one rupee tiffin
-
కమలాతాళ్‌కు స్టాలిన్ అభినందనలు
సాక్షి, చెన్నై : వయసులోనే కాదు.. మానవతా ధోరణిలోనూ ఆమెది పెద్ద మనస్సు. లాక్‌డౌన్‌ను అడ్డం పెట్టుకుని కొందరు వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకునే ఈ రోజుల్లో ఎనిమిది పదులు దాటిన ఆ వృద్ధురాలు ప్రజల పట్ల తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. పలువురి ఆకలితీరుస్తున్నారు. కోయంబత్తూరు జిల్లా తొండాముత్తూరు యూనియన్ పరిధిలోని వడివేలాంపాళయంలో కమలాతాళ్ (85) అతిచిన్నదైన టిఫిన్ సెంటర్‌ను నడుపుతున్నారు. మూడు దశాబ్దాలుగా పొయ్యిలోనే వంటలు వండుతూ కేవలం రూపాయికే రుచికరమైన ఇడ్లీని అందిస్తున్నారు. వందలాది మందికి వృద్ధురాలు తయారు చేసే ఇడ్లీ అంటే ఎంతో మక్కువ. కరోనావైరస్ భీతి, లాక్డౌన్ అంక్షల రోజుల్లోనూ ఆమె టిఫిన్ సెంటర్‌ను నడుపుతున్నారు. ఇంతటి కష్టదినాల్లో సైతం విరామం లేకుండా టిఫిన్ సెంటర్ నడపడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ వీడియోకాల్ ద్వారా ఆమెతో మాట్లాడి అభినందనలు తెలిపారు. మీ సేవలు ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. (చదవండి : రూపాయికే ఇడ్లీ.. 2.50 పైసలు గారె) దీంతో గ్రామంలోని ఇతర డీఎంకే నేతలు నెలరోజులకు సరిపడా బియ్యం, పప్పుధాన్యాలు, కూరగాయలు వృద్ధురాలికి అందజేశారు. పొల్లాచ్చి పార్లమెంటు సభ్యుడు షణ్ముగానందం గ్రైండర్ కొనుగోలుకు రూ.10 వేలు ఆర్థికసాయం చేశారు. పొయ్యితోనే ఆమె టిఫిన్‌సెంటర్ నడుపుతున్న నేపథ్యంలో.. గ్యాస్ స్టౌ కనెక్షన్‌కు తొండాముత్తూరు యూనియన్ డీఎంకే కార్యదర్శి సేనాధిపతి ఆర్థిక సహాయం అందజేశారు. స్టాలిన్ సోమవారం రెండోసారి ఆ వృద్ధురాలితో వీడియో కాల్ ద్వారా సంభాషించి డీఎంకే నేతలు అందిస్తున్న సహాయంపై ప్రశ్నించారు. స్టాలిన్‌తో మాట్లాడటం తన జీవితంలో మరపురాని అనుభవమని ఆమె ఆనందాన్ని వెలిబుచ్చారు. (చదవండి : మానవత్వం చాటుకున్న బాలవ్వ..) ‘లాక్డౌన్ కారణంగా మినపప్పు ధర రూ.100 నుంచి రూ.150కి పెరిగిందని, చట్నీ తయారీకి అవసరమైన వేరుశనగపప్పు, మిరపకాయలు ధరలు సైతం కిలోపై రూ.50 వరకు పెరిగింది. అయినా రూపాయికే ఇడ్లీలు అమ్ముతు న్నా. లాక్డౌన్ సమయంలోనూ రోజుకు సుమారు 300 మంది ఇడ్లీలు కొనుక్కుని పోతున్నారు. లాక్డౌన్, వస్తువుల ధరలు పెరిగాయి కదాని ఇడ్లీలు చేయకుంటే నన్ను నమ్ముకుని వచ్చేవారంతా పాపం ఎక్కడికి పోతారు’ అని ఆమె చెప్పిన మాటలు అధికధరలతో దోచుకునేవారికి చెంపపెట్టు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఇప్పుడు కూడా రూపాయికే ఇడ్లీ...
చెన్నై : కమలాతాళ్.. రూపాయి ఇడ్లీ బామ్మ అంటే ఎవరైనా టక్కున ఆమె పేరే చెప్పేస్తారు. తమిళనాడులోని పెరూర్‌కి చెందిన ఈ బామ్మ 80 ఏళ్ల వయసులోనూ ఇడ్లీలు తయారు చేసి ఒక్క రూపాయికే విక్రయిస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్డౌన్ ప్రభావంతో భారీగా నష్టం వాటిల్లినప్పటికీ.. కమలాతాళ్ తన ఇడ్లీల ధరను ఒక్క పైసా కూడా పెంచలేదు. నష్టాలు వచ్చినప్పటికీ పేద ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఒక్క రూపాయికే వేడి వేడి ఇడ్లీ(ఒక ఇడ్లీ ఒక్క రూపాయి), ఘుమఘుమలాడే సాంబారు, రుచికరమైన చట్నీ అందచేస్తుంది. (చదవండి : రూపాయికే ఇడ్లీ.. 2.50 పైసలు గారె) అవ్వకు దాతల సాయం లాక్డౌన్ నేపథ్యంలో కూడా రూపాయికే ఇడ్లీ అందిస్తున్న కమలాతాళ్‌కు పలువురు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. భారతీయార్ విశ్వవిద్యాలయం ఆమెకు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ పి కలిరాజ్ ఆహార, కిరాణా వస్తు సామగ్రిని విరాళంగా ఇచ్చారు. భారతీయార్ విశ్వవిద్యాలయ తలుపులు తన కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని కమలాతాళ్ చెప్పారు. హిందూస్తాన్ స్కౌట్స్ మరియు గైడ్స్ సభ్యులు కమలాతాళ్‌కు అవసరమైన వస్తువులను ఇచ్చారు. కోయంబత్తూర్ సెక్టార్ హెడ్ ప్రశాంత్ ఉతమా మాట్లాడుతూ.. ‘కమలాతాళ్ బామ్మ గురించి చాలా సార్లు విన్నాం. ఆమె ఒక్క రూపాయికే ఇడ్లీ ఎలా అందిస్తున్నారో కూడా విన్నాం. కానీ కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో కూడా ఆమె ఒక్క రూపాయి ఇడ్లీని ఎలా నిర్వహించగల్గుతున్నారో విని ఆశ్చర్యపోయాను. ఆమె చేస్తున్న సేవకు మా వంతుకు కొంత సహాయం చేశాం’ అని అన్నారు. రెట్లు పెంచే ఆలోచన లేదు లాక్డౌన్ వల్ల భారీగా నష్టం వాటిల్లింది. అయినప్పటికీ రేట్లు పెంచే ఆలోచన నాకు లేదు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా రూపాయికే క్వాలిటీ ఇడ్లీ అందించేందుకు ప్రయత్నిస్తున్నాను. చాలా మంది ఇడ్లీల కోసం వస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇక్కడే ఉండిపోయినా వలస కూలీలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. దాతల సహాయంతో వారందరికీ ఒక్క రూపాయికే ఇడ్లీ అందించగల్గుతున్నాను’అని కమలాతాళ్ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో చెప్పారు. -
రూపాయికే ఇడ్లీ
-
రూపాయికే ఇడ్లీ.. 2.50 పైసలు గారె
ఆమె వయసుఎనిమిది పదులు.నిండు పండు ముదుసలి.యువతరం కంటె ఎక్కువ శక్తి, ఉత్సాహం ఉన్నాయి.సామాన్యుల కోసం రూపాయికి ఇడ్లీ తయారుచేస్తోంది.తమిళనాడులోని పెరూర్‌కి దగ్గర ఉన్న వడివేలయంపాలయానికి చెందిన కమలాతాళ్ ఇడ్లీ షాపేఈ వారం ఫుడ్ ప్రింట్స్... కమలాతాళ్. పండు ముదుసలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేస్తుంది. స్వచ్ఛంగా స్నానం చేసి, భగవంతుడిని మనసారా ప్రార్థించి, పొలానికి వెళ్లి, తాజా కూరగాయలు తీసుకొస్తుంది. చట్నీ తయారుచేయడం కోసం రోలు సిద్ధం చేసి, తాజా కొబ్బరి, ఉప్పు వేసి, రుచికరమైన పచ్చడి చేస్తుంది ఈ అవ్వ. సాంబారులోకి కావలసిన కూరలన్నీ స్వయంగా తరిగి, మట్టితో అలికి చేసిన కట్టెల పొయ్యి మీద ఒక గిన్నెలో వేసి ఉడికిస్తుంది. ముందురోజు రాత్రే ఇడ్లీ పిండి రుబ్బి సిద్ధం చేస్తుంది. తమిళనాడులోని పెరూర్‌కి దగ్గరలో ఉన్న వడివేలయంపాలయం గ్రామంలో నివసించే ఈ అవ్వ, తన ఇంటి తలుపులు ఉదయం ఆరు గంటలకు తెరుస్తుంది. అప్పటికే ఇడ్లీ కోసం బోలెడుమంది బయట నిలబడి ఉంటారు. అవ్వ తలుపులు తెరవగానే, వారంతా ఆమెను నవ్వుతూ పలకరిస్తారు. అందరినీ ఆప్యాయంగా చూస్తూ, ఎవరెవరికి ఎన్నెన్ని కావాలో అడుగుతూ, వేడి వేడి ఇడ్లీ, ఘుమఘుమలాడే సాంబారు, రుచికరమైన చట్నీ అందచేస్తుంది అవ్వ. ఇన్నీ కలిపి చాలా ఎక్కువ ధర అనుకుంటే పొరపాటే. ఒక ఇడ్లీ కేవలం ఒక రూపాయి మాత్రమే. ఉదయం ఎనిమిది గంటలవుతున్నా వినియోగదారులు తమ వంతు వచ్చేవరకు ఎంతో ఓరిమిగా నిరీక్షిస్తూ ఉంటారు. ఇంతలోనే తన కోసం ఎవరైనా అతిథులు వస్తే, చిరునవ్వుతో పలకరిస్తుంది ఈ అవ్వ. అంతలోనే లోపలకు వెళ్లి ఒక చేతితో బకీటెడు సాంబారు, ఒక చేతితో ఇడ్లీలు అలవోకగా తెస్తుంటే, ఈ వయసులో ఇంత వేగంగా ఎలా పనిచేయగలుగుతుందా అని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ‘‘మాది రైతు కుటుంబం. ప్రతిరోజూ మా కుటుంబ సభ్యులంతా నన్ను ఇంట్లో వదిలి పొలానికి వెళ్లేవారు. నేను ఒంటరిగా ఉండటంతో విసుగ్గా అనిపించేది. ఏదో ఒక పనిచేయాలనుకున్నాను. ఆ చుట్టుపక్కల ఉండేవారికోసం ఇడ్లీ వేయడం ప్రారంభించాను. ఇప్పుడు నా దగ్గరకు ఎంతోమంది రోజు కూలీలు వస్తుంటారు. అతి తక్కువ ధరలో స్వచ్ఛమైన కల్తీ లేని ఇడ్లీలు తింటున్నామన్న ఆనందం వారికి కలుగుతుంది. నేను వడివేలయంపాలెంలోనే ఇంటి దగ్గరే 30 సంవత్సరాలుగా ఇడ్లీలు అమ్ముతున్నాను’ అంటారు కమలాతాళ్. కమలాతాళ్‌కు చిన్నతనం నుంచి రోట్లో రుబ్బిన పప్పుతోనే ఇడ్లీలు తయారుచేయడం అలవాటు. నేటికీ ఆమె అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. గ్రైండర్ కొనడం అనవసరమని భావించారు ఆమె. ‘‘నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. అందువల్ల ఎక్కువమందికి వంట చేయడం అలవాటు నాకు. ప్రతిరోజూ పప్పు నానబెట్టి, శుభ్రంగా కడిగి, రుబ్బి మరుసటి రోజుకి సిద్ధం చేసుకుంటాను. ఇందుకోసం నాకు ప్రతిరోజూ ఆరు కిలోల పప్పు, బియ్యం కావాలి. రుబ్బడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. రోజూ తాజా పిండినే ఉపయోగిస్తాను. ఉదయాన్నే మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు ఇడ్లీలు అమ్ముతారు కమలాతాళ్. ఒక వాయికి కేవలం 37 ఇడ్లీలు మాత్రమే సిద్ధమవుతాయి. రోజుకి మొత్తం వెయ్యి ఇడ్లీలు అమ్ముతారు ఈ అవ్వ. ‘‘పది సంవత్సరాల క్రితం ఒక ఇడ్లీ అర్ధరూపాయికి అమ్మేదాన్ని. రెండు సంవత్సరాల నుంచి ఇడ్లీ ధర రూపాయి చేశాను’’ అంటారు బోసి నవ్వుల అవ్వ.సాంబారుతో పాటు, రోజుకో కొత్తరకం చట్నీ తయారుచేస్తారు కమలాతాళ్. టేకు ఆకులు, అరటి ఆకుల్లో ఇడ్లీలు అందిస్తారు. వీటిని కూడా తన పొలం నుంచే తీసుకువస్తారు కమలాతాళ్. ‘‘మా ఇంటి చుట్టుపక్కల ఉన్న దిగువ మధ్యతరగతి వారే నా దగ్గర ఇడ్లీలు కొంటారు. వారంతా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారే. అంతా రోజు కూలీలే. అటువంటివారు రెండు ఇడ్లీలు 15 రూపాయలకో 20 రూపాయలకో కొనడం కష్టం.చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో ఒక ప్లేట్‌కి నాలుగు ఇడ్లీలు ఇస్తారు. కాని వీరు చేసే కష్టానికి ఆ నాలుగు ఇడ్లీలతో ఆకలి తీరదు. అందువల్ల కమతాతాళ్ వీరి గురించి ఆలోచించి, తాను తక్కువ ధరకు ఇడ్లీలు పెట్టడం వల్ల వారు నాలుగు రూపాయలు వెనకేసుకోగలుగుతారని భావించారు. ఇంత తక్కువకు ఇస్తున్నా, కమలాతాళ్కి రోజుకి 200 రూపాయలు మిగులుతున్నాయంటారు ఆవిడ. ‘‘ఇడ్లీ ధర పెంచరెందుకు అని నన్ను చాలామంది అడుగుతుంటారు. వారందరికీ నేను ఒకటే సమాధానం చెబుతాను, ఆకలితో ఉన్న పేదవారి కడుపు నింపుతున్నాను. అదే నాకు పెద్ద ఆదాయం’’ అని.కమలాతాళ్ ఇడ్లీల విషయం వార్తల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో, ఆయా ప్రాంతాల నుంచి ఇడ్లీల కోసం వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయినప్పటికీ కమలాతాళ్ ఇడ్లీ ధర ఒక్క పైసా కూడా పెంచలేదు. రాబోయే రోజుల్లో కూడా పెంచనని చెబుతున్నారు. ఈ ఇడ్లీలో సంప్రదాయం ఉంది ఇక్కడి ఇడ్లీ పూర్తి సంప్రదాయంగా తయారవుతుంది. రోట్లో రుబ్బిన పిండి, శుభ్రంగా అలికిన మట్టి పొయ్యి, కట్టెల మంట మీద ఉడికే ఆరోగ్యకరమైన ఇడ్లీ, గారెలతో ఈ అవ్వ ఎంతోమందికి ఆరోగ్యం ఇస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ అవ్వను స్ఫూర్తిగా తీసుకోవాలేమో! ఇదే నా ఆరోగ్య రహస్యం వయసు పైబడుతుండటంతో, మా మనవలు నన్ను ఈ వ్యాపారం మానేసి, ఆరోగ్యం చూసుకో మంటున్నారు. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకు నేను ఈ పని చేయడం మానను. ఇలా చేస్తుండటం వల్లే నేను చాలా చురుకుగా ఉండగలుగుతున్నాను. ఇటీవలే గారెలు కూడా మొదలుపెట్టాను. ఒక్కోగారె ధర 2.50 పైసలు. -
ఒక్క రూపాయికే టిఫిన్!!
-
ఒక్క రూపాయికే టిఫిన్!!
ఒక రూపాయి పెడితే ఏమొస్తుంది.. మహా అయితే ఒక మంచినీళ్ల ప్యాకెట్ వస్తుందేమో. అది కూడా అన్ని చోట్లా కాదు. ఆర్టీసీ బస్టాండ్ల లాంటి చోట్ల అయితే.. మూడు రూపాయలు కూడా అవుతుంది. కానీ, జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే పేదలు, బడుగు జీవులకు ఒక్క రూపాయికే ఉదయపు అల్పాహారాన్ని అందించబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ - సికింద్రాబాద్ జంటనగరాల్లోని 8 కేంద్రాల్లో ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం అందిస్తున్న జీహెచ్ఎంసీ.. ఈ పథకానికి హరేకృష్ణ ఫౌండేషన్ సహకారం తీసుకుంటోంది. పూరీ, ఇడ్లీ, ఉప్మా లాంటి అల్పాహారాలను కూడా ఇక నుంచి ఒక్క రూపాయికే అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ సోమేష్‌కుమార్ సోమవారం వెల్లడించారు. ఐదు రూపాయల భోజన పథకానికి సంబంధించి తాము ఇప్పటికే 8 కేంద్రాలు తెరిచామని, మరో 42 కేంద్రాలు కూడా తెరవాల్సి ఉందని, త్వరలోనే టిఫిన్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన అన్నారు. నిరుపేదలకు ఆరోగ్యకరమైన, వేడివేడి ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ పథకాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.