లం ముక్క - 1 (సన్నగా తరగాలి) తయారీ: ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదాంపప్పులు, గుమ్మడి గింజలు, అల్లం-వెల్లుల్లి, ఒకటిన్నర కప్పు నీళ్లు కలిపి 10 నిమిషాలు మరిగించాలి. నీళ్లు వడకట్టి, పై పదార్థాలను పేస్ట్ చేయాలి.కడాయిలో టీ స్పూన్ నూనె వేసి గరం మసాలా దినుసులన్నీ వేయించి, పొడి చేసి పక్కనుంచాలి.అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ- గ్రేవీ కోసం ఇచ్చిన పదార్థాల పేస్ట్, గరమ్ మసాలా వేసి వేయించాలి.మిగిలిన వడకట్టు నీళ్లు, పెరుగు, మీగడ, ఉప్పు, పంచదార కలిపి, దీనిని కూడా పై మిశ్రమంలో కలిపి 10 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ఇలాచీ పొడి, కుంకుమపువ్వు రేకలు వేసి, కలిపిన తర్వాత పనీర్ ముక్కలు వేసి 2 నిమిషాలు ఉడికించాలి. ఎసెన్స్ వేసి కలిపి, చివరగా కొత్తిమీర చల్లి దించాలి. ఈ కూర జీరా రైస్ లేదా రోటీస్, పుల్కాలకు చాలా బాగుంటుంది. ముర్గ్ బిర్యానీ కావల్సినవి: బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు చికెన్ - 200 గ్రా.లు దాల్చిన చెక్క - చిన్న ముక్క; బిర్యానీ ఆకు - 1 సాజీరా - టీ స్పూన్; లవంగాలు - 4 ఇలాచీలు - 3; నీళ్లు - 5 కప్పులు ఉప్పు - రుచికి తగినంత వైట్ పేస్ట్ మిశ్రమానికి: బాదాం పప్పులు - 10 (నీళ్లలో గంటసేపు నానబెట్టాలి) బూడిద గుమ్మడి గింజలు - టేబుల్ స్పూన్ పచ్చికొబ్బరి తురుము - టేబుల్ స్పూన్ నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు తయారీ: చికెన్‌ను శుభ్రపరచి పక్కన ఉంచాలి. బాస్మతీ బియ్యం కడిగి, అరగంట నాననివ్వాలి. తొక్కతీసిన బాదాం పప్పులు, బూడిదగుమ్మడి గింజలు, కొబ్బరి తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి మెత్తగా రుబ్బాలి. ఉల్లిపాయను స్లైసులుగా కోసి పక్కనుంచాలి. గిన్నెలో నీళ్లు పోసి మరుగుతుండగా అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీలు, సాజీర వేయాలి. నీళ్లు బాగా మరుగుతుండగా అందులో ఉప్పు వేయాలి. పూర్తిగా వడకట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. అన్నం (75 శాతం మాత్రమే ఉడకాలి) పూర్తిగా ఉడకకముందు దించి, జల్లిలో పోసి, వడకట్టాలి విడిగా మరొక కడాయిలో నూనె వేసి, అందులో బాదాం పప్పులు, కిస్మిస్, జీడిపప్పు, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. సాజీర, సగం బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీంట్లో చికెన్ వేసి ఉడికించాలి. వైట్ పేస్ట్ మిశ్రమం, తగినంత ఉప్పు కలిపి మరో రెండు నిమిషాలుంచి దించాలి. విడిగా చిన్న గిన్నెలో మూడు స్పూన్ల పాలలో 7-8 కుంకుమ పువ్వు రేకలు వేసి కలపాలి.మరొక గిన్నె తీసుకొని అడుగున టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె రాసి, ఒక పొర చికెన్ ముక్కల మిశ్రమం, ఒక పొర ఉడికిన బాస్మతి బియ్యం, ఆ పైన చికెన్ మిశ్రమం .. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ పూర్తి అయ్యాక పైన కుంకుమపువ్వు మిశ్రమం, జీడిపప్పులు, కిస్మిస్, పుదీనా చల్లి, మూతపెట్టి, సన్నని మంట మీద ఉడకనివ్వాలి. మాడకుండా చూసుకొని, దించాలి. నోట్ 1: అవెన్ ఉన్నవారు బిర్యానీ గిన్నె మీద అల్యూమీనియమ్ ఫాయిల్‌తో కవర్ చేసి, 200 డిగ్రీల సెల్సియస్‌లో 20 నిమిషాలు ఉడికించాలి. నోట్ 2: బిర్యానీకి కాంబినేషన్‌గా 2 కప్పుల పెరుగు, కూరగాయలు-పచ్చిమిర్చి తరుగు, ఉప్పు కలిపి చేసిన రైతాను వాడుకోవచ్చు. ముర్గ్ బిర్యానీ బాదామి కెవ్రా సేవియాన్ కావల్సినవి: బాదాంపప్పుల పేస్ట్ - 4 టేబుల్‌స్పూన్లు బాదాంపప్పు (సన్నగా తరిగినవి) - పావు కప్పు ఎసెన్స్ - 4-5 చుక్కలు; నెయ్యి - టీ స్పూన్ సేమియా - అర కప్పు; వెన్నతీయని పాలు - 5 కప్పులు పంచదార - 5 టేబుల్ స్పూన్లు తయారీ: గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో సేమియా వేసి 2-3 నిమిషాలు వేయించాలి. పాలను విడిగా 15 నిమిషాలు మరిగించి, అందులో బాదాం పేస్ట్ వేసి మరో 2-3 నిమిషాలు ఉంచాలి. దీంట్లో సేమియా వేసి, కలుపుతూ 4-5 నిమిషాలు ఉడికించాలి. పంచదార వేసి, కలిపి, కెవ్రా ఎసెన్స్, బాదాం పప్పు పలుకులు వేసి కలిపి సర్వ్ చేయాలి. నోట్: 15 బాదాం పప్పులను తీసుకొని వేడినీళ్లలో 20 నిమిషాలు నానబెట్టి, తర్వాత పొట్టు తీసి, పావు కప్పు నీళ్లు కలిపి మిక్సర్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో కలిపి ఉడికిస్తే సేవియా మరింత రుచిగా ఉంటుంది.