Rumali Roti
-
రుమాలీ రోటీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
రుమాలీ రోటీ ఎంత ఫేమస్ అనేది తెలిసిందే. ప్రస్తుతం మెనూలో నుంచి కనుమరుగవ్వుతోంది. ఒకప్పుడు పెళ్లిళ్లలోనూ, ఫంక్షన్లోనూ తప్పనిసరిగా ఉండే ఈ రుమాలీ రోటీ ఎందువల్ల మన నుంచి దూరంగా వెళ్తుంది, అలాగే జనాదరణ కూడా ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. అస్సలు ఈ రుమాలీ రోటీ ఎలా భారతీయ ఆహార సంస్కృతిలోకి వచ్చింది. దాని కథా కమామీషు గురించి సవివరంగా చూద్దాం.!మొఘలుల కారణంగా మన దేశంలోకి ఈ వంటకం వచ్చింది. డిల్లీలో బాగా చేసే వంటకం క్రమంగా భారత్‌లోని అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాప్తి చెందింది. అలాగే ప్రజలు కూడా ఎంతో ఇష్టంగా తినేవారు. దీంతో భారతదేశమంతా ఈ రోటీల డాబాలు, రెస్టారెంట్లు వెలిశాయి. ఒకప్పుడూ ఈ రోటీలకు క్యూ కట్టిన జనం..ఇప్పుడు క్రమక్రమంగా ఆర్డర్ చేసేవాళ్ల సంఖ్య తగ్గుతుంది. దీన్ని ఆలు కుర్మా, మటన్ లేదా చికెన్ కుర్మాలతో ఇష్టంగా తినేవారు. ఒక్కొక్కరూ ఐదు లేదా పది లాగించే ఈ పలుచని రోటీలను ప్రజలు ఇష్టపడటం లేదు. అలాగే రెస్టారెంట్లలోని మెనూల్లో కూడా చోటు ఉండటం లేదు. ఎక్కడో గానీ లభ్యంకావడం లేదు. ఇలా ఎందుకంటే ఈ రుమాలి రోటీలను ఎక్కువగా మెత్తటి మైదాపిండితో తయారు చేస్తారు. ప్రస్తుతం ఆరోగ్య స్ప్రుహ ఎక్కవ అవ్వడంతో జనాలు వాటి జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా మైదాతో చేసిన పదార్థాల జోలికిపోకపోవడంతో దీన్ని తినే వాళ్ల సంఖ్య తగ్గింది. మరో కారణం ఏంంటే..దీని తయారీ కారణంగా కనుమరుగవ్వుతుంది. తలకిందులుగా ఉండే ఒక కుండపై దీన్ని కాలుస్తారు. అలాగే దీని తయారీకి చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే పలుచగా ఈ రోటీలను చేయాలి. అందుకు మంచి నైపుణ్యం ఉన్న చెఫ్‌లు కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ల దగ్గర అంత నైపుణ్యం కొరవడం కూడా ఈ రోటీలు అదృశ్యం కావడానికి ఒక కారణమని చెబుతున్నారు కొందరు. ఒక్కప్పుడు హైదరాబాద్‌లో రుమాలి రోటీలను కబాబ్, తడ్కా వంటి కర్రీల గ్రేవ్తో చక్కగా తినేవారు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో చికెన్ 65తో తినేవారు. ప్రస్తుతం వీటి బదులు నాన్లు, తాండూర్-కాల్చిన రొట్టెలు, కుల్చాలు, ఖమీరీ రోటీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రాను రాను తరువాత తరాలకు అస్సలు ఈ వంటకం గురించి తెలియకపోవచ్చు కూడా. If you're going to eat a Rumali Roti then eat this one, or don't eat at all. Incredible skill and what a roll this roti will make pic.twitter.com/qVqIovJbLR— Rocky Singh 🇮🇳 (@RockyEatsX) March 31, 2017 (చదవండి: ఈ డివైజ్‌తో అందమైన ముఖాకృతి సొంతం..!) -
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
బ్రెడ్లలో వెరైటీ వెరైటీలను చూశాం. అలాగే వాటితో తయారు చేసే రకరకాల వంటకాలను కూడా చూశాం. కానీ బ్రెడ్‌ని ఏదో టిష్యూ పేపర్ అంతా లైట్‌వైట్‌గా పల్చగా ఉండే బ్రెడ్‌ని చూశారా. అసలు దీన్ని చూడగానే అలా ఎలా చేశారా అని ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దక్షిణ కొరియా ఈ టిష్యూ బ్రెడ్‌ని తయారు చేసి అమ్మేస్తుంది. ఇది భారత్‌లో ఉండే రుమాలీ రోటీ మాదిరిగా ఉంది. అక్కడ బేకరి వాళ్లు టిష్యు బ్రెడ్‌లా పలచటి పొరలాంటి స్లైస్‌లు మాదిరిగా వచ్చేందుకు ప్రత్యేకమైన పిండిని ఉపయోగిస్తుంది. కాల్చేటప్పుడు సాధారణ బ్రెడ్లానే ఉంటుంది. కానీ స్లైస్‌లు మాత్రం టిష్యూలు మాదిరిగా ఉంటాయి. చూసేందుకు చక్కని ఆకృతిలో ఉండి తియ్యటి రుచిని కలిగి ఉంటాయట. వెన్న రాస్తే వచ్చే పొరలమాదిరిగా అతి సున్నితంగా ఉన్నాయి ఆ బ్రెడ్ స్లైస్‌లు. అందువల్ల దీన్ని రుమాలీ రోటీతో పోల్చారు. ఎందుకంటే రుమాలీ పల్చటి పెద్ద రోటీలా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఈజీగా కరిపోయేలా ఉంటుంది. నిజానికి ఈ రుమాలీ రోటీ మొఘల్ యుగం నుంచి ప్రసిద్ధి చెందాయి. పాకిస్థాన్‌లో కూడా ఈ రోటీలు బాగా ఫేమస్. వీటిని వాళ్లు లాంబూ రోటీలు అని పిలుస్తారు. పంజాబీలో దీని అర్థం పొడవైనది అని. ఆ తర్వాత ఈ రుమాలీ రోటీల్లో రకరకాల స్పైసీ కర్రీని ఉంచి రోల్ చేసి తయారు చేసే వివిధ రెసీపీలు తయారు చేయడం మొదలు పెట్టారు. నిజానికి నాటి చెఫ్‌లు అదనప్పు నూనెను పీల్చుకునేందుకు ఈ రుమాలీ రోటీలు ఉపయోగించేవారట. ఇక నాటి రాజులు కూడా ఈ రోటీలను చేతి రుమాలు మాదిరిగా భోజనం తర్వాత చేతులను శుభ్రం చేయడానికి వినియోగించేవారట. ఆ తర్వాత క్రమేణ అదే తినేవంటకంగా రూపాంతరం చెందిందని పాకశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by 마이시즌|미식 공간 소개 (@my_season___) (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
రివర్సే.. సిటీ పవర్సు!
హైదరాబాదీలు చాలా పనులు రివర్సులో చేస్తారు. ఇంకెవరికీ సాధ్యం కాని విధంగా చేస్తారు. భలే వైవిధ్యంగా చేస్తారు. కానీ చాలా గొప్పగా చేస్తారు. సాధారణంగా మనం రోటీలు చేయాలనుకుంటే ఏం చేస్తాం. కలిపిన పిండిని రొట్టెల పీట మీద పెట్టి అప్పడాల కర్రతో చుట్టూ విస్తరిస్తూ పోయేలా రౌండ్‌గా చేస్తాం. కానీ హైదరాబాదీ రుమాలీ రోటీని విస్తరించడం ఎప్పుడైనా చూశారా? అలాగే నిలబడిపోయి మామూలు రోటీలు చేసేవాడి ఆ కళానైపుణ్యాన్ని అదేపనిగా చూడ బుద్ధేస్తుంది. కాస్తంత వెడల్పు చేసిన రోటీని మాటిమాటికీ గాలిలోకి చక్రంలా ఎగరేసి గిర్రున తిప్పుతూ అలా వెడల్పయ్యేలా చేస్తుంటాడు. పేరుకు రుమాలీ గానీ.. దాదాపు టవల్కూ, శాలువాకూ సెంటర్ సైజులో ఉండేలా విస్తరిస్తూ తిప్పి.. అంత పెద్ద రోటీని అప్పుడు పెనం మీద వేస్తాడు. మళ్లీ ఇక్కడ పెనం విషయంలోనూ రివర్సే. సాధారణంగా రోటీలు చేసే పెనం మధ్యలో కాస్త గుంటలా ఉండి, అంచులు ఉబ్బెత్తుగా ఉంటాయి. కానీ రుమాలీ రోటీని కాల్చే పెనం పూర్తిగా రివర్సు. మూకుడును బోర్లా తిరగేసి, దాని కింద మంట పెట్టి రుమాలీ రోటీని కాలుస్తారు. అలా కాల్చాక రుమాలీ అని పేరు పెట్టినందుకో ఏమోగానీ... రుమాల్లాగా మడతలు వేస్తారు. జేబులో మాత్రం పెట్టరు. చుట్టలుగా చుట్టి నోట్లోకి పెట్టి రుచిని ఆస్వాదిస్తారు. ఇలాంటి రివర్స్ కేసే మరోటి! సాధారణంగా రోటీని కాల్చాలంటే మనమంతా పెనాన్ని పొయ్యి మీద పెడతాం కదా! కానీ ఇక్కడా మరో తరహా రివర్సు కేసే! తందూరీ రోటీ అని పిలిచే ఈ రొట్టెను చేసే పాత్ర పొయ్యిలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. పైన ఉండే రంధ్రం ద్వారా రోటీని పాత్ర అంచుకు అతుక్కుపోయేలా చేసి, రోటీనీ కాల్చి ముల్లుకర్రలాంటి దానితో బయటకు తీస్తారు. ఈ తందూరీని మన హైదరాబాదీలంతా ఎంతో ఇష్టంతో తింటుంటారు. రివర్సులు బాగా ఇష్టం కాబట్టి వేరే నగరాల్లో ఉన్న మరో సౌకర్యాన్ని మనమూ పొందాలని ఓ ప్రాజెక్టు చేపట్టాం. సాధారణంగా ఇంటి ముందు కాళ్లు తుడుచుకోడానికి వేసే పట్టానైనా లేదా కాళ్లకు పెట్టుకునే పట్టా(గొలుసు)లైనా కిందే ఉంచుతాం. అంటే నేల మీదే ఉంచుతాం. కానీ మనకిష్టమైనదాన్ని నెత్తిన పెట్టుకునే స్కీము కింద ఈ పట్టాలను రివర్సులో గాల్లో పెట్టుకుంటున్నాం. అదే మెట్రో రైలు ‘పట్టా’లు! రోజూ తలెత్తి గాల్లోని ఆ పట్టాలను చూస్తున్నప్పుడల్లా... రుమాలీ, తందూరీ రోటీల రుచిని ఆస్వాదించినట్లే... ఆ మెట్రో రైడ్‌ను ఎప్పుడెప్పుడు ఆస్వాదిద్దామా అనే ఓ కుతూహలం. ఎప్పుడెప్పుడు నేలపై కాకుండా రివర్సులో టవర్సు మీద గాల్లో పోయే ఆ ట్రైన్లో ఎంత త్వరగా ఎక్కుదామా అనే ఆత్రుత. ఇది నా ఒక్కడిదే కాదు... రోజూ తలెత్తి గర్వంగా చూసుకునే మన నగర ‘పట్టా’దారులందరికీ ఇష్టమైన సమష్టి కోరిక!