రూపాయికే ఇడ్లీ | 80-year-old Granny sells Idly for Rs.1 in Tamil Nadu | Sakshi
Sakshi News home page

రూపాయికే ఇడ్లీ

Published Sat, Sep 7 2019 8:48 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

పండు ముదుసలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేస్తుంది. స్వచ్ఛంగా స్నానం చేసి, భగవంతుడిని మనసారా ప్రార్థించి, పొలానికి వెళ్లి, తాజా కూరగాయలు తీసుకొస్తుంది. చట్నీ తయారుచేయడం కోసం రోలు సిద్ధం చేసి, తాజా కొబ్బరి, ఉప్పు వేసి, రుచికరమైన పచ్చడి చేస్తుంది ఈ అవ్వ. సాంబారులోకి కావలసిన కూరలన్నీ స్వయంగా తరిగి, మట్టితో అలికి చేసిన కట్టెల పొయ్యి మీద ఒక గిన్నెలో వేసి ఉడికిస్తుంది. ముందురోజు రాత్రే ఇడ్లీ పిండి రుబ్బి సిద్ధం చేస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement